'వతన్' ముస్లిం కథల సంకలనం కోసం 5 ఏళ్ళు ఎన్నో రకాలుగా కష్టపడవలసి వచ్చింది. మొదలు అలాంటి సంకలనం వేయాలనుకున్నప్పుడు రాస్తున్న ముస్లిం కథకులు ముగ్గురు నలుగురే.. ముస్లిం కవులందరికీ, రచయితలందరికీ ఉత్తరాలు రాసి కలిసి ముసిం కథలు రాయమని అడిగాను. ఒక 10 రోజులు రాష్ట్రం లోని ముస్లిం రచయిత లందరి దగ్గరికి తిరిగి వాళ్ళతో గడిపి వారి అనుభవాలు పంచుకొని వాటిల్లోంచి ముస్లిం కథలకు పనికొచ్చే సబ్జెక్టు ను discuss చేయడం కూడా జరిగింది.. ఆ పైన ఉత్తరాలు, ఫోన్స్లలో వారి వెంటపడి రాయించడం జరిగింది.. ఒక్కో కథ వస్తుంటే చదివి మార్పులు చేర్పులు వారితో చర్చించడం.. ఎత్తి రాయించడం.. కొన్ని నేనే వారి అనుమతితో నేనే ఎడిట్ చేయడం.. ఇంకా కొత్త రచయితలను కనుగొనడం.. వారితో రాయించడం....
ఈ దశ లోనే 'మర్ఫా' ముస్లిం రిజర్వేషన్ మూవ్మెంట్ చేయవలసి వచ్చి అలా రాష్ట్ర మంతా తిరుగుతూ అక్కడ పరిచయమైన ముస్లిం ఆలోచనాపరులతోనూ రాయించాను.. వాటిని ఎడిట్ చేసి వేశాను..
మధ్యలో 2002 లో గుజరాత్ genoside జరగడం తో disturb అయ్యి గుజరాత్ వెళ్లి వచ్చాను.. అన్వర్ తో కలిసి 'అజాన్' పేరుతో poetry సంకలనం చేశాను. ఈ దశలో 'వతన్' ఆగిపోయింది.. DTP చేసిన అతడు ఫైల్ అంత ఎగిరిపోయింది అని చేతులెత్తేశాడు.. అది ఒకింత నిరుత్సాహాన్ని కలిగించింది.. అయితే ఈ గ్యాప్ మరికొందరు ఈ సంకలనం లో చేర్చే అవకాశం కలిగించింది.. మొత్తంగా చూస్తే సంకలనం 400 pages వచ్చేలా ఉంది.. డబ్బులు చాలా అవుతున్నాయి.. దాంతో ఫాంట్ తగ్గించి 300 pages వచ్చేలా చూశాను... ఆవిష్కరణ అనౌన్సు చేశాను.. సంకలనం తయారు కాలేదు.. ప్రూఫులు చూడడానికి కొందరు మిత్రులకు కొన్ని కథలు పంచాల్సి వచ్చింది.. చివరలో కొన్ని కథలు DTP చేయించడానికి ఒకరిని అర్జెంట్ గా ఏర్పాటు చేసుకోవాలి వచ్చింది.. రాత్రిం బవల్లు కష్టపడి మొత్తానికి సంకలనం ప్రింట్ కి ఇచ్చాను.. కాని పైసలు సరిపోను లేవు.. సభకు వచ్చిన smyle లాంటి వారు కొన్ని డబ్బులు ఇస్తే 8 వేలు తీసుకొని ఆర్టిస్ట్ akber ను వెంట తీసుకొని ప్రెస్ కి వెళ్లి మిగతా డబ్బులు మిగతా పుస్తకాలు తీసుకొనే తప్పుడు ఇస్తానని చెప్పి 100 పుస్తకాలు తీసుకొన్నాం. ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకోగానే నా కళ్ళల్లో గిర్రున కన్నీళ్లు తిరిగాయి.. ఎంత కష్టపడితే ఈ సంకలనం ఇలా బయటికి వచ్చింది కదా అనిపించింది..
వేసింది 800 కాపీలే. 38000 అయ్యాయి.. మిగతా 30000 వేలకోసం ఆవిష్కరణ తరువాత కూడా ౧౦ రోజులు ఎందరి దగ్గరికో తిరిగి పుస్తకాలు అమ్మి.. కొందరి ఆర్ధిక సాయం తో డబ్బులు పూడ్చ గలిగాను.. అప్పటికీ ఒక మూడు వేలు ప్రెస్ వాళ్లకి ఇవ్వలేకపోయాను.. పుస్తకాలు ప్రెస్ లోంచి తీసుకోడం లేట్ అయ్యేసరికి ఆ బుక్ విలువ తెలిసి ప్రెస్ కి వచ్చిన వాళ్ళు ఎన్నో బుక్స్ పట్టుకెళ్లారు ..
సరే.. ఈ పుస్తకం రావడం తో ఒక్కసారిగా తెలుగు సాహిత్యం లో ముస్లింవాదం స్థితే మారిపోయింది... ముస్లింవాదం స్థిరపడిందనీ చెప్పొచ్చు.. మంచి reviews వచ్చాయి.. కే.శ్రీనివాస్, సింగమనేని నారాయణ, ముదిగంటి సుజాతారెడ్డి లాంటివారు పెద్ద reviews చేశారు.. ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో ముస్లిం కథలపై M.Phil., Ph.D. లు జరుగుతున్నాయి. బుక్ మార్కెట్ లో ఉండాలని ముఖ్యులంత కోరుతున్నారు.. కాని మళ్ళి అంత కష్టం ఎంత కష్టం..!
ఈ సంకలనం వచ్చాక ముస్లిం కథల వ్యక్తీకరణ మారింది. స్పష్టత వచ్చింది.. మన మధ్యే ఉన్న మరో లోకాన్ని చూపిన సంకలనం గా దీనికి పేరొచ్చింది.. ముస్లిం కథకులు పెరిగారు..
ఇందులో రహమతుల్ల, ఖాజా, సలీం, అఫ్సర్, ఇక్బాల్, ఖదీర్బాబు, నేను, షాజహానా, దాదాహయత్, షేక్ హుసేన్ సత్యాగ్ని, శశిశ్రీ లాంటి ప్రముఖులతో పాటు షరీఫ్ లాంటి నేటితరం రచయితల దాక మొత్తం 40 మంది ముస్లిం కథకుల 52 కథలు ఉన్నాయి..
(మళ్ళి ఒకసారి మరికొంత చెబుతాను)
meeru naa sahaayam adigi vunte tappaka chesi vunde vaanni.
ReplyDeleteGreat effort Bhayya. Will check with Udugula Venu and buy a copy. I am so eager to read it.
ReplyDeleteRgds
Kiran Gali