Tuesday, 1 October, 2013

తెలంగాణ దస్తూర్ (‘రజ్మియా’ సంపాదకీయం నుంచి కొన్ని భాగాలు)

(నేటి నమస్తే తెలంగాణ పత్రిక సాహిత్య పేజి 'చెలిమె' లో...)

(36 గురు తెలుగు ముస్లిం కవులు.. 31 మంది ఉర్దూ ముస్లిం కవులు పాడుతున్న తెలంగణ ఉద్యమ గీతం ఇది.. గంగా జమునా తెహ్ జీబ్.. అలాయిబలాయి సంస్క్రుతి..
ఫవాద్ తంకనత్ ముఖచిత్రం తో ఒక వైపు నుంచి ఉర్దూ కవిత్వం
అక్బర్ ముఖచిత్రం తో మరో వైపు నుంచి తెలుగు కవిత్వం
తెలుగు కి స్కైబాబ సంపాదకుడు.. ఉర్దూ కి స్కైబాబ, డాక్టర్ ఖుతుబ్ సర్షార్ సంపాదకులు)
***

‘రజ్మియా’ అంటే ఉద్యమ గీతం. తెలుగు (36 మంది), ఉర్దూ (31 మంది) ముస్లిం కవుల ఉద్యమగీతం ఇది. గంగ జము న తెహజీబ్‌కు అంతరాత్మ. నిజానికి తెలంగాణ అంటే తెలుగు, ఉర్దూ; ఉర్దూ మిళిత తెలుగు; తెలుగు కలగలసిన ఉర్దూ వెరసి గంగా జమున తెహజీబ్. తెలుగు వారి, ఉర్దూవారి కలగలుపు సంస్కృతి! అలాయి బలాయి సంస్కృతి!!

తెలంగాణలో మొదటి నుంచి ముస్లింలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రజల తరఫున నిలబడి పోరాడిన చరిత్ర ఉంది. తెలంగాణ ప్రాం తం ముస్లిం రాజుల పాలనలో ఉండడంతో తెలంగాణ చరివూతకు, సంస్కృతికి, సాహిత్యానికి, భాషకు ఒక అదనపు సౌందర్యం చేకూరింది. ఈ గడ్డను ఏలి ఈ మట్టిలోనే కలిసిన ఇబ్రహీం కులీ కుతుబ్ షా (మల్కిభ రాముడి) దగ్గరి నుంచి ప్రజా నాయకుడు, ఉర్దూ మహాకవి మగ్దూం మొహియుద్దీన్ దాకా.. మలకాబాయి చందా నుంచి జిలానీ బానో దాకా.. నేటి తెలంగాణ ముస్లిం కవుల దాకా సాహిత్య వారసత్వం కొనసాగుతూ వచ్చింది. ప్రజా పోరాటాలకు ప్రతీకలుగా బందగీ, షోయబుల్లా ఖాన్ తదితరులు నిలిస్తే తెలంగాణలో తురుమ్ ఖాన్‌గా ప్రసిద్ధి పొందిన తుర్రేబాజ్ ఖాన్ బ్రిటిష్ సైన్యంతో యుద్ధం చేసి, ఆఖరికి కాల్చి చంపబడి కోఠీలో వారం పాటు శవంగా వేలాడదీయబడ్డాడు.

ఉర్దూ భాష కేవలం ముస్లింలది కాదు!ఉర్దూ ఒక భారతీయ భాష. అది ఇండియాలోనే పుట్టింది. చిత్రంగా, మెల్లమెల్లగా అది ముస్లింల భాషగా మారిపోయింది. ఆ కారణంగా ఉర్దూ వల్ల ముస్లింలకు, ముస్లింల వల్ల ఉర్దూకు చాలా నష్టం జరిగింది. జరుగుతున్నది. హైదరాబాద్ రాజ్యంలో ఉర్దూ రాజభాష. ఆ రాజ్యాన్ని మూడు ముక్కలు చేసి తెలంగాణను ఆంధ్రలో కలిపాక ఉర్దూ తీసి పారేసి, ఆంధ్రా ప్రాంతపు తెలుగును తెలంగాణ ప్రజలపై రుద్దడం తెలిసిందే. ఉర్దూ మీడి యం పాఠశాలలు, కళాశాలలన్నీ తెలుగు మీడియంగా మార్చివేయబడ్డాయి. మరి అప్పటిదాకా ఉర్దూ మీడియం చదివినవారి సంగతేమిటి? అలా ఎన్ని తరాలు నష్టపోయాయి? ఉర్దూ చదువరుల్లో ముస్లిమేతరులు భారీ సంఖ్యలో ఉన్నారు. అధికార యం త్రాంగంలోనూ త్రెలుగు లేదా ఇంగ్లీష్ రావాల్సిందే అనడంతో ఉర్దూ చదువరులంతా ఏమైపోయారు?ఉర్దూప్రభావం వల్ల ఇక్కడి తెలుగు డిఫంట్ యాక్సెంట్‌ను తీసుకుంది. వేల ఉర్దూ పదాలు తెలుగైజ్ అయ్యాయి. తెలుగు ఉర్దూ మిక్స్‌డ్ లాంగ్వేజ్‌లో ఇక్కడివాళ్లు మాట్లాడుకోవడం చూస్తాం. అలా ఆ మిక్స్‌డ్ భాష ఇక్కడి వారి జీవితంలో భాగమైంది. తీయని ఉర్దూ సమ్మిళిత తెలుగు వల్ల ఇక్కడి తెలుగువారికి ముస్లింలపై,ముస్లింలకు తెలుగువారిపై అప్రకటిత ప్రేమ, వాత్సల్యం ఉండే వి. అంటే సమ్మిళితభాష అనేది తెలుగోల్ల, ముస్లింల మధ్య సహజీవనానికి తోడ్పడింది. 1948 తర్వాత ఆంధ్రావారి ఆధిపత్య భావజాలంతో అది దెబ్బతింటూ వచ్చింది. తెలంగాణ ఏర్పడడం వలన మళ్లీ ఆ వాతావరణం వస్తుందని, రావాలని ఆశిస్తున్నాను. ఆంధ్రావారి ఉర్దూ వ్యతిరేకత, ముస్లిం వ్యతిరేకత నుంచి తెలంగాణ ముస్లింలు తప్పించుకోగలుగుతారు. ముఖ్యంగా ముస్లిం సంస్కృ తి అంటే అదేదో పరాయి సంస్కృతి అన్న ఏహ్యభావం చూపుతూ వచ్చారు.

ఆంధ్రావారు వచ్చాకే మత ఘర్షణలు:ఆంధ్రావారు వచ్చాకే హైదరాబాద్‌లో మత ఘర్షణలు జరిగా యి. అంతకు ముందు వందల ఏళ్లుగా తెలంగాణలో హిందూ ముస్లింలు కలిసిమెలసి సహజీవనం కొనసాగిస్తున్నారు. ఆంధ్రా రాజకీయ నాయకులు ముఖ్యమంవూతుల్ని మార్చడానికి హైదరాబాద్‌లో మత ఘర్షణలు సృష్టించిన చరిత్ర అందరికీ తెలిసిందే. ఆంధ్రా వారి కేవల హైందవ సంస్కృతి వల్ల, దానికి తోడైన ఆర్‌ఎస్‌ఎస్ బ్రాహ్మణీయ భావజాలం వల్ల ఇవాళ మత ఘర్షణల్ని చూస్తున్నాం. హైదరాబాద్‌లోని ఎంఐఎం భావజాలం కూడ కొం తవరకు తోడైంది. కాని తెలంగాణ వ్యాప్తంగా ముస్లింలందరూ ఎంఐఎంతో లేరన్న వాస్తవం ఇక్కడ గుర్తుంచుకోవాలి.అయితే, చారివూతకంగా, సాంస్కృతికంగా భావ సారూప్యత, సాంస్కృతిక సారూప్యత వల్ల తెలంగాణలోని తెలుగువారికీ, ముస్లింలకూ మధ్య సహజీవనం పెంపొందించుకోవడానికి వీలుం ది. అందుకు తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పడడం అత్యవసరం. రెండు నుంచి మూడు శాతం ముస్లింలు మాత్రమే ఈ దేశంలో బైటి దేశాల నుంచి వచ్చినవారు. మిగతా 97 శాతం ఈ దేశవాసులే. అందులో 90 శాతంమంది ‘అంటబడనివ్వని’ కులాల నుంచీ, ‘వెనకబడేయబడ్డ’ కులాల నుంచీ ఇస్లాం స్వీకరించినవారే. ఈ దేశ మూలవాసులే. ఆదివాసీ దళిత బహుజనులు 60కి పైగా వృత్తుల్లో ముస్లింలు కొనసాగుతున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దీన్నిబట్టి ఆయా కులాలవాళ్లే ముస్లింలుగా మారారని అర్థమవుతుంది. ఇట్లాంటివాళ్లను రిజర్వేషన్లకు ఇన్నాళ్లు దూరంగా ఉంచి, వారి బతుకులు ఛిన్నాభిన్నమయ్యేలా కుట్ర చేశా రు బ్రాహ్మణీయ వాదులు. ఇస్లాం స్వీకరించక ముందు ముస్లింలకు కులవృత్తులుండేవి. అక్కడా ఇక్కడా నవాబుల పాలన ఉన్న సమయంలో తమది ‘నవాబుల మతం’గా భావించి కొంత, ఆయా వృత్తుల్లో కొనసాగుతున్నవాళ్లను ఇతర బ్రాహ్మణ సమా జం ‘నీచం’గా చూస్తుండడంవల్ల మరింత ముస్లింలంతా వృత్తులు వదిలేసుకున్నారు. చిన్నాచితక ఉద్యోగాలు సంపాదించుకున్నారు. కొంత భూముల్ని పట్టా చేయించుకున్నారు. వ్యవసాయం చేయడానికి, చేయించుకోడానికి వీళ్లేమీ రెడ్లూ, కమ్మలూ, వెలమల్లాంటి అగ్రకులస్థులు కాకపోవడంతో తర్వాత్తర్వాత ఆ భూములు రెడ్లు, కమ్మలు, వెలమలే సొంతం చేసుకున్నారు.ఇటు వృత్తులు లేకుం డా పోయాయి, అటు భూముల్లేకుండా పోయా యి. రెంట చెడ్డ రేవడి బతుకులయ్యాయి. అదనంగా రిజర్వేషన్లు లేకుండా చెయ్యడంతో ముస్లింల బతుకులు అన్యాయమైపోయా యి. రోడ్డున పడ్డాయి. ఇటు చదువుకునే అవకాశాల్లేక, అటు ‘ఓసీ’ కావడంతో ఉద్యోగాలు రాక ‘న ఘర్‌కా న ఘాట్‌కా’ బతుకుపూైపోయాయి. ఇవాళ రోడ్ల పక్కన ‘చిల్లర’ బేరగాళ్లంతా ముస్లింలే కావ డం యాదృచ్ఛికం కాదు.. పండ్ల బండ్లవాళ్లు, మెకానిక్‌లు, డ్రైవ ర్లు, క్లీనర్లు, పంక్చర్‌లు గడియారాలు బాగుచేసేవాళ్లు, చాయ్ డబ్బాలవాళ్లు, చిన్నచిన్న చెప్పుల షాపులు, టెంట్‌హౌజ్‌లవాళ్లు, దర్జీలు అంతా ముస్లింలే! వీటన్నింటికి కార ణం వివక్ష. అణచివేత. రాజ్యం ముస్లింలను రెండవ తరగతి పౌరులుగా చూడడం ముస్లింల వెనుకబాటుకి బలమైన కారణం.

ఈ పరిస్థితిని అధిగమించాలంటే ముస్లింలను తెలంగాణలో అతి పెద్ద సమూహంగా గుర్తించి వారి పురోభివృద్ధికి అందరూ పూనుకోవాలి. అన్ని రంగాల్లో ముస్లింల ప్రాతినిధ్యం, ఉర్దూ మాట్లాడేవాళ్ల ప్రాతినిధ్యం ఉండేలా చూడాలి. ఉర్దూ తెలంగాణ ద్వితీయభాషగా ప్రకటించి అమలు పర్చాలి. తెలంగాణ గురించి కమ్యూనిస్టులు, ఆంధ్రవలస పాలకులు రాసిన చరిత్ర ఆధారంగా ముస్లింలను చూడకుండా, తెలంగాణలో ముస్లింలు ఒక భాగం అని నమ్మేవాళ్ళు కొత్తగా రాసే చరివూతను ఆధారం చేసుకోవాలి. నిజాంరాజుల పాలనను ‘ముస్లిం పాలన’ అనడాన్ని వ్యతిరేకించా లి. ముస్లింలు 400 ఏళ్ళ పాలకులనే ప్రచారాన్ని ఖండించాలి. ముస్లిం రాజులతో ముస్లిం ప్రజలకు సంబంధం లేదన్న విషయా న్ని గుర్తించాలి. ఉర్దూలో, పార్శీలో ఉండే సోర్సెస్ (ఆధారాలు) వెలికి తీయడం ద్వారా అనేక అబద్ధపు ప్రచారాలు, అసలు నిజా లు వెలుగులోకి వస్తాయి. కనుక ఆ ప్రయత్నం చేపట్టాలి. ఆంధ్రు ల వలస వల్ల చిల్లర వ్యాపారాల దగ్గరనుంచి ఉద్యోగాల దాకా ముస్లింలు అన్యాయానికి గురయిన, గురవుతున్న విషయం గుర్తించి, దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. హైద్రాబాద్‌లాంటి చోట్ల పోలీసు శాఖలో ముస్లింల శాతం మరీ తక్కువగా ఉన్నది. దీనివల్ల ఎంతో వివక్ష కొనసాగుతున్నది. ఇది ఏ భావజాలం వల్ల జరుగుతున్నది? దీని వెనుక రాజకీయాలేంటి? లాంటి విషయాలపై దృష్టి పెట్టాలి. పోలీసుల భర్తీలో ముస్లింల ప్రాతినిధ్యం పెంచాలి. ముస్లింలకు, తెలుగోల్లకు మధ్య ఏ ఏ కారణాల వలన అంతరం పెరుగుతున్నదో చూడాలి. నివారణ చర్యలు చేపట్టాలి. సహజీవన వాతావరణాన్ని పెంపొందించాలి. ముస్లింల మూలాల అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయాలి. తెలుగు ఉర్దూ ముస్లిం రచయితల కోసం ప్రత్యేక అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. వారి సాహిత్యాన్ని ఇరు భాషల్లోకి అనువాదం చేయించాలి.
-స్కైబాబ

(‘రజ్మియా’ తెలంగాణ ముస్లిం కవిత్వం  పుస్తకానికి స్కైబాబ
రాసిన సంపాదకీయం నుంచి కొన్ని భాగాలు)

http://www.namasthetelangaana.com/Editpage/article.aspx?Category=1&subCategory=7&ContentId=287497

No comments:

Post a Comment

మీ అభిప్రాయం తెలియజెయ్యండి