Saturday, 24 September, 2011

తెలంగాణ కథకు తలపెట్టిన మరొక ద్రోహాన్నిఖండించండి


23 comments:

 1. తెలంగాణావాళ్ళకి తెలుగు రాదనే కోస్తా ఆంధ్రులు తెలంగాణా కథలని తెలుగు కథలుగా ఎలా అంగీకరిస్తారు? నిజాం బలవంతంగా రుద్దిన ఉర్దూ భాష నేర్చుకోలేక ఉర్దూ కలిసిన తెలుగు నేర్చుకుని తమ పిల్లలకి అదే నేర్పిస్తే అది తెలంగాణా ప్రజల తప్పా? నల్లగొండ జిల్లాలో బస్సుల మీద నల్లగొండ పట్టణం పేరు నల్లగొండ అనే వ్రాసి ఉంటుంది. కోస్తా ఆంధ్ర పత్రికలు మాత్రం ఉర్దూ స్టైల్‌లో నల్గొండ అని వ్రాస్తాయి. అసలు తెలంగాణావాళ్ళు మాట్లాడేది తెలుగే కాదు అనుకుంటే భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రం నుంచి తెలంగాణా విడిపోవడానికి సమైక్యవాదులు అడ్డు చెప్పాల్సిన పనే ఉండదు.

  ReplyDelete
 2. ఎంతకావాలంటే అంత విషయం బాగానే చిమ్ముతున్నారు..అలానే కానివ్వండి..! మీకు తోడు ఈ ప్రవీణ్ శర్మ..బానే వుంది.

  ReplyDelete
 3. తెలంగాణావాళ్ళని వేరే జాతిని చూసినట్టు చూస్తారు కానీ విడిపోతామంటే విడిపోవడానికి ఒప్పుకోరు. బానిసని చెరలో ఉంచుకునేవాడు బానిసని ఉంచుకోవడం తన హక్కు అని ఎలా అనుకుంటాడో, తెలంగాణాని తమ ఆధిపత్యంలో ఉంచుకోవడం తమ హక్కు అని సమైక్యవాదులు అనుకుంటారు.

  ReplyDelete
 4. స్కైబాబా గారు వ్రాసేది విషయమే అయితే మీ సమైక్యవాదులు వ్రాసేది విషం కదా.

  ReplyDelete
 5. తెలంగాణా సమ్మె వల్ల తెలంగాణా విడిపోతే ఆంధ్ర ప్రాంతం మానలేదని అర్ధమైంది. కరెంట్ లేక, నీళ్ళు లేక ... బస్సులు రాక !
  అంటే అన్ని వనరులూ తెలంగాణాలోనే ఉన్నాయనే విషయం అర్ధమైంది కదా. మరి వెనుక బడిన ప్రాంతం ఆంధ్రా నా, తెలంగాణా నా ?

  ReplyDelete
 6. కర్నాటకలో బొగ్గు గనులు లేవు కానీ కర్నాటక ఎలా అభివృద్ధి చెందింది? బొగ్గు గనులు ఉన్న ఒరిస్సా ఆర్థికంగా ఎందుకు వెనుకబడింది? కర్నాటకలోని భద్రావతిలో ఉన్న స్టీల్ ఫాక్టరీలకి ఒరిస్సాలోని తాల్చేర్ నుంచే బొగ్గు వస్తుంది. వనరులు ఎన్ని ఉన్నాయని కాదు, ఎంత వరకు స్థానికంగా వినిమయమయ్యాయి అనేది ప్రశ్న.

  ReplyDelete
 7. sky baba garu meeru pedda rachayita.. meeku cheppenta vanni kadu.. katha sankalanam anevi valla ishtamaina veskovadaniki... andulo kuda reservation undalante ela.. ayanaku nachinavai ayana sankalanam ga techadu...

  ReplyDelete
 8. This comment has been removed by the author.

  ReplyDelete
 9. appudu naaku nachchina kathalu ani veyaali. kaani athanu Telugu kathalu annaadu. kabatte pechee

  ReplyDelete
 10. తెలుగు తల్లి మాకొద్దు అనే వాళ్ళు తెలుగు కథ గురించి పేచీ పెట్టడం చిత్రమే. అయినా ఎవరో వేసుకునే సంకలనంలో చాలినంత వాటా లేదని ఆక్రోశించే బదులు సింగిడి TRS (చిత్రంగా TRS మూర్ఖవాదం మీరూ అందుకున్నారు చూశారా.) తమంతట తామే నూరేళ్ళ తెలంగాణా కథలు అని ఒక సంకలనం వేయచ్చుగా. రచయితలకి ప్రాంతీయ బేధాలు ఉంటాయేమో గానీ మంచి కథకి ప్రాంతీయ బేధాలు ఉండవు కాబట్టి ఖచ్చితంగా బావుంటే ఆ సంకలనం అన్ని ప్రాంతాలలోనూ ఆదరణ పొందుతుంది.

  ReplyDelete
 11. రాష్ట్రం విడిపోయినా తెలంగాణా ప్రజలు మాట్లాడేది తెలుగు భాషే. నిజాం బలవంతంగా రుద్దిన ఉర్దూ భాష నేర్చుకోలేక నిజాం వ్యతిరేక పోరాటం చేసినవాళ్ళు తెలుగు భాషని అంత సులభంగా మర్చిపోతారా? తెలుగు తల్లి అనేది ఒక ఊహాత్మక గుర్తు (imaginary icon). కానీ ఆ గుర్తుని తెలంగాణా వ్యతిరేక ప్రాంతీయతత్వాన్ని పోషించడానికి సమైక్యవాదులు ఉపయోగించుకుంటోంటే చూడలేక తెలంగాణావాదులు తెలుగు తల్లి విగ్రహాన్ని ద్వంసం చేశారు.

  ReplyDelete
 12. విగ్రహారాధన చెయ్యకూడదు అన్న గురజాడ గారిని పొగుడుతూనే మనం తెలుగు తల్లి విగ్రహాలని ప్రతిష్ఠించడం విగ్రహారాధన కాదా?

  ReplyDelete
 13. దేవుని విగ్రహం దగ్గర పెట్టిన నైవేద్యమే ఎలుకలు తినేస్తాయి కానీ దేవుడు తినలేడు. అటువంటప్పుడు ఏ పురాణంలోనూ లేని తెలుగు తల్లికి విగ్రహం పెడితే దానికి విలువ ఉంటుందా?

  ReplyDelete
 14. ముందు ద్రోహం, వెనుక ద్రోహం, కుడి ఎడమల ద్రోహం, ద్రోహం. జలాలలో ద్రోహం, ఉద్యోగాలలో ద్రోహం, సాహిత్యంలో ద్రోహం, అన్నింటా ద్రోహం.

  ReplyDelete
 15. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 16. కథా సంకలనాల్లో దామాషా పద్ధతిలో కథలుండాలనడం మీకే చెల్లింది. ఏ సంకలనమయినా ఆయా సంకలనకర్తల అభిరుచీ, ప్రమాణాలకనుగుణంగా ఉంటుంది. కళకూ, ప్రజాస్వామ్యానికీ పొత్తు కుదరదు. "నాకు నచ్చిన కథలు" లేదా "నా దృష్టిలో ఉన్నతమైన కథలు" అని ప్రత్యేకంగా ప్రకటించనవసరం లేదు ఆ అర్థం మీలాంటి వారికి తప్ప అందరికీ తెలుసు గనక. ఈ సంకలనంలో లెక్కల ప్రకారం కథలో, కవితలో వేసుకుంటూ పోతే ఇక సంకలనకర్తల పనేమిటి? ఆ పని ఏ తూకాలు వేసేవాడికో వదిలిపెట్టొచ్చు గదా!
  మీరు చెప్పుకొచ్చిన సంకలనకర్తల ద్రోహం మాటేమిటో కానీ మీరు తెలుగు సాహిత్యానికి చేస్తున్న ద్రోహం సంగతి తెలియడం లేదు మీకు. అయినా తెలంగాణా కథ మీద అంత ప్రేముంటే ఈ విషాన్నీ, ద్వేషాన్నీ చిమ్మటం మాని మీరే మరో వంద కథలు ఎన్నుకుని మరో పుస్తకం తీసుకు రండి ఇవే అసలయిన తెలుగు కథలు అని.
  ఇక కరపత్రంలో రెండు మూడు చోట్ల మాతరం "చేసిండు, ఇండ్రు" లు కనిపించాయి. ఎంచేత?

  ReplyDelete
 17. మనం ఎన్నో దశలు దాటి ఇప్పుడున్న చైతన్యం లోకి వచ్చాం. నేటి చైతన్యం లోంచి దేన్నైనా చూడాలి. 100 కథల గురించి రాస్తూ 70 కథలు అగ్రవర్ణాల వాళ్ళవే తీసుకోడం నేడు సరైంది కాదు. ఎక్కడా లేనట్టి పరిస్తితి మన దేశం లో ఉంది- ఆ రోజుల్లో దళితులకు చదువుకునే అవకాశమే లేకుండా చేశారు. స్త్రీలనూ అంతే. బీసిల పరిస్తితి అంతంత మాత్రమె. మైనార్టీల పరిస్తితి అగమ్యగోచరం. ఇవన్నీ దృష్టి లో ఉంచుకోవాలి. అగ్రవర్ణాలు రాసిన కథలన్నీ పేదరికం, 'మానవత్వం' చుట్టే తిరగడం మాములే. పైన పేర్కొన్న మిగతా సమూహాల సమస్యలు భిన్నమైనవి. వాటిని రికార్డ్ చేయాలి. ఆ పని చేయకుండా ఇవాళ కూడా బ్రాహ్మణ, ఆధిపత్య, భూస్వామ్య భావజాలం తోనే 'కతల' పడతామంటే కుదరదు.
  ఇక తెలంగాణ వాళ్లము ఉద్యమం లో పీకల్లోతు కూరుకుపోయి ఉన్నాము. తెలంగాణ వచ్చాక మా కథలు మేము ఎలాగూ వేసుకుంటాము. ఈలోపు సందట్లో సడేమియాల్లా వ్యవహరించే వాళ్ళను ఊరికే వదలలేము కదా. మమ్మల్ని అవమానించే వాళ్ళను, తక్కువ చేసి చూపే వాళ్ళను విమర్శించకుండా ఎలా ఉంటాము?

  ReplyDelete
 18. ఎందుకుసార్ ఇసొంటి చిన్న చిన్న విషయాలను గూడ పెద్దవి జేశి సూపిస్తరు. ఆయన తీస్కొచ్చిన సంకలనమేమన్నా ఇప్పటి వరకు వచ్చిన సంకలనాల్లోకేల్లా ఉత్తమమైనది అని చాటి చెప్తున్నరా? లేదుగా. కావాల్నంటే మన రచయితల సంఘాన్ని కూడా ఇలాంటి సంకలనమే తయారు చేయమనండి ఎవరొద్దన్నరు. స్వరాజ్యం, ఆత్మాభిమానం అంటు మొదలైన ఉద్యమాన్ని ఇసొంటి మామూలు విషయాలతో నింపేసి జనం మధ్య మనస్పర్ధలు తీసుకురావద్దు. కనీసం ఒకరినొకరు పలకరించుకోలేని పరిస్థితి తేవద్దు.

  ReplyDelete
 19. ఫలానా సంకలనంలో మా కథలు వెయ్యలేదు అని బాధపడిపోవడం ఎందుకు? మీ కథలూ సత్తా కలిగినవే అని అనుకుంటే (సత్తా కలిగినవి కావని నా ఉద్దేశం కానే కాదు) మీరూ ఒక ’తెలుగు కథా’సంకలనం వేసుకుని అందులో అన్నీ (లేదా ఎక్కువ శాతం) మీ కథల్నే వేసుకోవచ్చు. లేదా, సత్తా కలిగిన సాహిత్య విమర్శ చెయ్యవచ్చు. కానీ, ఇదేంటి.. వాళ్ళకు కుట్రను ఆపాదించడం ఏంటి? మీ సాహిత్యానికి ఆయన బొంద పెట్టడం ఏంటి? ఎవరో మీమీద ఎందుకు కుట్ర చేస్తారు? అంత అవసరం వాళ్ళకేంటి? ఇలా ప్రతీదాన్నీ తెలంగాణకు ముడిపెట్టి మిమ్మల్ని మీరు పలుచన చేసుకుంటున్నారు, తెలంగాణను ఎగతాళి చేసుకుంటున్నారు మీలాంటి వాళ్ళు.

  నేను పెద్దవాణ్ణి కావాలనుకోవడం సహజమైన కోరిక. అవతలోణ్ణి చిన్నవాణ్ణి చేస్తే నేను పెద్దవాణ్ణైపోతాను అని అనుకోవడం మాత్రం చావు తెలివితేటలు. ఖదీర్ బాబును తిడితే స్కైబాబ పెద్దాడైపోడు. ’ఆంద్రోణ్ణి’ తిడితే ’తెలంగాణపోడు’ పెద్దోడైపోడు.

  ఉత్కృష్టమైన సృజనాత్మకతకు చిరునామా కవులు, ఇతర కళాకారులు. కానీ ఒక కవి సృజనాత్మకత ఇంత నేలబారుగా ఉంటదని మాత్రం నేననుకోలా.

  ReplyDelete
 20. అన్నిటికీ ఆంధ్రులే కారణం.

  ఇకనుండి పొద్దున్నే మోషన్ కాక పోయినా...పిల్లలు పుట్టక పొయినా కూడా వాళ్లమీద తోసేద్దమా ?

  ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి