కొత్తగా వెలువడ్డ స్కైబాబ ముస్లిం కథల సంపుటి 'అధూరె' సభలు నాలుగు జిల్లాల్లో జరగనున్నాయి. ముస్లిం ల చితికిన జీవితాలు, ముస్లిం లను దగాపడేలా చేసిన రాజకీయాలు, దేశ విభజనకు, హైదరాబాద్ ఆక్రమణ.. తదితర అంశాలపై 'అధూరే' వాహికగా చర్చ జరిగేందుకు ప్రతి జిల్లాలో సభలు పెడుతున్నాం..
గుంటూరు: బహుజన రచయితల సంఘం నిర్వహణలో ఈ నెల 11న సా.5.30 గం.లకు గుంటూరులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 'అధూరె'ను షంషాద్ బేగం ఆవిష్కరిస్తారు. అధ్యక్షత: కాకాని సుధాకర్. వై.కె, డా.జిలుకర శ్రీనివాస్, సుభాని, శోభారాణి తదితరులు పాల్గొంటారు.
విజయవాడ: ఈ నెల 12న సా.6 గం.లకు మొగల్రాజపురంలోని చండ్రరాజేశ్వరరావు గ్రంథాలయంలో పెద్దిభొట్ల సుబ్బరామయ్య 'అధూరె'ను ఆవిష్కరిస్తారు. పొయిట్రీ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగే ఈ సభలో డా.చల్లపల్లి స్వరూపరాణి, జిలుకర శ్రీనివాస్, సయ్యద్ నశీర్అహ్మద్, వంశీకృష్ణ పాల్గొంటారు.
విజయనగరం: ఈ నెల 13న గురజాడ కేంద్ర గ్రంథాలయంలో 'అధూరె' పరిచయసభ. జి.ఎస్.చలం, దుప్పల రవికుమార్, బల్లెడ నారాయణమూర్తి తదితరులు పాల్గొంటారు.
విశాఖపట్నం: ఈ నెల 14న ద్వారకానగర్‌లోని విశాఖ పౌరగ్రంథాలయంలో 'అధూరె' పరిచయ సభ. మిత్ర సాహితి ఆధ్వర్యంలో జరిగే ఈ సభలో కాళీపట్నం రామారావు, వివినమూర్తి, అట్టాడ, ప్రసాదవర్మ, రామతీర్థ, మల్లీశ్వరి, చలం, చిత్ర, అర్నాద్, ఎల్ఆర్ స్వామి తదితరులు పాల్గొంటారు. కర్నూలు, అనంతపురం, వరంగల్ తదితర జిల్లాల్లోనూ సభలు జరుగనున్నాయి. ఈ సభలన్నింటిలోనూ స్కైబాబ పాల్గొంటారు.
అనంతపురం: 26 న ఇమామ్ అధ్యక్షతన బండి నారాయణ స్వామి 'అధూరే' ను ఆవిష్కరిస్తారు.
సింగమనేని నారాయణ, జూపల్లి ప్రేమ్ చంద్, కుళ్ళాయ స్వామి, జిలుకర శ్రీనివాస్ పాల్గొంటారు
- 'హర్యాలి' ముస్లిం రచయితల వేదిక
(printed at VIVIDHA, Andhrajyothi-6.2.12)
No comments:
Post a Comment
మీ అభిప్రాయం తెలియజెయ్యండి