Thursday, 23 December 2010

నల్లగొర్రె


తలొంచుకుని ముందు నడుస్తున్న
సహచరుణ్ని అనుసరిస్తున్నాయి గొర్రెలన్నీ
తలొంచుకుని నడవడం గొర్రెల అలవాటు కదా

ఓ మందలో ఒక నల్లగొర్రె
తలెత్తుకోవడం నేర్చుకుంది
తుప్పుపట్టిన రీతిరివాజుల్ని ధిక్కరించింది

గొర్రెలన్నీ బెంబేలెత్తిపోయి
తలదించుకొని బతకడం మనజాతి లక్షణమంటూ
నల్లగొర్రె తలదించుకునేదాకా గోల పెట్టాయి

తలదించుకొని గొర్రెలన్నీ సాగిపోతున్నాయి
ఉన్నట్టుండి ముందు గొర్రె ‘బిస్మిల్లా’ అంటూ
ఓ గెట్టు దూకింది
గొర్రెలన్నీ అలాగే అంటూ దూకేశాయి

ఏదో అనుమానమొచ్చిన నల్లగొర్రె
తలెత్తి ముందుకు చూసింది
సహచరులు కనిపించలేదు
కాస్త ముందుకెళ్లి తొంగి చూసింది
గొర్రెలన్నీ ఓ పురాతన బావిలో పడి
గిలగిలా కొట్టుకుంటున్నాయి

నిస్సహాయంగా చూసిన నల్లగొర్రె
పక్కకు తప్పుకొని
కొత్తదారి వేస్తూపోయింది
భవిష్యత్‌ తరాల కోసం

13 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. నేను కూడా అంతే, ఎవ్వడి మాట ఇనను

    ReplyDelete
  3. Mr.Skybaba 'Nalla gorre'is Excellent, very interesting, mind blowing.

    ReplyDelete
  4. షేక్ కరీముల్లాహ్ గారి కవితలు చదివారా? ఉర్దూ మాట్లాడే ఎలైట్ ముస్లింలు తెలుగులో మాట్లాడే పల్లెటూరి ముస్లింలని ఎలా చిన్న చూపు చూస్తారో అందులో వ్రాసారు.

    ReplyDelete
  5. బాగుంది, మీ గొర్రెల కథ.
    అన్ని గొర్రె ఫాలోయర్లు పడిపోతున్నా నల్లగొర్రెకి తెలియలేదు, బ్రతికి పోయింది కాబట్టి మేతావే! :)

    ReplyDelete
  6. దీని ముందు వ్రాసిన టపాకూ దీనికీ సంబంధం ఏమైనా ఉందేమిటండీ?

    ReplyDelete
  7. $ రాఘవ గారు
    ఇక్కడ చూడండి
    http://malakpetrowdy.blogspot.com/2010/12/blog-post_24.html

    తను కసాయి అయితే అందరూ గోర్రేలే కదా!

    కయ్కయ్బెబ్బే ఈ ముక్క కూడా డిలీట్ చేసే లోపల మీరు చూడగలరు :))

    ReplyDelete
  8. మన తెలుగులోనే ఒక సామెత ఉంది. "గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది". హిందీ\ఉర్దూలోకి ఇలా ట్రాన్స్లేట్ చెయ్యొచ్చు "బక్రా ఖస్సాబ్‌కో యకీన్ కర్తా హై".

    ReplyDelete
  9. please watch & subscribe
    http://bookofstaterecords.com/
    for the greatness of telugu people.

    ReplyDelete
  10. తల ఎత్తిన బానిస బానిస కాడు.

    ReplyDelete
  11. స్కై గారు. నిన్న మా మామయ్యకి మీ నల్ల గొర్రె కవిత గురించి చెప్పాను. http://stalin-mao.net.in/40017708

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి