పరుపు మెత్తదనం హాయినివ్వడం లేదు
పచ్చికను కోల్పోయిన చింత నాది
*
నువ్వు చదివిన కవితా పాదమే అంతిమమనుకోకు
చిత్తులో దాని వెర్షన్స్ ఎన్నో ఉన్నాయి
*
లోకం పల్లమై లాగుతూన్నది
సముద్రంలో కలవడం ఇష్టం లేకే వంకలు పోతున్నాను
*
ఎవరి లెక్కలు వారికున్నాయి
లెక్కలు లేనివాడే కదా మహా ఋషి
*
కొండ చివరాఖర్న కూచొని గొంతెత్తాను
గ్రహ శకలాలన్నీ ఊసులు పోతున్నవి
*
మధువుతో మత్తిల్లి మనసులో గూడుకట్టుకున్న
గోసలన్నీ పాడుతున్నాను
ఈ రాత్రి ప్రకృతి మౌనంగా దుఃఖిస్తున్నది
*
జనాజాకు భుజం అందించడానికి పరుగులు పెడుతున్నారు
వీళ్లంతా నన్ను పాతిపెట్టే దాకే..!
vammo... vayyooo....
ReplyDeletepacchikaloni chittutho vankalu posi,lekkalu chesi ,voosulaadi,mounangaa dhukkistE paathipettaraa mari?
ReplyDeleteవిజయవిహారం ఎడిటర్ రమణమూర్తి గారి పుస్తకంలో మీ గురించి చదివినప్పుడు ఏదో అనుకున్నాను. మీ కవితలు చదివిన తరువాత అర్థమయ్యింది.
ReplyDelete