Sunday 16 October, 2011

పుట్టుమచ్చ నుంచి పోరు జల్‌జలా


(ఇవాళ ఆంధ్ర జ్యోతి 'వివిధ'లో వచ్చిన వ్యాసం..)

ఒక అందమైన తోట/ఆ తోటలో రకరకాల పూలు
రంగురంగుల పూలు/గులాబీలు మందారాలు చమేలీలు
మొగలిపూలు బంతిపూలు గుల్‌మొహర్‌లు...
అన్ని రకాల పూలతో చాలా అందంగా కనబడుతుందా తోట!
అయితే/ ఆ పూలన్నింటినీ నలిపేసి, తొక్కేసి, కోసేసి
ఒక్క కమలమే విస్తరించాలంటే
ఆ తోట అందమంతా ఏమైపోతుంది?!
                                    అంటున్నాడు ముస్లిం కవి ఆఫ్రీన్.
ఏ సమాజంలోనైనా మెజారిటీ మత భావజాలం ఆవరించి ఉంటుంది. ఆ భావజాలంలోంచే మెజారిటీ ప్రజల చర్యలుంటాయి. దానివల్ల మైనారిటీల మనోభావాలు దెబ్బతింటుండడాన్ని కూడా ఎవరూ పట్టించుకోరు. మైనారిటీల దృష్టికోణం నుంచి చూసే దృక్పథాన్ని ముస్లింవాద సాహిత్యం అందించింది. ఆ కోణం నుంచే ఈ కవిత్వం... 

ముఖ్యంగా ముస్లింవాదం రెండు రకాల పోరాటం చేసింది- బాహిర్ పోరాటం. అంతర్ పోరాటం. బాహిర్ పోరాటంలో భాగంగా ఖాదర్ మొహియుద్దీన్ 'పుట్టుమచ్చ'ను చూడొ చ్చు. ముస్లింల అభద్రత, వివక్ష, అణచివేత, తద్వారా పేదరికం మొదలైనవి. ముస్లింలు మన దేశంలో అతిపెద్ద సమూహం. ఈ సమూహాన్ని విస్మరించి పురోగతి సాధించడం సాధ్యం కాదు. అన్ని రంగాల్లోనూ ముస్లింల విలువైన, ప్రత్యేకమైన ప్రాతినిధ్యం ఉంది. దేశ ప్రగతిలో ముస్లింల శ్రమ, కృషి ఎంతో ఉంది. ఆ విషయాన్ని విస్మరింపేజేసి ముస్లింలను అట్టడుక్కి తొక్కేసే ప్రయత్నం జరిగింది.. జరుగుతున్నది. 

అంతర్గత సంస్కరణలు కోరడం ముస్లింవాదం ప్రత్యేకత. ఆ కోణం నుంచి బలమైన కవిత్వం వచ్చింది. అయితే ఈ ముస్లింల అంతర్గత సమస్యల పైన వచ్చిన కవిత్వానికి 'ఆహా! ఓహో!' అన్నంత స్థాయిలో హిందూత్వ దాష్టీకం, వివక్ష, అభద్రతలపై వచ్చిన కవిత్వం పట్ల మౌనం వహించడం మేము గమనించాం. అంటే చైతన్యవంతులైన వారిలోనూ హిందూత్వ అంశ ఉన్నట్లు దీనివల్ల రుజువైంది.

'ముస్లింవాద' సంఘర్షణ: 
ఇవాళ ముస్లింవాద సాహిత్యంపై ఎంఫిల్‌లు, పిహెచ్‌డీలు, చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సాహితీ పెద్దలు ముస్లింవాదాన్ని లెక్కలోకి తీసుకుంటున్నారు. కాని ఈ పరిస్థితికి ముందు, ముస్లింవాదం ఒక వాదంగా నిలబడడానికి ముస్లింవాదులుగా ఎన్నో సంఘర్షణలు ఎదుర్కోవలసి వచ్చింది.. 

నల్గొండ కేంద్రంగా ఒక ముస్లిం కవితా సంకలనాన్ని తీసుకువచ్చే పనిలో ఏడాదిన్నరపాటు శ్రమించాల్సివచ్చింది. అది 'జల్‌జలా' ముస్లింవాద కవితాసంకలనంగా వచ్చింది. ఆ సమయంలో ఎన్నో చర్చలు, సంఘర్షణ, వాదోపవాదాలు జరిగాయి. అంతలో విరసం 'జిహాద్' వేసింది. పత్రికల్లో చర్చ జరిగింది. అందులోని కవిత్వాన్ని మినహాయిస్తూనే సంకలనం తేవాలనుకున్నాం. 

దీనిని ఏ కవిత్వం అందాం అన్న దగ్గర ఎంతో సంఘర్షణ జరిగింది. విరసం 'ముస్లిం మైనారిటీ కవుల కవిత్వం' అన్నది. మైనారిటీ పదం వాడడంలో న్యూనతాభావం కొట్టిచ్చినట్లు కనిపిస్తుంది. ఎవరు మైనారిటీ? ఎవరు మెజారిటీ? అనేది మరో చర్చ. స్త్రీవాదం, దళితవాదం లాగా ముస్లింవాదం అనడంపై ఎన్నో రకాలుగా ఆలోచించాం. కాని ముస్లింవాదం అంటే ఎక్కడ మతముద్ర వేస్తారో అనేది సంశయం. కాని ఇస్లాంవాదం అంటే మతం పరిధిలోకి వెళ్తుంది, 

ముస్లిం అంటే ఒక సమూహ నామం అనే దృష్టితో చివరికి దాన్నే ఖాయం చేశాం. చర్చల్లో కొన్ని విషయాలు ఎంతకూ తెగేవి కావు. చివరికి అంతర్ పోరాట కవిత్వం రాసిన మా కవితలకు మేమే బాధ్యత వహిస్తాం, వేరెవరికి సంబంధం లేదు కాబట్టి వారు భయపడవలసిన అవసరం లేదంటూ గట్టిగా నిలబడ్డాం. ఈ విషయంలోనే ముస్లింవాదులు ఏ అస్తిత్వవాదులూ ఎదుర్కోని సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ కవులు ఏ సమూహానికైతే ప్రతినిధులుగా రాస్తున్నారో ఆ సమూహంలోని మెజారిటీ ప్రజలే సంస్కరణవాద కవిత్వం పట్ల అయిష్టంగా ఉండడం విషాదం. 

ముందుమాటలు ఎవరితో రాయించాలనేది కూడా సంఘర్షణే. ముస్లింవాదానికి ఆదికవి ఖాదర్‌తోనే రాయించొచ్చు. కాని ఆయన అంతర్ పోరాట కవిత్వాన్ని ఆహ్వానించడంలేదు. ఆ విషయంలో రాజీ పడకుండా అఫ్సర్‌తో రాయించాం. ఈ సంకలనం విషయం లో ఆదినుంచీ మాకు భావజాలపరంగా, అన్ని రకాలుగా అండగా నిలిచిన సుంకిరెడ్డి నారాయణరెడ్డి విలువైన ముందుమాట రాశా రు. 

ముస్లింలది పౌరహక్కుల సమస్య కూడా అనే కోణం నుంచి ఎమ్‌టి ఖాన్‌తో రాయించినా, దాన్ని తెలుగు చేసి ఇస్తూ బాలగోపాల్, ఐడెంటిటీ ఉద్యమాల విషయంలో నా అభిప్రాయం వేరు, మీకు ఇష్టమైతే నేను రాసి ఇస్తాను అన్నారు. సంతోషం సార్, రాసివ్వండి అన్నాను. దాంతో ఆయన జల్‌జలాకు ముందుమాట రాశా రు. అస్తిత్వ సాహిత్య ఉద్యమాలపై బాలగోపాల్ మొదటగా రాసిన వ్యాసం ఇది. 1997లోనే ఆయన దళిత, స్త్రీ, గిరిజన, ముస్లిం, బహుజన అస్తిత్వ ఉద్యమాలపై ఎంతో వివరంగా రాశారు. 

నిజంగానే పెన్నా శివరామకృష్ణ ఒక సమీక్షలో అన్నట్టు 'జల్‌జలా' భూకంపమే పుట్టించింది. కాకపోతే- ఒకవైపు, ముస్లిం చాదస్తులు, మరోవైపు హిందూత్వవాదులు ఎక్కడ గొడవ చేస్తారోననే భయంతో ఆ సంకలనం పుట్టినచోటే ఆవిష్కరణ జరుపుకోలేదు. అందులోని కవితల బలం అంత తీవ్రమైనది. 

మరి ముస్లింలు ఎవరు?
మనదేశంలో 15 కోట్లకు పైగా ముస్లింలున్నారు. పాకిస్తాన్‌లోనూ దాదాపు అంతే. బంగ్లాదేశ్‌లో 8 కోట్లు. మరి ఇంత జనాభాకు కారణమైన ఈ ఉపఖండంలో మొదట్లో ముస్లింలుగా మారినవాళ్లు ఎవరు? ఏయే కారణాల వల్ల మారారు? ఈ ప్రశ్నలకు హిందూత్వవాదుల ప్రచారమే ఎక్కు వ ప్రాచుర్యం పొందింది. 2004లో ముస్లింలు రకరకాల సంఘాల ద్వారా ముస్లిం రిజర్వేషన్‌కోసం పోరాడుతుండడంతో వారికి 4 శాతం రిజర్వేషన్ కల్పించబడింది. ఆ సందర్భంలో ముస్లింలను బీసీ ల్లో కలపడాన్ని కొన్ని బీసీ సంఘాలు వ్యతిరేకించాయి. అప్పటికి 'మర్ఫా' పేరుతో రిజర్వేషన్ కోసం పోరాడు తున్న మేము షాకయ్యాం. బీసీ లు మమ్మల్ని బీసీల్లో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నారు, హిందూత్వవాదులు మేము ఈ దేశస్థులమే కాదని ప్రచారం చేస్తున్నారు.. దీంతో '..మరి ముస్లింలు ఎవరు?' అనే పరిశోధనాత్మక కరపత్రం వెలువరించాం. 

మన ఉపఖండంలో ఇంతగా ముస్లిం జనాభా పెరగడానికి ముస్లిం రాజుల పాలనలో రకరకాల అవసరా లు, అవకాశాల కోసమే కాకుండా మరో బలమైన కారణమూ ఉందని ప్రకటించాం. 
గుడి అంటని
ఇక్కడి మట్టి బిడ్డల కాడికే
నడిచొచ్చిన దేవుళ్లు సూఫీలు...

'అసుంట! అసుంట!' నిలిపిన మూలాన్ని
అలాయిబలాయి తీసుకున్న దిల్! - స్కైబాబ, 'అలావా' ముస్లిం సంస్కృతి కవితా సంకలనం 

బడికీ, గుడికీ ఆఖరికి ఊరికీ అంటరానివాళ్లుగా చేయబడిన ఈ దేశ మూలవాసుల వాడల్లోకి నడుచుకుంటూ వచ్చారు సూఫీ 'దేవు ళ్లు'! వచ్చి వాళ్లని అక్కున చేర్చుకున్నారు. బ్రాహ్మణ సంస్కృతి అసుంట అసుంట అంటే సూఫీలు వాళ్లకు గుండెకు గుండెను కలిపే అలాయిబలాయి ఇచ్చారు. వాళ్లు తాగిన గిలాసుల్లో నీళ్లు తాగారు. వాళ్లతోపాటు కూచొని బువ్వ తిన్నారు. అగ్రహారాల వీధుల నుంచి వాళ్ల శవాల్ని కూడా తీసుకెళ్లనివ్వని దుష్ట సంస్కృతిని బద్దలుచేస్తూ వాళ్ల శవానికి భుజం పట్టారు. 

మజీదుకు వెళ్తే భుజం భుజం కలిపి నమాజు చదివించా రు. ఆ గరీబుల గుండెలు చెరువులయ్యాయి.. వాళ్లు తమ దేహాల తో కాదు, గుండెలతోనే సూఫీలను అలాయిబలాయి తీసుకున్నారు. వాళ్లలో ఒకరైనారు. తమకు కష్టమొస్తే నష్టమొస్తే మంచి మాటల్తో తమని ఓదార్చే, ఆదరించే ప్రవక్తలయ్యారు సూఫీలు. తమకు రోగమొస్తే, రొష్టొస్తే అభయమిచ్చే దేవుళ్లయ్యారు. దాంతో వాళ్లంతా ముసల్మానులయ్యారు. వాళ్లు ఈ దేశ మూలవాసులు. ద్రావిడులు. మాదిగలు, మాలలు. ఆదివాసీలు. బీసీలు. ఇతర కులాలవారు. 

కేవలం 2 నుంచి 3 శాతం ముస్లింలు మాత్రమే బైటి దేశాల నుంచి వచ్చినవారు. మిగతా 97 శాతం ఈ దేశవాసులే. అందులో అధికభాగం 'అంటబడనివ్వని' కులాలనుంచి, 'వెనకబడేయబడ్డ' కులాలనుంచీ ఇస్లాం స్వీకరించినవారే. ఈ దేశమూలవాసులే. ఈ విషయాన్ని తొక్కిపెట్టి హిందూత్వవాదులు ముస్లింలను బైటి దేశస్తులుగా దుష్ప్రచారం చేశారు. 

నీగ్రోలను, తెల్లవాళ్లను చూడగానే గుర్తుపట్టవచ్చు. ఇరానియన్లను, అఫ్ఘానిస్తానీలను గుర్తుపట్టవచ్చు. మన ఉపఖండంలోనే ఉన్న నేపాలీలను చూడగానే గుర్తుపడతాం. అలాగే బైటి దేశస్తులు ఇక్కడి ముస్లింలను చూడగానే ఇండియన్లుగానే గుర్తుపడతారు! తరువాతే పేరు చెబితే ఇండియన్ ముస్లింలుగా గుర్తు పడతారు. ఎందుకంటే ఆంత్రొపాలజీ ప్రకారం- భూగోళం మీది ఉష్ణోగ్రతలను బట్టి ఒక్కో ప్రాంతంలోని మనుషులు ఒక్కో తీరుగా ఉంటా రు. వారి కపాలం, ముక్కుదూలం, వెన్నెముక ఒక్క తీరుగా ఉంటా యి. 

అందుకే ఇక్కడి దళిత బహుజనులూ-ముస్లింలు, ఆదివాసీలూ-ముస్లింలు, ఇతర కులస్తులూ-ముస్లింలు అన్నదమ్ముల్లాగే కనిపిస్తారు. ఎందుకంటే వాళ్లే ముస్లింలైనారు కాబట్టి. అందుకే ముస్లింలు ఈ దేశ మూలవాసులని ముస్లింవాదం స్పష్టం చేసింది. ఆదివాసీ-దళిత-బహుజనుల 60కి పైగా వృత్తుల్లో ముస్లింలు కొనసాగుతున్నారని కొన్ని నివేదికలు చెబుతుండడం మరొక ఆధారం. దళితవర్గాలు, బీసీల నుంచి ఎక్కువమంది ముస్లింలుగా మారడంతో వాళ్లలో వెనుకబాటు, పేదరికం అలాగే కొనసాగుతున్నాయని అస్ఘర్అలీ ఇంజనీర్ చెప్పడం గమనార్హం. 

ముస్లింలపై హత్యాకాండలు చిన్నప్పుడు 15 ఆగస్టుకు హుషారుగా ఊరేగేది. పెద్దయ్యాక తెలిసింది- స్వాతంత్య్రానికి ముందు దేశవిభజన జరిగిందని, లక్షల మంది ఊచకోత జరిగిందని! ఆంధ్రప్రదేశ్ అవతరణరోజూ ఊరేగేవాళ్లం. తర్వాత తెలిసింది- పోలీస్ యాక్షన్‌లో 50 నుంచి 2 లక్షలమంది ముస్లింల ఊచకోత జరిగిందని! (దానికి సంబంధించిన రిపోర్టును 'ముల్కి' ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచికలో వేసిన తరువాతే ఆ విషయం కొంద రు మాట్లాడ్డం మొదలుపెట్టారు.) 

కమ్యూనిస్టుల ఊచకోతను చెప్పడానికి వారికి ఎన్నో సంస్థలున్నాయి, కాని ముస్లింలకేవి? పోలీస్ యాక్షన్‌లో చంపబడ్డ వాళ్ల కుటుంబాలు, దోపిడీకి గురైనవారి కుటుంబాలు ఎంతగా చితికిపోయి ఉంటాయి? ముస్లింలందరిపై రజాకార్ల పేరుతో దాడులు చేస్తుంటే అన్నీ వదులుకొని పట్టణాలకు పారిపోయి వచ్చేసిన ముస్లింలు ఎంత పేదలైపోయి ఉంటారు! 

'వాళ్లూ వాళ్లూ కలిసి పంచుకున్న ఊళ్ల మధ్య
నా రక్తం ఏరులై పారింది' 
                            -అంటాడు ఖాదర్. దేశ విభజనతో ఇక్కడి సామాన్య ముస్లింలకు ఏం సంబంధం? వాళ్లూ వాళ్లూ కలిసి తీసుకున్న నిర్ణయం ఎంతటి రక్తపాతాన్ని సృష్టించిందో తెలిసిందే. ఉన్న ఊరు-కన్నతల్లిని వదిలి వెళ్లలేక, తమ మూలాల్ని, వేర్లను తెంచుకుని వెళ్లలేక పుట్టిన గడ్డనే హత్తుకుని ఉండిపోయిన ఈ దేశపు ముస్లింలకు ఎంతటి దుర్గతి పట్టించారు ఇక్కడి పాలకులు, హిందూత్వవాదులు. అనుక్షణం అవమానపరుస్తూ మాతృదేశంలోనే వారి మనసుల్ని ఛిద్రం చేశారు. చివరికి రోడ్డుసైడు చిల్లర వ్యాపారాలకు మాత్రమే ముస్లింలు పరిమతమయ్యేలా చేశారు. 

1992లో బాబ్రీ మజీదు కూల్చబడింది. మరోసారి ముస్లింల ఊచకోత. దేశంలోని లౌకికవాదులైన ముస్లింలంతా హతాశులయ్యారు. దేశవ్యాప్తంగా అన్నాళ్లు ముస్లింలుగా మాట్లాడ ని ముస్లింమేధావులు, రచయితలంతా ముస్లిం లుగా మాట్లాడాల్సిన అవసరాన్ని గుర్తించారు. తెలుగు సాహిత్యంలోనూ అదే జరిగింది. మళ్లీ పదేళ్లకు 2002లో గుజరాత్‌లో జెనోసైడ్ జరిగింది. వేలమంది ముస్లింల ఊచకోత సాగింది. దానికి హిందూత్వ సంస్థలు, పార్టీలు నాయకత్వం వహించాయని మీడియా, మేధావులు, ప్రజాస్వామికవాదులు తమ కథనాలద్వారా, పుస్తకాల ద్వారా రికార్డు చేశారు. 

దేశమంతా నిరసన వ్యక్తమైంది. తెలుగు సాహిత్యంలోనూ వందలకొలది కవితలు, కథలు, వ్యాసాలు అచ్చయ్యాయి. తెలుగు కవులు 30 మంది గుజరాత్ వెళ్లి పరిస్థితిని అధ్యయనం చేసి వచ్చారు. వచ్చి సభలు పెట్టారు. 'గుజరాత్ గాయం' పేరుతో 200మంది కవులతో సంకలనం తెచ్చారు. అలాగే నేను అన్వర్ కలిసి 36 మంది ముస్లిం కవులతో 'అజాఁ' పేరుతో కవిత్వం తీసుకొచ్చాం. 17 రోజులు గుజరాత్‌లో తిరిగి వచ్చిన నా అనుభవం అందుకు తోడ్పడింది. 

ఆ సంకలనానికి ముందుమాట రాస్తూ స్మైల్ ఇలా అన్నారు- 'ఈ సంకలనం.. గుండె వుంటే చదవాలి. దిటవు చేసుకు చదవాలి. లేకుండా చదివిన వారికి ఓ గుండె ఏర్పడి స్పందిస్తుంది. వీరి విషా ద కవిత్వ నేపథ్యంలో ఒక ఆలోచన ప్రత్యామ్నాయాల, ఐడెంటిటీ ల దిశగా అంకురిస్తుంది. ఆ అంకురం కోసమే... ఈ సంకలనం.' అన్వర్ తన సంపాదకీయంలో 'దేశపతాకంలోని కాషాయం తెలుపును ఆక్రమించేస్తోంది' అన్నారు. నా గుజరాత్ అనుభవాలన్నీ నా సంపాదకీయంగా రాశాను. ఈ సంకలనం ఒక జాతి మేధాన్ని ప్రశ్నించిన సంకలనంగా సమీక్షకుల చేత రికార్డు చేయబడింది. 

గర్భంతోనున్న ఒక స్త్రీ కడుపుని చీల్చి పిండాన్ని బైటికి తీసి త్రిశూలంతో ఆడించి మంటల్లో వేసిన సంఘటన యావత్ భారతదేశాన్ని కలచివేసింది. అందుకే- 'ఇప్పుడు మాతృగర్భంలోంచే పెకటించబడ్తున్న మా ఉనికి' -అన్నాడు వలీ హుసేన్. మనది సెక్యులర్ దేశం అని ప్రపంచమంతా కొనియాడుతుంటే గుజరాత్ నరమేధం మాత్రం ఇక్కడ హిందూత్వ ఫాసిజం రాజ్యమేలుతున్న ట్లు స్పష్టం చేసింది. దాంతో మనస్తాపం చెందిన మహమూద్ ఇలా అన్నాడు-'మితృలారా! 'కఫన్' కప్పబడిన సెక్యులరిజం జనాజాకు 
మీ భుజం ఖాళీ వుంటే పట్టండి...' గుజరాత్ అంటే ఐదారేళ్ల పసివాడికి పెట్రో లుతాగించి ఆ లేత పెదాలపై అగ్గిపుల్ల అం టిస్తే ఆ చిన్నారి దేహం ఫట్‌మని పేలిపోయిన అమానవీయ దృశ్యం! తల్లుల ముందే పిల్లల్ని పిల్లల ముందే తల్లుల్ని సామూహికంగా చెరిచి ముక్కలుగా నరికి తగలబెట్టిన వైనం! పాడుబడిన బావిలోకి ముస్లింలను విసిరేసి పైనుంచి రాళ్లెత్తేయడం.. ప్రాణభయంతో పారిపోతున్న 70 మందిని టెంపోలోనే సజీవ దహనం చేయ డం..
మాజీ ఎంపి జాఫ్రితో పాటు ఆయన బిల్డింగ్‌లో తలదాచుకోడానికొచ్చిన 100 నుం డి 150 మందిని చంపి తగలబెట్టడం.. తన తల్లిని తగలబెడుతున్న దృశ్యం కళ్లల్లోకి ప్రసరించిన ప్రతిసారీ ఏడేళ్ల ఇమ్రాన్ పెడుతున్న కేక.. దఫన్ చేసుకోడానికి దేహాలు కూడా మిగలని వందలూ వేల బూడిద కుప్పలు! భార్యల కనురెప్పల మీదే భర్తల దహనం.. భర్తల పిచ్చి చూపుల ముందే బరిసెలు దిగబడిన యోనుల రక్తం కేకలు...

5 నుంచి 10 వేలమంది దాకా గుంపుగా కత్తులు, త్రిశూలాలు, పిస్తోళ్లు, యాసిడ్ పట్టుకొని ఒక్కొక్క ఊరిలో ఉన్న ముస్లిం బస్తీల మీద పడి చంపుతుంటే తప్పించుకున్న ఏ కొందరో పారిపోయి చెట్లనకా, గుట్టలనకా, పగలూ రాత్రనకా కిలోమీటర్ల కొద్దీ పరుగులు తీశారు. ఆ అనుభవంలోంచి- 

'రామబాణంతో వాళ్లు/
విష్ణు చక్రంతో/కృష్ణ చక్రంతో వాళ్లు/ శివుని త్రిశూలంలో వాళ్లు/హనుమంతుని గదతో వాళ్లు.../అయ్ అల్లాహ్!/ఈ చేతులు ఉట్టి దువాకేనా?!' -అజాఁ సంకలనం తిరిగి ఊర్లలోకి వద్దామంటే హిందూత్వవాదులు రకరకాల షరతులు విధిస్తే బిత్తరపోయిన ముస్లింలు ఊరిబైటే ఉండిపోయారు- 'దళిత వాడలు ఊర్లలో కలుస్తున్న ఆనం దం/ఒళ్లంతా పారక ముందే/ఇప్పుడక్కడ ఊరి బైట/ముస్లిం వాడలు వెలిశాయి' అని ఆవేదన పడ్డాడు ముస్లిం కవి. ఇప్పుడీ దేశాన్ని ఏ జీవజలంతో కడిగినా పోని రక్తపు వాసన/కాళ్ల కింది నేలే కాదు/ కరిగిన ఆకాశం కూడా మురికైపోయింది' అం టాడు ఖాదర్ షరీఫ్. 'నీకు నాకు మధ్యా రక్త సంబంధం లేదంటావా?/గుండెల్ని పెకిలించి/పొట్టలు చీల్చి /యోనుల్లో ఆయుధాలు పొడిచి/ఇవ్వాళ నువ్వు చావుల విందు చేసుకొనుండొచ్చు/కానీ 'నన్ను' హత్య చేయలేవు/అనంతంగా సాగే జీవనదిని/నేను బతకడమే కాదు/నిన్ను పుట్టించి బతికించేదీ నేనే..!/అయినా/స్త్రీ తప్ప మగాణ్ణి క్షమించేదెవరు?/ఎన్నటికీ ప్రపంచం/నా రొమ్ము తాగుతున్న పసిబిడ్డే..!' -అన్నది షాజహానా.

'హమ్ మర్కే భి జగాతే హెఁౖ సోయీ హుయీ దునియాఁ కో' -అన్నాడు అలీ. నిజమే! వేలమంది ముస్లింలు హత్య చేయబడితే గాని భారతదేశం ఉలిక్కిపడలేదు! మన లౌకికవాదులూ, ప్రజాస్వామ్యవాదులూ, మార్క్సిస్టులూ, మావోయిస్టులూ అంతా దిగ్గున లేచి కూర్చున్నారు. వేలమంది ముస్లింల బలిదానం జరిగితేగాని ఈ దేశంలో హిందూత్వవాదు లు ఏం చేయబోతున్నారో అర్థం కాలేదు. 
అందరూ మేల్కొన్నట్లే అనిపించింది. కానీ మతోన్మాదుల్ని నిలువరించే, కనీసం అది చేసే దుష్ట చర్యల్ని నిలువరించే కార్యక్రమాన్ని కూడా ఎవరూ చేపట్టలేదు. ఊరకే ఉపన్యాసాల్లో హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతాం అంటే సరిపోతుందా? కొన్ని సభలు చేస్తే పుస్తకాలేస్తే మన బాధ్యత నెరవేరినట్టేనా? అందుకే ప్రధాని పదవికి మోడీని ముందుకు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. గుజరాత్ ముస్లింల నరమేధం సాక్షిగా మోడీని ఎన్నటికీ ఈ దేశ ప్రజాస్వామిక, లౌకికవాదులు అంగీకరించరని ఆశిద్దాం. లేదంటే ఈ దేశం మరెన్నో గుజరాత్‌లను చూడాల్సి వస్తుంది. 
                                                                                                       - స్కైబాబ
(ఆంధ్ర సారస్వత పరిషత్‌లో 14.9.11న 'ముస్లింవాద కవిత్వం'పై ఆలూరి బైరాగి స్మారకోపన్యాసంలోని కొన్ని భాగాలు-ఒక కోణం)

17 comments:

  1. "లేదంటే ఈ దేశం మరెన్నో గుజరాత్‌లను చూడాల్సి వస్తుంది." - లేదు, లేదు.. భయపడకండి, మమ్మల్ని భయపెట్టకండి. ఎందుకంటే.. ఈ దేశం గుజరాత్ ను చూట్టానికి కారణం దానికి ముందు గోధ్రాను చూడటమే. గోధ్రా వచ్చింది కాబట్టే గుజరాత్ వచ్చింది. ఫుల్ స్టాప్!

    ఆ తరవాత మళ్ళీ గుజరాత్ ఎప్పుడూ రాలేదు, ఎంచేతంటే మళ్ళీ గోధ్రా రాలేదు కాబట్టి. మళ్ళీ గోధ్రా రాకపోడానికి కారణం గుజరాత్ రావడమే! మరోసారి గోధ్రా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా కనిపించడం లేదు. అంచేతే మరో గుజరాత్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అది కేవలం ప్రతిస్పందనే!

    మీరు భయపడాల్సింది, జనాన్ని భయపెట్టాల్సిందీ.. ప్రతిస్పందనల గురించి కాదు. దాడుల గురించి. దాడులను చాప కిందకు తోసేసి దాచిపెట్టకండి, వాటి గురించి భయపడండి, జనాన్ని భయపెట్టండి.

    ReplyDelete
  2. గుజరాత్ జరగడానికే గోధ్రా జరిగిందని మీకు తెలియదు కదా చదువరీ.. అక్కడికి వెళ్లి చూసి వచ్చినవారికి అసలు విషయాలు తెలుసు.. మీకు తెలియనప్పుడు ఎందుకు కలిపించుకోవడం చెప్పండి.. ఇప్పటికీ గుజరాత్ ముస్లింలు నరకం అనుభవిస్తున్నారు.. ఊరికే ఎందుకు మీరు భయపడుతున్నారు?

    ReplyDelete
  3. గోధ్రాలో రైలు పెట్టెలు తగలబెట్టినది ISI ఏజెంట్లు. ఇండియా రాజకీయంగా ఎదగకుండా ఉండేందుకు అమెరికా పాకిస్తాన్‌కి ఆయుధాలు అమ్ముతోందని తెలిసినా గ్లోబలైజేషన్ పేరుతో అమెరికానే నమ్ముతున్నామే, అది మన తప్పు. పాకిస్తాన్‌కి యుద్ధ విమానాలు అమ్ముతున్నట్టు అమెరికా బహిరంగంగా ప్రకటించినప్పుడు మన సోకాల్డ్ హిందూత్వవాదులు ఏమి చేశారు? అమెరికా లేకపోతే హైదరాబాద్, బెంగళూరులలోని ఐటి కంపెనీలకి డాలర్లు రావు అని అంటారు. ఐటి కంపెనీలు రాకముందు మన ఇండియాలో ఇనుము & ఉక్కు లాంటి పరిశ్రమలు ఉండేవి కదా. ఇప్పుడు కూడా చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ ప్రాంతంలో 1500 స్టీల్ మిల్స్ ఉన్నాయి. గ్లోబలైజేషన్ అంటే ఏమిటో తెలియని రోజుల్లో పెట్టినవే అవన్నీ. అమెరికావాళ్ళు మనలని రాజకీయంగా దెబ్బతియ్యడానికి ఎంత ప్రయత్నించినా ఏమీ అనము, పైగా గ్లోబలైజేషన్ పేరుతో స్వాగతిస్తాము. పాకిస్తానోడు మన దేశంలో ఎక్కడ బాంబు పేలుళ్ళు సృష్టించినా ముస్లింలని బండ బూతులు తిట్టడానికి నోరు సులభంగా తిరుగుతుంది. ఇదీ మన దేశ భక్తి. కేవలం మతాన్ని నమ్ముకుని అమెరికాకి దూరమైతే హైదరాబాద్, బెంగళూరులలోని ఐటి కంపెనీలకి డాలర్లు రావు, నిజమే. అటువంటప్పుడు మేమేదో గొప్ప మత భక్తులమని చెప్పుకోవడం ఎందుకు? పాకిస్తానీయులని ఎంత బండ బూతులు తిట్టినా ప్రయోజనం ఉండదు. వాళ్ళకి అమెరికా ఆయుధాలు అమ్ముతున్నంత కాలం వాళ్ళ ఉగ్రవాద పనులు వాళ్ళు చేసుకుంటారు.

    ReplyDelete
  4. మతతత్వం మెజారిటీలో ఉన్నా, మైనారిటీలో ఉన్నా అది మతతత్వమే అవుతుంది, నిజమే. కానీ దేశంలో ఎక్కడ మత ఘర్షణలు జరిగినా అక్కడ ఎక్కువగా మైనారిటీలే చనిపోతారు. ఒకవేళ పాకిస్తాన్‌లో ఒక ఉర్స్ ఉత్సవానికి వెళ్ళి వస్తున్న ప్రయాణికులు ఉన్న రైలు బండిలో హిందువులు బాంబ్ పెట్టారనుకుందాం, బాంబ్ పేలి యాత్రికులు చనిపోయిన తరువాత మత ఘర్షణలు జరిగాయనుకుందాం, అప్పుడు సంఖ్యా బలం దృష్ట్యా ఎక్కువగా హిందువులే చనిపోతారు కదా. పాకిస్తాన్‌కి సంబంధించినంత వరకు మతతత్వాన్ని విమర్శిస్తే ముందు ఇస్లామిక్ చాంధసవాదాన్ని విమర్శించాలి, ఇండియా విషయంలో మతతత్వాన్ని విమర్శిస్తే ముందు హిందూ చాంధసవాదాన్ని విమర్శించాలి.

    ReplyDelete
  5. మావోయిస్ట్‌గా నేను అణచివేతకి గురయ్యేవాళ్ళందరికీ మద్దతు ఇస్తాను. వాళ్ళు ఇండియాలోని ముస్లిం మైనారిటీలు కావచ్చు, పాకిస్తాన్ & అఫ్ఘనిస్తాన్‌లలోని హిందూ మైనారిటీలు కావచ్చు, టర్కీలోని కుర్దు జాతీయులు కావచ్చు, శ్రీలంకలోని తమిళులు కావచ్చు, అణచివేత ఎవరిపై చేసినా అది అణచివేతే అవుతుంది.

    ReplyDelete
  6. >>>>>
    బీసీ లు మమ్మల్ని బీసీల్లో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నారు, హిందూత్వవాదులు మేము ఈ దేశస్థులమే కాదని ప్రచారం చేస్తున్నారు.
    >>>>>
    సుప్రీమ్ కోర్ట్ రిజర్వేషన్‌లు 50% కంటే ఎక్కువ ఉండకూడదని తీర్పు చెప్పింది. ముస్లింలకి రిజర్వేషన్‌లలో వాటా ఇస్తే తమకి అవకాశాలు తగ్గిపోతాయనే బిసిలు ముస్లిం రిజర్వేషన్‌లని వ్యతిరేకిస్తున్నారు. వర్గీకరణ గురించి మాలమాదిగలు కొట్టుకోవడం లేదా? ఏ కులంవాళ్ళైనా అంతే, తమకి అవకాశాలు తగ్గిపోతాయనిపిస్తే తమ మనసులో ఉన్నది బయట పెడతారు.

    ReplyDelete
  7. ప్రవీణ్ గారు, మీ అభిప్రాయాలు బావున్నాయి.. కానీ గోధ్రా ఇన్సిడెంట్ వెనక చాలా అనుమానాలున్నాయి. గుజరాత్ మారణకాండ జరపడానికే ప్లాన్డ్ గా గోధ్రా జరిగిందనేది బలమైన వాదన. దారి పొడవునా ఆ ట్రైన్ లోని కొందరిని చంపి ఆ భోగి లో పడేసి నిప్పంటించారనేది ఆ వాదన సారాంశం. గోధ్రా లో జరక్కుంటే మరో చోట ఆ తగలబెట్టడం జరిగేదనేది గుజరాత్ లో బాధితుల వాదన. ఇంకా ఎన్నో వాదన లున్నాయి.. కాబట్టి మనం ఎవరి మీదా దాన్ని ఏకపక్షం గా తోషేయలేము. గోధ్రా జరిగే నాటికే గుజరాత్ అంతా ఒక రకమైన ఆసిడ్ సరఫరా చేయబడి ఉండడం మరో ఆధారం.. ఆ ఆసిడ్ ముందుగ ముస్లిమ్స్ పై చల్లి నరికేయడం చేశారు.. మోడి అనేవాడు అంత క్రూరుడు, అమానవీయుడు అనేది మనం ప్రచారం చేయవలసిన అవసరం ఉంది ప్రవీణ్ గారు..

    ReplyDelete
  8. మోడీ ఏదో అభివృద్ధి చేశాడని అతన్ని తెగ పొగిడేస్తున్నారు. అతను ఎంత హింసావాదైనా అభివృద్ధి చేసిన హింసావాది అని నమ్ముతున్నారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే గుజరాత్‌లో వెనుకబడిన జిల్లాలు ఆరు ఉన్నాయి. ఈ PDF ఫైల్ చదవండి: http://ubuntuone.com/33kWMXKKV9MfpzgFXrwBtY

    ReplyDelete
  9. ఆ PDF ఫైల్‌లో హిమాచల్ ప్రదేశ్‌లో వెనుకబడిన జిల్లాల సంఖ్య తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ టూరిజం ద్వారా ఆదాయం ఎక్కువగా వస్తున్న రాష్ట్రం. గుజరాత్ రైల్వే లైన్లు, ఓడరేవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం. అక్కడ అహ్మదాబాద్-ముంబై రైల్వే లైన్ పక్కన పరిశ్రమలు కూడా ఎక్కువే. కానీ ఆ రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లాలు ఆరు ఉన్నాయి. నరేంద్ర మోడీ ఏదో అద్భుతాలు చేశాడన్నట్టు మాట్లాడుతున్నారు కొందరు.

    ReplyDelete
  10. గోధ్రా రైలు దహనంలో చనిపోయింది 59 మంది. కానీ ఆ తరువాత హింసలో హిందువులు చంపింది వందలాది మందిని. ఒక ప్రాణానికి పది ప్రాణాలు తియ్యడం హిందూ పిండారీల స్టైల్.

    ReplyDelete
  11. ముస్లిం హతుల సంఖ్య వేలలో ఉంది ప్రవీణ్ గారు..

    ReplyDelete
  12. ఒక ప్రాణానికి పది ప్రాణాలు తియ్యడమే చాలా అనాగరికం. ఒక ప్రాణానికి యాభై ప్రాణాలు తీస్తే అది హిట్లర్ కూడా చెయ్యలేని పని.

    ReplyDelete
  13. 2003 నుంచి 2007 వరకు గుజరాత్‌లో 489 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ లింక్ చదవండి: http://www.hindu.com/2007/10/14/stories/2007101456521400.htm

    ReplyDelete
  14. ఈ లింక్ చదివిన తరువాత థి హిందూ ఒక కమ్యూనిస్ట్ పత్రిక అని విమర్శిస్తారు.

    ReplyDelete
  15. ఇది DNA Indiaలో వచ్చిన వార్త
    "Published: Thursday, Mar 25, 2010, 22:34 IST
    Place: Gandhinagar | Agency: PTI

    As many as 145 farmers have committed suicide in Gujarat over the past three years, Gujarat government said in a written reply to a question of State Assembly today.

    Agriculture minister Dilip Sanghani in a written reply to a query raised by Congress MLA Raghavji Patel, said 103 farmers committed suicide in 2007, while 35 farmers suicide were reported in 2008 and seven were reported in 2009 (till September).

    The statement said that out of the 145 farmers suicides, five were due to overburden of financial debts.

    Patel had further asked if the state government had taken any steps to prevent farmer suicides.

    To which Sanghani has replied that the government, in case of crop failure, would compensate the farmer as per the guidelines of the National Agriculture Insurance Scheme."

    ReplyDelete
  16. ఇది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన వార్త
    "Posted: Fri Aug 31 2007, 00:00 hrs AHMEDABAD, AUGUST 30:
    Seasons Shopping

    Discussion
    Blogs

    Why ac prision?? - By s ramjiUsa vs india - By ksLibyan leader muamma... - By RAJAT KUMAR MOHINDRU .JALANDHAR CITY M - By nicolethomsonWill india achieve t... - By RAJAT KUMAR MOHINDRU .JALANDHAR CITY Will india achieve t... - By RAJAT KUMAR MOHINDRU .JALANDHAR CITY Will india achieve t... - By RAJAT KUMAR MOHINDRU .JALANDHAR CITY

    In response to an RTI application, the Gujarat Police has put it on record that 366 farmers have committed suicide in 16 districts between 2003 and April 2007.

    While the Gujarat Government continues to deny that there have been any cases of farmer suicides, police of 15 districts, in response to an RTI filed by social activist Bharatsinh Jhala, have given a list of farmer suicide cases. Junagadh reported 85 suicide cases followed by 62 in Rajkot. No suicides were reported from Dahod, Narmada, Banaskantha and Bhavnagar in the list.

    Police have stated various reasons for the suicides, including mental instability, ill health, debt, family reasons and “unknown reasons”. However, in 16 cases, police have clearly mentioned that farmers killed themselves over crop failure or financial reasons.

    A copy of the response obtained by The Indian Express shows that officially, in 2005, four farmers across Ahmedabad rural, Anand and Bharuch took the extreme step due to financial reasons, while in 2006, two in Bharuch killed themselves for the same reason. The number of suicides for financial reasons in 2004 is five and in 2007 (till April) is four."

    ReplyDelete
  17. సమైక్యాంధ్ర జె‌ఎసి నాయకుడు శామ్యూల్ గారికి అబ్బాయి జాన్ తెలంగాణా మీద వ్రాసిన ఈ బూతు కవిత చదవండి http://ouuncles.blogspot.com/2011/04/blog-post_12.html

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి