Monday, 10 January 2011
నాలో పులులూ సింహాలు
నా ఒంటి మీది
జీవావరణ్యం ఖబ్జా కు గురయ్యింది
నోటి కాడి కూడు
గూడు తోడు దూరమై
నాలో గర్జిస్తున్న పులుల్నీ సింహాల్ని
కట్టి పెట్టాను
బుసలు కొడుతున్న
కోడె నాగుల్నిపట్టి పెట్టాను
పక్షులు ఆక్రోశంతో అరుస్తున్నాయ్
జింకలూ లేళ్ళు సైతం
పోరుకు సిద్ధమైనయ్
ఇక
నా ఒంటి నరాలు ఒపలేకున్నయ్
కట్లు తెంచుకొని
ఈ జీవజాలమంతా మీద పడితే
ఖబ్జాకోరులారా!
ఖతమౌతరు బిడ్డా..
ఖబడ్దార్!
(జై తెలంగాణ!
ఇంత మోసమా..? తెలంగాణ ప్రజలను మోసం చేసి, ఉద్యమాన్ని అనిచేద్దామని చూడడం ఎంత అన్యాయం..? ఒక సమత్సరం ఓపిక పట్టమని ఇవాళ తెలంగాణ ఇవ్వకుండా దగా చేద్దామంటే తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు.. ఇది పోరాటాల గడ్డ! పోరాడి సాధించుకుంటాం..
ఎంతదాకా పోయినా సరే..!)
Subscribe to:
Post Comments (Atom)
తెలంగాణా వస్తే కోస్తా ఆంధ్రలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలు అభివృద్ధి చెందుతాయి. విజయవాడ, గుంటూరుల సమీపంలో ఉన్న మంగళగిరి, తెనాలి కూడా అభివృద్ధి చెందుతాయి. చిన్నప్పుడు మేము వరంగల్, కాజీపేట, కరీంనగర్‌లలో ఉండేవాళ్లం. నిజమే కానీ నేను తెలంగాణాకి సపోర్ట్ ఇవ్వడానికి కారణం అది కాదు. అభివృద్ధిలో ప్రాంతీయ అసమానతలు సమాజానికి ఆరోగ్యకరం కాదు. అందుకే తెలంగాణాకే నేను అనుకూలం. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణా ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడానికి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన పరిమిత అధికారాల కమిటీ అని ముందే అనుకున్నాను. నివేదిక చూసిన తరువాత కాంగ్రెస్ చేసిన మోసం కన్ఫర్మ్ అయ్యింది.
ReplyDeleteభలే కనిపెట్టావు ప్రవీణు నువ్వు తెలుసుకున్నంత కూడ కేసి అర్ తెలుసుకోలేకపోయాడు ....
ReplyDeleteఅది సరే విజయవాడ, గుంటూరుల సమీపంలో ఉన్న మంగళగిరి, తెనాలి ఎలా అభివృద్ది చెందుతాయ్ కాస్త చెప్పు
This comment has been removed by a blog administrator.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteika maatlaadEdhEmi lEdhu-chEthalu thappa.jai telangana
ReplyDeleteశరత్
ReplyDeleteవిజయవాడ, గుంటూర్ ల అభివృద్ధిలో అసమానతలు ఉండరాదని
వీజీఎంటీ ఉడా అంటే విజయవాడ గుంటూరు మంగళాగిరి తెనాలి కలుపుకొని సంయుక్తంగా అభివృద్ధి చెయ్యాలని ఒక సంస్థను రూపొందించారు.
అందుచేత అక్కడ అవికూడా కవర్ అవుతాయి
మొన్నటి వరకు తెలంగాణా ప్రజలు నిద్రిస్తున్న సింహాలు
ReplyDeleteరాజశేఖరరెడ్డికి ఆ సింహాల వోట్లు అవసరమయ్యాయని
తెలంగాణా ఇస్తామని చెప్పాడు
ఆ సింహాలని నిద్రలేపాడు
అవి నిద్ర లేచిన తరువాత
ఏప్రిల్ ఫూల్ అని వాటిని ఎగతాళి చేశాడు
అనుకోకుండా ఆ రాజశేఖరుడు
హెలికాప్టర్ ప్రమాదంలో చచ్చాడు
చచ్చినవాళ్ళని చెయ్యగలిగేదేమీ ఉండదు
బతికున్న లగడపాటి & కో లాంటి రాక్షసుల
గుండెల్ని చీలుస్తాయి తెలంగాణా సింహాలు