Tuesday, 4 October, 2011

సింగిడి కవుల పొలికేకసింగిడై గొంతెత్తిన కవులు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.. సకల జనులతో పాటు నినదించారు.. హైదరాబాద్ దిల్ హై హమారా అని ఎలుగెత్తి చాటారు.. బి.నర్సింగరావు, అమ్మంగి వేణుగోపాల్, నాళేశ్వరం శంకరం, వజ్జల శివకుమార్, దెంచనాల శ్రీనివాస్, సిద్ధార్ధ, ఆయిల సైదాచారి, పగడాల నాగేందర్, ఊడుగుల వేణు, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, సంపతి సోమయ్య, గాదె వెంకటేష్, ఎస్.జగన్ రెడ్డి, అంబటి వెంకన్న, వేముగంటి మురళీకృష్ణ, దాసరాజు రామారావు, దున్న యాదగిరి, రమేష్ హజారి, మోహన్ రుషి, రాపోలు సుదర్శన్, జ్వలిత, వెంకటేష్ చౌహాన్, వెంకట్ యాదవ్, మడిపల్లి రాజ్ కుమార్ తదితర కవులు, సంగిశెట్టి శ్రీనివాస్, మిమిక్రి జనార్ధన్, ఇంద్రవెల్లి రమేష్, జుగాష్, దాసోజు కృష్ణమాచారి, తెగించి కొట్లాడుడే పాటగాడు, సింగిడి కన్వినర్లు స్కైబాబ, పసునూరి రవీందర్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

7 comments:

 1. సింగిడి ఉరుమై ఉరమాలి. సమైక్యవాద పిండారీలని నిలువునా దహించివెయ్యాలి.

  ReplyDelete
 2. Jai singidi
  http://tinyurl.com/3j9dxuf

  ReplyDelete
 3. ఎదుటివారిమీద విషం కక్కుతూ, బూతులే తమ మాతృభాషా భావించి, వారి తల్లులతో అదే విధంగా మాట్లడతారేమో తెలియదు కానీ ఈ విధమైన బూతులు రాసే సింగిడీ అనే తెలంగాణా బూతు రచయితల సంఘాన్ని వెంటనే రాష్ట్రం నుండి ప్రభుత్వం నిషేదించాలి. వీళ్లు రాసే కవితలు వీరి పిల్లలు విని చదివి వారి తల్లుల ఎదురుగా పాడి తిట్టే తిట్లని కని, విని ఆనందిస్తారేమో ఈ కవులు.తమ యొక్క వాచాలత్వాన్ని, మనసులోని కుత్సితత్వాన్ని, మానసిక, లైంగిక ఆనందాన్ని, ఎన్ని రకాలుగా బూతులు గా మాట్లాడవచ్చో ఇందులోని రచయితలు తమ కపిత్వ ధోరణి తో చూపిస్తూ ఉంటారు.

  ReplyDelete
 4. రాళ్ళబండి గారు, పాపం మీ అసహనానికి మేమేమీ మందు వేయలేము. విశాలాంధ్ర మహాసభ అనే పేరుతో మీరు బ్లాగ్ పెట్టుకోవడం చూస్తేనే మీరు 1960 లలో సంచరిస్తున్నారని అర్ధమయ్యింది. సింగిడి వేసిన 'క్విట్ తెలంగాణ' కవితా సంకలనం గురించి మీరు చేసిన కామెంట్ చూసి జాలిపడుతున్నాను. 'క్విట్ తెలంగాణ'లోని 34 మంది కవులలో మీరు ప్రేమిస్తున్న బూతులు రాసింది సింగిడి సభ్యులేమీ కాదు. ఆ కవిత్వాన్ని తల్లులూ, పిల్లలూ చదవడం గురించి మాట్లాడుతున్నారంటేనే మీ నిస్సహాయత తెలిసిపోతోంది.
  నిజానికి 'క్విట్ తెలంగాణ'లో కవులు కడుపు మండీ గుండె రగిలీ ఆ మాత్రమే రాసారు.. ఎవరి ఒపికకైనా హద్దంటూ ఉంటుంది.. ఆ ఓపిక కూడా నశిన్చేలా చేస్తున్నారు, మీ లాంటి వారూ, మీ పాలకులూ..! ఆ తరువాత ఇక రాతలుండవు, చేతలే! తెలంగాణ ను వ్యతిరేకించే వాళ్ళను ఇప్పటికీ తెలంగాణ ఉద్యమకారులు 'క్విట్ తెలంగాణ' అనే అంటున్నారు..
  సకల జనుల సమ్మె మీద మీ వికారాలూ చూశాను.. నిజాయితి ఉన్నవారైతే అలా మాట్లాడరు.. శాంతియుతంగా జరుగుతున్న సమ్మె తీరు అద్భుతం. ప్రజస్వామికవాదు లందరూ ఇలాంటి పోరాటాలకు మద్దతిస్తారు. మరి మీలాంటి వారిని ఏ కోవలో జమ చేయాలో అర్ధం కావడం లేదు. అనాలోచిత కామెంట్స్ ఇకనైనా మానేయ్యండి. మేమేమీ చిన్నపిల్లలం కాము, మీరు చెబితే జ్ఞానం పొందడానికి. అసలు కవిత్వం గురించి ఏమీ తెలియకుండానే కామెంట్స్ చేయడం సరికాదని కూడా గమనించండి.

  ReplyDelete
 5. 1960ల దాక ఎందుకు? రాజశేఖరరెడ్డి బతికు ఉన్నప్పుడు కూడా తెలంగాణా కాంగ్రెస్ నాయకులలో ఎక్కువ మంది సీమాంధ్ర నాయకుల అడుగులకి మడుగులొత్తుతూ సమైక్యాంధ్రనే సమర్థించేవాళ్ళు. విశాలాంధ్ర మహా సభ వాళ్ళు సమైక్యవాదాన్ని సమర్థించిన కాంగ్రెస్ నాయకుల ప్రకటనల పేపర్ క్లిప్పింగ్స్ పెట్టాలనుకుంటే డి.శ్రీనివాస్ ప్రకటనలు కూడా వాళ్ళకి చాలా దొరుకుతాయి. ఎక్కడో 1960లలోకి వెళ్ళిపోయి బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకట రంగారెడ్డిల ప్రకటనలు పట్టుకోవలసిన పని లేదు. తెలంగాణా రాష్ట్రాన్ని వ్యతిరేకించడానికి డి.శ్రీనివాస్ అయితే ఏమిటి, కొండా వెంకట రంగారెడ్డి అయితే ఏమిటి?

  ReplyDelete
 6. "అసలు కవిత్వం గురించి ఏమీ తెలియకుండానే కామెంట్స్ చేయడం సరికాదని కూడా గమనించండి."
  ఓహో బూతులు ఒక వరుసలో పేర్చడమే మీ దృష్టిలో కవిత్వమా స్కైబాబ గారూ? ఆ లెక్కన కోనసీమ పల్లెటూర్లలో మీకన్నా మహాకవులు బోలెడంత మంది. వాళ్ళు గొంతు విప్పితే మీ తల ఎక్కడ పెట్టుకొవాలో కూడా తెలియదు మీకు. ఇలాంటి భాష వాడి తెలంగాణా రచయితల పట్ల గౌరవాన్ని మీకు మీరే తగ్గించుకుంటున్నారు. పైగా ఇంతోటి సంస్కారానికి తెలుగు కథా సంకలనాలలో చోటు దక్కలేదని ఏడుపు కూడానా? సిగ్గు సిగ్గు.

  ReplyDelete
 7. ఏ కవిత్వం గురించి మాట్లాడుతున్నారో జర సెలవిస్తారా? మీకు బూతు అనిపించిన లైన్స్ చెబుతారా?
  అలాగే, 'తెలుగు కథా సంకలనాలలో చోటు దక్కలేదని ఏడుపు కూడానా?' అన్నారు చూడండీ, అదే- మీరు చోటు ఇచ్చే స్థితి లో, మేము చోటు కోసం పోరాడవలసిన స్థానాల్లో ఉన్నాం- ఆ దౌర్భాగ్యం మీదే పోరాడుతున్నాం. ఇకనైనా తెలంగాణ ఏర్పడితే మీ దొంగల బాధ మాకు తప్పుతుంది.
  అయినా మీ ప్రాంత కథల వరకు వేసుకుంటే మాకు అభ్యంతరం ఏమీ ఉండదు.. మావి మేము వేసుకోగలిగినప్పుడే వేసుకుంటాం.. ఈ మాత్రం అర్ధం చేసుకోకుండా కిరికిరి ఎందుకు చెప్పండి.

  ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి