Monday, 10 October, 2011

తెలంగాణ కథకు మరొక ద్రోహం -2

2 comments:

 1. సమైక్యవాదతత్వమంటేనే విద్రోహతత్వం కదా.

  ReplyDelete
 2. ఖదీర్బాబు పుస్తకం గురించి కొంచెం. అసలు ఆయన ఈ పుస్తకం ఎందుకు రాశాడు? అదేలెండి, పుస్తకంగా తీసుకురాగల కాలమ్ అయిడియాను ‘సాక్షిరాముడి’ కడుపులో దూరి ఎందుకు పుట్టించాడు? కథల రీటెల్లింగు ఖదీర్బాబుకు బాగా వచ్చుగనక. రెండేళ్ల క్రితం నిర్మల్వర్మ కథను (హిందీలోంచి తెలుగులోకి అప్పటికే అనువాదమయి ఉన్నదాన్నే) పున:కథనం చేసి తన కథగా చెలామణీ చేసుకోవాలన్న ఆయన ప్రయత్నం బెడిసికొట్టింది. అప్పుడేకదా ఖదీర్ రీటెల్లింగ్ కెపాసిటీ చూసి సాహిత్యలోకమంతా ‘ఔరా’ అని ముక్కున వేలేసుకుంది! అసలాయన దర్గామిట్ట కథలే నామిని కథలకు పున:కథనాలు. ఏదో గురువు బాటన నడిచిన శిష్యుడని సరిపెట్టుకోవచ్చులెండి. చెప్పొచ్చేదేమంటే రీటెల్లింగ్ ఖదీరుకీనాడు కొత్తగా వచ్చిందేం కాదు. ఆ దుమారం రేగాక తెలుగునాట ఖదీరుతో స్నేహం మాట అటుంచండి, పలకరించడానికే చీదరించుకుని దూరం పెట్టారు కథకులు. మళ్లీ వాళ్లని మంచిచేసుకోవడమెలాగా? మాటామంతీ నెరపడమెలాగా అని ఆలోచించి ఇదిగో ఈ కాలమ్ నడిపించాడు ఖదీరు. ఇక పత్రికలో నెంబరంటూ వేసినతర్వాత ఫోన్లు రాకమానుతాయా? నాలుగొందలేం ఖర్మ, నలభైవందలు వచ్చినా వస్తాయి. రూపాయికి ఐదు నిమిషాలు మాట్లాడే సౌకర్యముంది మరి. దీనికీ ఉదాహరణ కావాలంటే సాక్షి ఆర్టిస్గు తలతిక్కల అన్వరు ఓసారి ఫండేలో తన కార్టూనులో తన ఫోన్నెంబరే రాసుకున్నాడు. సరదా తీరిపోయి, ఆ ఫోను అవతల పారేసేటన్ని కాల్స్ వచ్చేయోరాలేదో ఆయన్నడగండి. ఇంకా కావాలంటే సందేహరాయుళ్లు ఏ పత్రికలోనైనా మీ నెంబరు వేయించుకోండి. చెప్పొచ్చేదేమంటే పత్రికలో నెంబరు పడితే వచ్చే ఫోన్లను చూసి ‘అదంతా నా కథకు వచ్చిన రెస్పాన్సు, రీటెల్లింగుకు వచ్చిన రెస్పాంసు’ అని మురిసిపోతే ఆ అమాయకత్వానికి మనమేం చెయ్యలేం.

  గురూ ఖదీర్ బాబూ, ఒక్క మాటడుగుతాను చెబుతావా?
  ‘కథ నాకు చాలా ఇచ్చింది. కథ నుంచి నేను చాలా తీసుకున్నాను. కానీ తెలుగు కథకు నేనేమిచ్చినాను? అన్న ప్రశ్న వేసుకుని దానికి సమాధానం ఈ పుస్తకమన్నారు తమరు. అవును గురూ. తెలుగు కథ నీకు చాలా ఇచ్చింది. వైస్రాయి హోటల్లోనో, ఈనాడు యాడ్లలోనే బతుకీడ్వాల్సిన నీకు అక్షరాలొచ్చేలా చేసింది. అందులోనే బతుకునిచ్చింది. అంతచేసిన తెలుగుకథకు నువ్వేం చేశావు? హిందీ కథను కాపీగొట్టి తెలుగుకథకు జెల్లకొట్టావు. తల్లిపాలుతాగి రొమ్ముగుద్దావు. నీ స్వామిభక్తి ప్రకటించుకోవడానికి కడుపున పుట్టిన పసివాణ్ని కథనంలోనికి లాగి పదుగురి చేతా ఛీ అనిపించుకున్నావు.

  అయ్యా జంపాలగారూ, ఇది తెలుగుకథకు పుట్టినరోజు బహుమతా? ఖదీర్బాబు దొంగ ప్రాయశ్చిత్తపు తంతు. తెలుగు కథకులను దగ్గరచేసుకోవడానికి ఆయనగారు నేసిన అతుకుల బొంత. పాఠకులను మచ్చికచేసుకోవడానికి వేసిన కప్ప గెంతు.

  ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి