ఐశ్వర్యారాయ్ నవ్వుతోంది
పసి నసీంబాను సున్నిత దేహం
పగిలిపోతున్న దృశ్యం నా కళ్ళల్లో...
బోసిబోసిగ ఉపన్యసించుకుంటూ
ముసుగుల మాటున ముసిముసిగ నవ్వుకుంటూ వాడు
వేదిక కిందంత నా వాళ్ళ రక్తం...
జాఫ్రీ దేహఖండాల మధ్య నిలబడ్డ మృగం...
సింహాసనంమీద కాలుపెట్టి అహంగ నవ్వుకుంటూ వాడు
తెల్లమీసాల కంటిన రక్తాన్ని తుడుచుకుంటూ వాడు
బూడిదౌతున్న వేల దేహాల పొగల్నుంచి 'మమ్మీ' నవ్వుతోని వాడు
ఈ నవ్వులు
జిందగీ పొడుగూతా...
ఒక్క ఐశ్వర్యారాయేనా
కొంకిరి కట్టె ఒదిలినోడు నవ్వుతున్నడు
ముస్తాదు మరిచినోడు నవ్వుతున్నడు
ఎల్లమ్మను మొక్కడం ఒదిలినోడు గుడ నవ్వుతున్నడు
వేదిక కిందంత నా వాళ్ల రక్తం...
('ముల్కి' ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచిక 2004 నుంచి)
No comments:
Post a Comment
మీ అభిప్రాయం తెలియజెయ్యండి