Tuesday, 22 February, 2011

ఆలోచించండి సీమాంధ్ర సోదరులారా!ప్రపంచ మేధావుల్ని, ప్రజాస్వామ్య దేశాల్ని సైతం ఆశ్చర్యపరుస్తూ అరబ్‌ ప్రజలు రోడ్లమీదికి వస్తున్నారు. ఇన్నాళ్లూ అన్ని రకాల నిర్బంధాలు, రాజరికాలు భరించిన వాళ్లు ఇవాళ స్వేచ్ఛకై, ప్రజాస్వామ్యానికై నినదిస్తున్నారు. ఆ దేశాల్లో ప్రజాస్వామ్యం కల్లేనని భావించిన ప్రజాస్వామ్యవాదులందరినీ ఈ పరిణామం ఒకింత ఆనంద డోలికల్లో తేలియాడిస్తున్నది. ఇది శుభపరిణామం!
ఇదే సందర్భంలో ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మనదేశంలో మాత్రం కొన్ని ప్రాంతాలు ఇంకా వివక్షకు, అణచివేతకు గురవుతున్నాయి. ఎంత విచిత్రం! అందులో ఒకటి- తెలంగాణ!
తెలంగాణవారు కేవలం ప్రత్యేక రాష్ట్రం మాత్రమే కోరుతున్నా వారి ఓపికను తెగేదాకా లాగుతున్న వైనం ప్రజాస్వామికవాదులంతా గమనిస్తున్నారు. ఇది ఏమి న్యాయం? తెలంగాణలో యాభై ఏళ్లకు పైగా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష రకరకాల రూపాల్లో వ్యక్తమవుతూనే ఉంది.  ఇవాళ ఆ పోరాటం పతాక స్థాయికి చేరుకుంది. కనీ వినీ ఎరుగని పోరాట రూపాలు చూస్తున్నాం. సంవత్సరమంతా కష్టపడి చదివే విద్యార్థులు తమ హాల్‌టికెట్లనే చించేస్తూ 'తెలంగాణ వచ్చేదాకా పరీక్షలు రాయం' అని అనడం చిన్న విషయమేమీ కాదు.. తెలంగాణ ప్రాంతంలోని యూనివర్సిటీలన్నీ యుద్ధ క్షేత్రాలుగా మారడం చిన్న విషయమేమీ కాదు.. న్యాయవాదులంతా నిరసన నినాదాలవడం చిన్న విషయమేమీ కాదు.. ఉద్యోగులంతా నిరాహార దీక్షలు చేయడం చిన్న విషయమేమీ కాదు.. ఇవాళ దేశ చరిత్రలోనే ఎక్కడా జరగని సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తుండడం- ఇవన్నీ మామూలు విషయాలేమీ కావు. ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ జై తెలంగాణ నినాదం వినగానే శరీరాలు ఉద్యమ కెరటాలుగా ఎగిసిపడుతుండడం వారి ఆత్మగౌరవ ఆకాంక్షను బలంగా తెలియజేస్తున్నది.
ఇవాళ తెలంగాణ ప్రజలు తెలంగాణ వ్యతిరేక సంఘటన ఏది దొర్లినా ఎంతో ఉడికిపోతున్నారు. తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. ఆ ఆవేశంలోంచి పిడికిళ్లు బిగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏదేని ఒక ఉద్యమ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తమకు అందుబాటులో ఉన్నవారితో వాదోపవాదాలు చేస్తున్నారు. ఆక్రోశంతో, కడుపు మంటతో, గుండె మంటతో రకరకాలుగా వీళ్లు మసిలిపోతుంటే అవతలివారంతా నింపాదిగా, చులకనగా, వంకర నవ్వులతో గేలి చేస్తుండడం ఎంతవరకు సబబు? అవతలివారు అనేక మొఖాలతో వ్యవహరించడం ఏం న్యాయం? ఏం నీతి? నిరంతరం పోరాడుతూనే ఉన్న తెలంగాణపట్ల సానుభూతిగా ఆలోచించని వాళ్లని ఎలా అర్థం చేసుకోవాలి? ఎన్నాళ్లు తెలంగాణవారు చీదరిస్తున్నా, ఛీత్కరిస్తున్నా, 'ఉమ్మేస్తున్నా' పట్టించుకోనట్లు నటిస్తారు? ఒక్కసారి ఆలోచించండి సీమాంధ్ర సోదరులారా!
ఇవాళ తెలంగాణ వారి మనోభావాలు తీవ్ర ఉద్వేగాలకు గురవుతున్నాయి. ఉద్వేగాలు జ్వాలలై ఎగుస్తున్నాయి. ఇంతటి మానసిక ఉద్వేగాల్ని భరించడం ఎంత కష్టం? ఎన్నాళ్లు వీరి ఉద్వేగాలతో ఆడుకుంటారు? ఎన్నాళ్లు వీరి ఆకాంక్షల్ని తొక్కిపెడతారు? ఇకనైనా ఒకింత సహానుభూతితో ఆలోచించండి సోదరులారా! ఇవాళ శాంతియుతంగా మొదలైన సహాయ నిరాకరణ ఉద్యమం రేపు తీవ్రస్థాయికి చేరుకుని ఊహించరాని పరిణామాలకు దారి తీయక ముందే.. మన మధ్య సోదరభావం మాయమై శత్రుభావం పెంపొందకముందే ఒక్కొక్కరుగా ముందుకు రండి సోదరులారా! ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉండేందుకు ఉన్న అవకాశాన్ని వదులుకోవద్దు! మాట్లాడండి సోదరులారా.. శాంతియుతంగా విడిపోదాం.. సోదరభావంతో కలిసుందాం! ముందుకు రండి సోదరులారా!

54 comments:

 1. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 2. ఖమ్మం, వరంగల్ జిల్లాలలో చిల్లర వ్యాపారాలు చేసే కోస్తా ఆంధ్రవాళ్లకి తెలంగాణాపై వ్యతిరేకత లేదు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్స్ వ్యాపారం చేసేవాళ్లకే తెలంగాణాపై వ్యతిరేకత ఉంది. సమైక్యవాదంపై ఆర్థిక ప్రయోజనాల ప్రభావం ఎక్కువ.

  ReplyDelete
 3. ఆంధ్రావారి మీద మీకుంది. దశాబ్దాల తరబడి అకారణమైన అన్యాయమైన అసహజమైన శత్రుభావం ! ఇంత జఱిగినా ఆంధ్రావారిలో ఈ రోజుకూ మీ పట్ల ఆ భావం లేదు. ఊహించరాని పరిణామాలంటూ మీరు చేస్తున్న బెదిరింపులు అర్థమయ్యాయి. అయితే మీరు ప్రత్యేక రాష్ట్రం ఎందుకడుగుతున్నారనేది ఈ రోజుకూ ఆంధ్రావారికి ఖచ్చితమైన కారణం అర్థం కాలేదు. ఇదొక అనవసరమైన కృత్రిమ డిమాండ్ అనేదే ఈనాటికీ ఆంధ్రావాళ్ళందరి అభిప్రాయం.

  ప్రత్యామ్నాయ ఏర్పాట్లేమీ లేకుండా ఉన్నపళాన రాష్ట్రాన్ని ముక్కలు చేయమని అడగడం న్యాయమా ? విడగొట్టాక ఆంధ్రావారి పరిస్థితేంటని తెలంగాణవాళ్ళు అలోచిస్తున్నారా, మీ గుఱించి ఆంధ్రావాళ్ళు ఆలోచించడానికి ?

  ఇంకా రాష్ట్రం రాకుండానే కేసీయారూ, అతని మనుషులూ, ఆంధ్రావారి ఆస్తుల్ని ఆక్రమించుకుంటున్నారు వరంగల్ లో ! కొంపా గోడూ వదిలిపెట్టి ఎక్కడికి పోవాలి ఆంధ్రావాళ్ళు ? ఆంధ్రా ఏరియా అభివృద్ధిని బలిచేసి తెలంగాణని వేలాదికోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేసింది AP ప్రభుత్వం. ఆంధ్రాలో ఏమీ లేదు. పరిశ్రమల్లేవు, ఉద్యోగావకాశాల్లేవు. హైదరాబాద్ కి వెళ్ళకపోతే పొట్ట గడవదు. తెలంగాణ ఇస్తే హైదరాబాదుకు రానివ్వరు. ఉన్నవాళ్ళు వెనక్కి పోయే పరిస్థితి లేదు. అందుకే ఆంధ్రావారు చేతనయినంతగా మోకాలడ్డుతున్నారు.

  అదే, మీరైతే ఏం చేస్తారు ? మీకే ఈ పరిస్థితి ఎదురైతే ?

  ReplyDelete
 4. స్కై,
  పైన దేవనకొండ అడిగిన ప్రశ్నే నేనూ అడుగుతున్నాను, మీరు ప్రత్యేక రాష్ట్రం ఎందుకడుగుతున్నారనేది ఈ రోజుకూ నాకూ ఖచ్చితమైన కారణం అర్థం కాలేదు.
  వీలైతే సమాధానమివ్వగలరు. మేం పోనంటున్నది "మా" రాజధాని నుండి. మీ వరంగల్ మాకొద్దు, మీ నిజామాబాద్ మాకొద్దు, మీ మంచిర్యాల్ మాకొద్దు. "మా" రాజధాని మాక్కావాలి. యాభై ఏళ్ళనుండి ముసలి, ముతక, పిల్లా, పీచు అందరిని వదిలి, ఆస్థులన్నీ అమ్ముకునొచ్చి, అది తెచ్చి యిక్కడ పెట్టి, రక్తమాంసాలు కరిగించి రాజధానిలో పెట్టాం. ఈ కల్లబొల్లి మాటలిని మేం వొప్పుకోవాల్నా? రాజధాని సంగతి తేలేవరకు డిక్షనరీలో దీనమైన పదాలన్నీ వెతికి వాడినా, ఈ నిర్ణయం మారదు.

  ReplyDelete
 5. తెలంగాణ ఉద్యమాన్ని, ట్యునీషియా, ఈజిప్ట్ లతో పోల్చి వాటి పరువు తియ్యద్దు. ఆ ఉద్యమాలలో సాటి ప్రజలపై కుళ్ళు, అసూయ, ద్వేషం కానరావు. అక్కడ ప్రజలు పోరాడింది నియంతలపైన, కుళ్ళిపోయిన రాజకీయాలపైన. అబద్దాలతో, అసత్య ప్రచారాలతో, ప్రక్క ప్రాంతం వారిపై నీచాతినీచ భాష ను వాడుతున్న మీ ఉద్యమానికి వాటితో పోలికా?

  అక్కడి ప్రజలు వాళ్ళ కష్టాలకు తోటి ప్రాంతం వారు కారకులని నిందలు మోపారా? అసలు చరిత్ర లో ఎన్నడైన తెలంగాణ ఉద్యమం, అంధ్ర ప్రాంతం వారిపై ద్వేష ప్రచారం లేకుండా మనగలిగిందా? సానుభూతి అంటూ ఎమైనా చూపించాలి అంటే మీ రాజకీయనాకుల చేతుల్లో మీ బ్రతుకులు ఎలా ఆడుకోబడుతున్నాయో దానికి చూపించాలి..

  ReplyDelete
 6. ఖబర్దార్ ఆజాకర్లారా......... ఖబర్దార్.
  .........ఆజాకర్..........
  ఆంధ్రా రజాకర్లకు అతికినట్లున్న పదమ్.

  అప్పటి తెలంగాణ పోరాట వీరులు రజాకర్లను తరమి తరిమి కొట్టిండ్రు. ఇప్పుడు మనొంతు. ఈ అబద్దాలా ఆజాకర్లను చార్మినార్ దగ్గర గెదిమిగెదిమి కొట్టనీకి మనకిదే మంచి మొకా. ఒరేయ్ సిగ్గుశరమ్ లేని అజాకర్లారా, దమ్ముంటే ఒక్కసారి ఉస్మానియాకొచ్చి అనుండ్రా మీరంటున్న శరమ్ లేని మాటలు. అప్పుడు చూపిస్తమ్ తెలంగాణ దెబ్బ ఎట్లుంటదో.

  అజాకర్లకు ఆరిపోయే దినమ్ దగ్గరవడ్డది కొడకల్లారా. దినాల్లెక్కవెట్టుకోండ్రి.

  ReplyDelete
 7. Division is never a solution for any problem.. this hatred on non-telangana people is driving people crazy, ofcourse its also fired up by the dummy politicians who did nothing for telangana. There r many many areas under developed in andhra, India and in whole world. Division is not going to help all these things, if u fight for ur development, its logical, if u fight for ur rights, its logical, and if u say that because andhra people r dominating, telangana is underdeveloped...its just ur misunderstanding. There r many indians living outside and earning money.. it doesnt mean we r looting. I personally feel telangana is benefitting better from past 15 or 20 years. Fight for ur funds and rights.. thats logical. what guarantee is there that the same politicians exists now and existed earlier will give u a better telangana, its just they r blaming their failures on other area people..so funny. No one makes fun of a poor person...whether its andhra person or telangana person. We r living in 21st century with more freedom of expression. Just think out of box. If some one going to blame me..its up to ur mental condition.

  ReplyDelete
 8. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 9. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 10. @దేవనకొండ , పండు ....

  తెలంగాణా ఎందుకు అడుగుతున్నారంటే , తెలంగాణా లో జరగాల్సినంత అభివృద్ధి జరగడం లేదు, , పెద్దమనుష్యుల ఒప్పందం అందరు మర్చిపోయారు, GO 610 never properly implemented. కోస్తాంధ్ర , రాయలసీమ కన్నా తెలంగాణా ప్రాంతం పెద్దది, కాని ఇక్కడికి కేటాయించబడిన కేంద్ర నిధులు మాత్రం 22% మాత్రమె, అంటే మూడో భాగం కన్నా తక్కువ. తెలంగాణా MLA లకి కాబినెట్ పదవులు పెద్దగా దక్కలేదు, అసలు తెలంగాణా నుంచి వచ్చిన రాజకీయనాయకులలో కేవలం ముగ్గురు మాత్రమె ముఖ్యమంత్రులు అయ్యారు, వారి ముగ్గురి పదవీ కాలం కలిపి 6 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత కాలం ఈ పరిస్తితిలో మార్పు ఉండదని ఇక్కడి ప్రజలు నమ్ముతున్నారు.

  ఇక తెలంగాణా వస్తే, ఇప్పటిదాకా ఉన్న ఆంధ్రా వాళ్ళందరూ వెళ్లిపోవాలి అని రూల్ ఏమి ఉండదు. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం ఒక భారతీయుడు జమ్మూ కాశ్మీర్ మరియు tribal ఏరియా లో తప్ప ఎక్కడిన స్థిరపడే స్వేచ్చ ఉంది. Its our fundamental right.
  మీరు ఒకసారి సికేంద్రాబాద్ వెళ్ళారంటే అక్కడ ఎక్కువగా గుజారాత్ వాళ్ళే కనిపిస్తారు, వ్యాపారాలు చేస్తూ. ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని కొంతమంది సమైక్య ఆంధ్రా వాదులు ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం వల్ల, తెలంగాణా వస్తే ఇక్కడ ఉన్న non-telangana వాళ్ళని పంపించేస్తారు అన్నది అపోహ. ఇక ప్రత్యామ్నాయం లేకుండా అంటే...ముందు తెలంగాణా ఇస్తాము అని చెప్తే అప్పుడు సీమాంధ్ర లో ఇంకో రాజధాని నిర్మించుకునే దాకా ఏదో ఒక ఏర్పాటు గురించి ఆలోచించుకోవచ్చు...ముందు అయితే తెలంగాణా విషయం పార్లమెంట్లో లో పెట్టి simple majority రాగానే అప్పుడు ఆ విభజన ఎలా చెయ్యాలి అని ఆలోచించుకోవచ్చు.

  ఇక తిట్టుకోడం అంటారా...ఒక ఉద్యమం అనగానే over excitement లో ఇటు వాళ్ళు అటు , అటు వాళ్ళు ఇటు తిట్టుకోడం కొత్త ఏమి కాదు కదా .

  జై తెలంగాణా

  ReplyDelete
 11. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 12. ఎన్నాళ్లు తెలంగాణవారు చీదరిస్తున్నా, ఛీత్కరిస్తున్నా, 'ఉమ్మేస్తున్నా' పట్టించుకోనట్లు నటిస్తారు? ఒక్కసారి ఆలోచించండి సీమాంధ్ర సోదరులారా___________________ఒక పక్కన చీదరిస్తూ, ఛీత్కరిస్తూ, ఉమ్మేస్తూ అదే చెత్త నోటితో "సోదరులారా" అని సంబోధిస్తున్నపుడే మీ ద్వంద్వ వైఖరి ఏమిటో స్పష్టమవుతోంది. ఇహ తెలంగాణా రాదేమో అన్న భయం, బేలతనం, తీవ్ర భంగపాటు, అసహనంలోంచి పుట్టుకొచ్చిన ఉన్మాదం ఇది.

  "మీరు చదువుకోండి, ఈ ఉద్యమం సంగతి మేం చూస్తాం" అని చెప్పకుండా విద్యార్థులను రెచ్చగొట్టి "మీరు అమరులు, మీ త్యాగం వృధా పోదు" అని కీర్తించే మేధావులారా, నాయకులారా మీలో ఒక్కరూ ఆత్మత్యాగానికి ఒడిగట్టరేం? ఉద్రేక పూరిత ప్రసంగాలకే మీరు పరిమితమా?  స్వేచ్ఛ కోసం జరిగే పోరాటాలతో ఈ ఉద్యమానికి పోలికా? సిగ్గుండాలి.

  దేవన కొండగారి ప్రశ్నే నేనూ అడుగుతున్నా! జవాబుందా మీ దగ్గర! దాటేసి "జై తెలంగాణా" అని గర్జిస్తే కుదరదు.
  ఇవాళ శాంతియుతంగా మొదలైన సహాయ నిరాకరణ ఉద్యమం రేపు తీవ్రస్థాయికి చేరుకుని ఊహించరాని పరిణామాలకు దారి తీయక ముందే.......ఇదిగో ఈ తరహా సజెషన్లే విద్యార్థులకు ఇవ్వొద్దనేది.

  మీరంతా జర్నలిస్టులు, మేధావులు....మీరు ప్రచారం చేసేది ద్వేషం, వేర్పాటు వాదం!మిమ్మల్ని పురికొల్పి అందలాలు ఎక్కాలని చూస్తున్న మీ నాయకుల మొహాన ఉమ్మండి...సీమాంధ్రుల మీద కాదు.

  ReplyDelete
 13. తెలంగాణా ఎందుకు అడుగుతున్నారంటే , తెలంగాణా లో జరగాల్సినంత అభివృద్ధి జరగడం లేదు, , పెద్దమనుష్యుల ఒప్పందం అందరు మర్చిపోయారు, //అందరూ అంటే..? సీమాంధ్రా వారు మర్చిపోయారంటే అర్థం ఉంది, మరి తెలంగాణా నాయకులు ఎందుకు మర్చి పోయారు..? తప్పు ఎవరిది?// GO 610 never properly implemented.// తె.గ నాయకులు ఈ విషయం ఇన్నాల్లూ ఎందుకు ఈ విషయం పట్టించుకోలేదు// కోస్తాంధ్ర , రాయలసీమ కన్నా తెలంగాణా ప్రాంతం పెద్దది, కాని ఇక్కడికి కేటాయించబడిన కేంద్ర నిధులు మాత్రం 22% మాత్రమె, అంటే మూడో భాగం కన్నా తక్కువ.// కేంద్రం నిధులు రాలేదంటే మీ MPలు ఏం చేస్తున్నారు..?// తెలంగాణా MLA లకి కాబినెట్ పదవులు పెద్దగా దక్కలేదు, అసలు తెలంగాణా నుంచి వచ్చిన రాజకీయనాయకులలో కేవలం ముగ్గురు మాత్రమె ముఖ్యమంత్రులు అయ్యారు, వారి ముగ్గురి పదవీ కాలం కలిపి 6 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత కాలం ఈ పరిస్తితిలో మార్పు ఉండదని ఇక్కడి ప్రజలు నమ్ముతున్నారు.// దీనిని బట్టి తె.గ లో ఎవరికి నాయకత్వ లక్షణాలు లేవని అనుకోవచ్చా..? CM మనోడు ఐతే ఏదో పొడుస్తాడని అమాయక ప్రజలు అనుకుంటే పర్లేదు. మీలాంటి విద్యావంతులు ఎందుకనుకుంటున్నారు..? ఎక్కువమంది CM లనిచ్చిన రాయలసీమ పరిస్తితి కనిపిస్తుందిగా..? ఒకటి మాత్రం నిజం, సమైక్యాంధ్రాకి తె.గా నుంచి CM వచ్చే అవకాశం ఇప్పట్లో కనిపించట్లేదు. అందుకే మీ KCR, ఇతర నాయకులు తె.గ కావాలంటున్నారు. అక్కడ CM పోస్టుకి కాంపిటీషన్ తక్కువ వుంటుందని. ఇది అర్థం చేసుకోలేక పోవడమే తె.గ ప్రజల అమాయకత్వం.//

  ఇక తెలంగాణా వస్తే, ఇప్పటిదాకా ఉన్న ఆంధ్రా వాళ్ళందరూ వెళ్లిపోవాలి అని రూల్ ఏమి ఉండదు. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం ఒక భారతీయుడు జమ్మూ కాశ్మీర్ మరియు tribal ఏరియా లో తప్ప ఎక్కడిన స్థిరపడే స్వేచ్చ ఉంది. Its our fundamental right.
  మీరు ఒకసారి సికేంద్రాబాద్ వెళ్ళారంటే అక్కడ ఎక్కువగా గుజారాత్ వాళ్ళే కనిపిస్తారు, వ్యాపారాలు చేస్తూ. ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని కొంతమంది సమైక్య ఆంధ్రా వాదులు ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం వల్ల, తెలంగాణా వస్తే ఇక్కడ ఉన్న non-telangana వాళ్ళని పంపించేస్తారు అన్నది అపోహ. ఇక ప్రత్యామ్నాయం లేకుండా అంటే...ముందు తెలంగాణా ఇస్తాము అని చెప్తే అప్పుడు సీమాంధ్ర లో ఇంకో రాజధాని నిర్మించుకునే దాకా ఏదో ఒక ఏర్పాటు గురించి ఆలోచించుకోవచ్చు...ముందు అయితే తెలంగాణా విషయం పార్లమెంట్లో లో పెట్టి simple majority రాగానే అప్పుడు ఆ విభజన ఎలా చెయ్యాలి అని ఆలోచించుకోవచ్చు. // ఆంధ్రా మెస్సుల గురించి మీ KCR మాట్లాడించి మీకు తెలీదనుకోవాల్నా..? మీ వీరవిద్యార్థి నాయకుల పండుగ వ్యాఖ్యలు..? చిన్న పిల్లలు వారికి తెలీదంటారా..? తెలీనప్పుడు వారికి ఈ రాజకీయాలెందుకు..//

  ఇక తిట్టుకోడం అంటారా...ఒక ఉద్యమం అనగానే over excitement లో ఇటు వాళ్ళు అటు , అటు వాళ్ళు ఇటు తిట్టుకోడం కొత్త ఏమి కాదు కదా .// హ..హ.. తిట్టడమే ఉద్ద్యమమిప్పుడు. పైగా తిట్టేది ఎవరో కింధి స్థాయి నాయకులు కాదు. మీ ఉద్యమ అగ్రగణ్యులే..

  ReplyDelete
 14. విడదీయడానికి ఇదో సాకా? లేక మీరు నిజంగానే తెలంగాణాను కోరుకుంటున్నారా? నిజంగానే తెలంగానా కోరుకుంటే పర్వాలేదు. లేక ఇది కూడా మీ డివైడ్ అండ్ సెలెబ్రేట్ పాలసీ పాటించే "నల్లగొర్రె" తత్వం అయితేనే వచ్చేది చిక్కు.అయినా, హైదరాబాదులో ఉంటూ తెలంగాణాను వ్యతిరేకించే హైదరాబాదీ ముస్లిములు, MIMవాల్లగురించి మీరెందుకు రాయడం లేదు? ఇంతగా తెలంగానా వాళ్ళు ఉమ్ముతున్నా వారు ఎందుకు తెలంగానా వద్దంటున్నారు, మేధావులు అని చెప్పుకుంటున్న మీతో సహా వారిని కదిలించే ధైర్యం ఎవరికీ లేదు ఎందుకని? రాయండి ఒక కవిత, లేకపోతే ఒక తవిక.

  ReplyDelete
 15. @sooraj .....over excitement ...మీరనట్టు సీమంధ్ర ని తిట్టేస్తే ఉద్యమం లో పాల్గోనట్టే అన్న భావన. అలాగే తెలంగాణా వాదులని తిట్టేస్తే సమైఖ్య ఆంధ్రా ని support చేస్తునట్టే అని ఒక భావన. వీళ్ళు తిట్టారని వాళ్ళు, వాళ్ళు మమ్మల్ని తిట్టారని వీళ్ళు....మీరే చూడండి...చదువరి బ్లాగ్ లో ఏదో రాసారని రాము/సోము బ్లాగ్ లో ఇంకేదో వస్తుంది...వీళ్ళు ఏదో అన్నారని నేనుసైతం/రక్తచరిత్ర బ్లాగ్ లో ఒక పోస్ట్ వస్తుంది....kind of chain reaction లాంటిది.

  // కేంద్రం నిధులు రాలేదంటే మీ MPలు ఏం చేస్తున్నారు..?// ... కేంద్ర నిధులు ఎలా ఖర్చు పెట్టాలి అన్నది MP చేతిలో పెద్దగా ఉండదు. MPLAD program లో రెండు కోట్లు ఖర్చు పెట్టడం తప్ప. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక MP influence అనేది ఏమి ఉండదు...మహా అయితే ఒక సలహా ఇవ్వడం తప్ప.

  /*CM మనోడు ఐతే ఏదో పొడుస్తాడని అమాయక ప్రజలు అనుకుంటే పర్లేదు. మీలాంటి విద్యావంతులు ఎందుకనుకుంటున్నారు..? */ ... ప్రభుత్వం అనగానే గెలిచిన పార్టీ మొత్తం MLA's కాదు ...కాబినెట్ మాత్రమే వస్తుంది...ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే కాబినెట్ తీసుకుని అని అర్థం ...అందుకనే కాబినెట్ పోస్ట్ కోసం అంత గొడవ చేస్తుంటారు అందరు in parliamentary democracy cabinet is most powerful and CM or PM are leaders of the cabinet....ఇక రాయలసీమ అభివృద్ది సంగతికి వస్తే ...అది జగన్ కే తెలియాలేమో మాష్టారు.... :)

  // ఆంధ్రా మెస్సుల గురించి మీ KCR మాట్లాడించి మీకు తెలీదనుకోవాల్నా..? మీ వీరవిద్యార్థి నాయకుల పండుగ వ్యాఖ్యలు..? చిన్న పిల్లలు వారికి తెలీదంటారా..? తెలీనప్పుడు వారికి ఈ రాజకీయాలెందుకు..// ... రాజకీయాలు ఎందుకు అంటే ఎం చెప్తాం చెప్పండి...ప్రజాస్వామ్యం లో రాజకీయాలలోకి రావడానికి qualification ఏమి అక్కర్లేదు...ఎవరినా రావొచ్చు....ఇక ఏ వాఖ్య కి ఎక్కువ మీడియా ప్రాధాన్యత ఇస్తుందో నాయకులకి తెలుసు...ఏ వాఖ్య కి ప్రాధాన్యత ఇస్తే ప్రజలు ఎక్కువ రియాక్ట్ అయ్యి ఇంకాసేపు అదే ఛానల్ ని ప్రకటనలతో సహా చూస్తారో మీడియా కి తెలుసు .

  ReplyDelete
 16. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 17. మా కాళ్ళు పట్టుకుంటే ఏమొస్తుంది, సోణెమ్మ కాళ్ళు తిమ్మిరెక్కేలా వాటేసుకోండి. ఇచ్చేది సోణమ్మ, తెచ్చేది ముక్కణ్ణ.

  ReplyDelete
 18. @Sanju:
  పై కామెంట్స్ చదివాక, ఈ క్రింది పాయింట్స్ ని ఒప్పుకుంటున్నారని అనిపిస్తుంది.
  1. ఒప్పందాలు అమలుకాకపోవడానికీ, ఒకవేళ మీరంటున్నట్లు తె.గ వెనకబడి ఉంటే, ఆ వెనకబాటుతనానికి సీమాంధ్రా నాయకులు ఎంత కారణమో, తె.గ నాయకులు కూడా అంతే కారణం.పైపెచ్చు, తమకు ఒట్లేసిన ప్రజల గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉండాలి కాబట్టి, తె.గ నాయకులనే ఎక్కువగా బాధ్యుల్ని చేయాల్సి ఉంటుంది.
  2. ప్రజల మద్దతు,ఆ ప్రజలు ఎన్నుకున్న MLAల మద్దతు ఎవరికుంటే వాడే నిజమైన నాయకుడు. వాడే CM. తెలంగాణా నాయకులు ఏ ఒక్కడూ కూడా ఈ విషయంలో సీమాంధ్రా నాయకులతో పోటీపడలేడు.
  3. తెలంగాణా విద్యార్థి నాయకులుగా చెప్పుకుంటున్న కొందరు చేసే హింసాత్మక కార్యకలాపాల్ని పట్టించుకోకూడదు. పట్టించుకో కూడదన్నప్పుడు, మా అమాయక విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలపమని ఎలా అడుగుతారు..? KCR OU,KU లాంటి యూనివర్సిటీల్లో పర్యటించి,వారికి లేనిపోని ఆశలు కల్పించీ, ఉద్రేక పరచటంతో వాల్లు ఇలా ప్రవర్తిస్తున్నారనేది నిజం కాదా..?
  4. మేము మంచి వాల్లం కాబట్టే వెనుకబడ్డామనీ, అవతలి వారు దోచుకోబట్టే అభివృద్ధి చెందారనీ అనటం ఏ రకంగా కరెక్ట్.

  ReplyDelete
 19. @sanju,

  మరల మరల అవే అబద్ధాలా? జరగాల్సినంతా అనేదానికి హద్దు ఏముంది? అసలు మొత్తం భారతదేశం లోనే అవినీతి, కుళ్ళు రాజకీయాల మూలంగా జరగాల్సినది జరగలేదు, అందుకని దేశాన్ని రెండు ముక్కలు చేస్తే తప్పెంటి? ఇదేదో అంతా బాగున్న చోట తెలంగాణ ఒక్కటే మీరు 'ఊహించినంత ' జరగలేదు కాబట్టి ఎవడో ద్రోహం చేసాడు అని ప్రక్క ప్రాంతం వారిని నాన దుర్భాషలాడాలా? రాష్ట్రం లో తెలంగాణ కంటే వెనుకబడిన ప్రాంతాలూ ఉన్నాయి.

  నాకొక బేసిక్ ఈక్వేషన్ అర్ధం కాదు. తెలంగాణ లో పరిశ్రమలు లేవు, ఉన్న వాటిని నాశనం చేసారు, ఉద్యోగాలు లేవు, వ్యాపారం చెయ్యలేరు, ప్రాజెక్ట్లు లేవు, నీళ్ళు లేవు.. కాని అన్ని తరలించబడిన ఆంధ్ర కన్నా ఆదాయం మాత్రం ఎక్కువ ఎలా వుంటుంది స్వామీ? నోట్లేమన్న ముద్దరేస్తున్నారా?

  తెలంగాణ నించి నలుగురు ముఖ్యమంత్రులు అయ్యారు, ఒకరు ఉపముఖ్యమంత్రి అయ్యారు. జలగం వెంగళరావ్ ని మీ లెక్ఖల కోసం తొలగిస్తే చెయ్యగలిగేదేమి లేదు. మీ నాయకులు చెప్పేది గుడ్డిగా నమ్మే ముందు చరిత్ర తెలుసుకోండి. ఆయన ఈ రెండు ప్రాంతాలు కలవక ముందే తెలంగాణ లో వచ్చి స్థిరపడ్డాడు. రజాకరలకు వ్యతిరేకం గా పోరాడాడు.

  సికింద్రాబాద్ లో ఉన్న గుజరాతీలు దోచుకోటానికి రాలేదా? ఎక్కడ నించో వచ్చి ఇక్కడ మీ భాష ని కూడా లెక్క చేయకుండా ప్రవర్తించిన వాళ్ళు మాత్రం తెలంగాణా వాళ్ళా? వందల సంవత్సారలు కలిసుండి నిజాం స్వార్ధం కోశం వేరుచెయబడిన తోటి తెలుగువారు దుర్మార్గులు, కబ్జాకోరులా? మీ ఉద్రేకాలు పోయిన తర్వాత ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే ఉద్యమం పేరు తో కొందరు ఎంత చండాలంగా ప్రవర్తించారో, వారికి మీరు ఎలాంటి మద్దతునిచ్చారో తెలుస్తుంది.

  నేను ఒకసారి yahoo లోని తెలంగాణ TDF గ్రూప్ లోకి వెల్తే అక్కడ NRI లు వాడే భాష చూసి షాక్ తిన్నా. అంతటి ద్వేషం వారి ప్రతి మాటలోను తెలుస్తుంది. వాళ్ళ చర్చలు అంధ్రులని ఎలా నాశనం చెయ్యాలి, వారికి యే రకంగా ఏమి మిగల్చకుండా చెయ్యలి, ఇలా సాగుతున్నాయి చర్చలు, ఇవేనా మీరనే over excitement. దీనికి వాడాల్సిన పదం పైశాచికత్వం.

  ReplyDelete
 20. @sooraj ..

  point one ....mostly agreed , ఇప్పటికీ నల్గొండ లో ఫ్లోరైడ్ సమస్య అలానే ఉంది, సీమంధ్ర లో విశాఖపట్నం,గుంటూరు, విజయవాడ, తిరుపతి educational centers గా ఉంటే, ఇక్కడ కేవలం హైదరాబాద్ మాత్రమే ఉంది, అది కూడా రాజధాని అయ్యింది కాబట్టి కాని లేకపోతే అయ్యేది కాదని నా నమ్మకం.

  point 2 ... theoretically what u said is true, but in the state politics, its the congress at the central level which decides who the CM will be, not the people and not the MLA's,but somehow mostly MLA's from seemandhra got the cabinet posts.

  point 3 ... హింసాత్మక సంఘటల్ని పట్టించుకోకూడదు అనలేదు, హింస ని పట్టించుకోకుండా ఉండలేం కదండీ. రెండు వైపులా మొండితనం బాగా ఉంటే చివరికి హింస మిగులుతుంది. ఆంధ్రా రాష్ట్రము సంగతే తీసుకోండి. మద్రాసు లో మేముండము, తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేక రాష్ట్రము కావాలి అని గొడవ మొదలయింది. అప్పుడు కూడా ప్రభుత్వం ఒప్పుకోలేదు, ఇప్పుడు జరిగినట్టే అప్పుడు కూడా ఒక కమిటీ వేసారు JVP committee (జవహర్లలాల్ నెహ్రు, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య )ఆ కమిటీ భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాలుగా విభజిస్తే దేశ ఇకమత్యకి ఆటంకం కలగొచ్చు అన్న కారణం తో ప్రత్యక ఆంధ్రా ప్రత్రిపాదానని త్రోసిపుచ్చారు. తర్వాతా పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దేక్ష మొదలు పెట్టడం..అయన మరణించడం ...తర్వాత హింసాకాండ జరగడం చివరికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం జరిగింది. అదే ప్రభుత్వం, పొట్టి శ్రీరాములు దేక్ష లో ఉన్నప్పుడే ప్రాజాదరణ చూసి ఆంధ్ర రాష్ట్రము ఇచ్చేసినా , లేక ఒక referendum పెట్టి ఆంధ్ర రాష్ట్రము ఇచ్చేసినా , అప్పట్లో హింసాకాండ జరిగేది కాదు కదా.... అలా కాకుండా కమిటీ రిపోర్ట్ పట్టుకుని కూర్చోడం వల్లే కదా హింస జరిగింది. తెలంగాణా వాళ్లకి కలిసి ఉండటం ఇష్టంలేదని తెలుస్తోంది...ఉప ఎన్నికలలో కూడా ఆ విషయం రుజువు అయింది.

  ఇక ఉద్యమం లో students ....అసలు students participation లేని ఉద్యామాలు ప్రజాస్వామ్యం లో తక్కువ. ముందుగా రియాక్ట్ అయ్యేది, గ్రౌండ్ వర్క్ అంతా చేసేది, ఆవేశం - తెగువ చూపించేది, ప్రచారం కల్పించేది, తిరిగేది విద్యార్థులే...ఇప్పుడు కూడా చూడండి, OU కాంపస్ లో జరిగినంత హింస మిగతా తెలంగణా లో ఎక్కడైనా జరుగుతోందా ? అలా అని మిగతా తెలంగాణా లో వాళ్ళు సమైఖ్యఆంధ్రా లో ఉండాలనుకుంటున్నారా అంటే అది కూడా కాదు, ఉప ఎన్నికల ఫలితాలు చూస్తె తెలుస్తుంది. కాని దుడుకుతనం చూపించేది విద్యార్థులే ....

  point 4 : తెలంగాణా ప్రాంతం నిజాం పాలన లో బాగా దోచుకోబడింది, ఇక్కడి జల వనరులు కూడా తక్కువే, ఈ ప్రాంతం సముద్రతలం నుంచి బాగా ఎత్తులో ఉండటం వల్ల గోదావరి, కృష్ణ నదుల వల్ల డెల్టాలు , కోస్తాంధ్ర లో వున్నాయి కాని ఇక్కడ లేవు, నిజాం పాలన లోంచి భారదేశం లో కలిసే దాకా ఇక్కడి వ్యాపారం కూడా తక్కువే, అదే స్వతంత్రం వచ్చే సమయానికి ఆంధ్రా ప్రాంతం , తెలంగాణా తో పోలిస్తే బాగా అభివృద్ధి చెందినది, ధనవంతులు అక్కడే ఎక్కువ, అలా ఆంధ్రప్రదేశ్ అవతరించాగానే కాపిటల్ ఆంధ్రా ప్రాంతం నుంచి ఇక్కడికి ప్రవహించింది. హైదరాబాద్ చుట్టూ పక్కల ఆంధ్రా realtors భూములు బాగా కొన్నారు, అలానే ఇక్కడి పరిశ్రమలు స్థాపించింది కూడా ఎక్కువ శాతం ఆంధ్రా వాళ్ళే , అలా తెలంగాణా లో ఆంధ్రా పారిశ్రామిక వేత్తలు,Realtors ప్రభావం ఎక్కువయిపోయింది. దాని మీద కాబినెట్ లో ఎక్కువగా ఆంధ్రా వాళ్ళే ఉండటం ...ఇక్కడే రాజధాని అవ్వడం తో చాలా మంది ఇక్కడికి వలస రావడం ..ఇవన్ని కలిసి ఆంధ్ర వాళ్ళ ప్రభావం తెలంగాణా లో ఎక్కువయిపోయింది. ఇక అన్ని విషయాలలో ఆంధ్రా వాళ్ళే కనిపించడం మొదలు అయింది. ఇక్కడి వాళ్లకి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి, అలా ఆంధ్రా వాళ్ళ మీద వ్యతిరేకత మొదలయింది. ఒకప్పుడు మహారాష్ట్ర లో శివసేన, ప్రస్తుతం MNS లాగా ...ఇక్కడి వాళ్ళకి ఇదే ప్రాంతం లో ఉద్యోగాలు తగ్గిపోడం తో GO 610 వచ్చింది...అది సరిగ్గా implement అవ్వలేదు, పరిస్తితి ఇలానే ఉంటే కష్టమని ఉద్యమం మొదలయింది. దోచుకున్నారు దోచుకున్నారు అంటే, ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేస్తున్న ఆంధ్రా వాళ్ళ గురించి మాస్టారు, అంతే కాని విశాఖపట్నం లోనో, విజయవాడ లోనో, అక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ, అక్కడే వ్యాపారాలు చేసుకుంటూ ఉన్న వాళ్ళ గురించి కాదు.

  ReplyDelete
 21. @vijay ...

  http://sanjutheking.blogspot.com/2010/10/blog-post_30.html

  over excitement విజయ్ గారు, అది ఎంతలా ఉంటుందంటే, ఎం జరిగినా కమ్యునిస్టులు ...ఈ పెట్టుబాడీ దారి వ్యవస్థ అంటారు చూడండి...అలాంటిది. ఒకసారి facebook తెలంగాణా గ్రూప్ లో జాయిన్ అవ్వండి...తెలుస్తుంది..అక్కడ ఇష్టానుసారం రాస్తారు, SKC రిపోర్ట్ రాగానే టీవీ చానల్స్ coverage ఆపినపుడు మరీను, 700 bullets పేల్చారు, 400+ కి దెబ్బలు తగిలాయి, ఇంతమంది చనిపోయారు అది ఇది అని....తర్వాత కొంతకాలానికి ఇంకో update వచ్చింది...OU కాంపస్ లో central govt boarder security force దళాల్ని పెట్టింది అని...అది CRPF అని చెప్తే వినడానికి ఎవరు సిద్దంగా లేరు, సుమతీ శతకం లో కూరిమి గల దినములలో అని ఒక పద్యం గుర్తుందా...అలాంటిదే ఇప్పుడు ఇరు వర్గాల మధ్య సాగుతోంది.

  జలగం వెంగళ్రావు గారు ఖమ్మం కి చెందిన వారయినా అయాన కోస్తాంధ్రా రాజకీయాలలో ఎక్కువగా పాల్గొన్నారు. అయన రజకార్ల ఉద్యమం లో పాల్గొనలేదు. నక్సల్ ఉద్యమం అణచడం లో ఆయనకీ మంచి పేరుంది

  ReplyDelete
 22. @Sanju:
  mostly agreed అన్నారు కాబట్టి, lets come to common terms.
  ఉన్నదానికంటే మరింత మెరుగైన జీవితం కోసం ప్రయత్నించడం మానవ నైజం.దీనికోసం కష్టపడి చదవడం,రిస్క్ తీసుకుని వ్యాపారాలు చేసుకోవడం,ఉన్న వూరు వదిలి వేరే చోట్లకు వలస పోవడం etc.. ఇలా ఎవరికి అందుబాటులో ఉన్న మార్గంలో వాల్లు ప్రయత్నిస్తుంటారు. చట్టానికి లోబడి ఉన్నంతవరకూ, ఎవరూ వీరిని తప్పుపట్టలేరు. పైగా ఇలాంటి ప్రయత్నాలేవీ చేయలేక ఎవరైనా వెనుకబడి ఉంటే దాన్ని 'చేతకానితనం ' అంటారు కానీ, మంచితనం అని అనరు,అనకూడదు. తె.గా లో వ్యాపారాలు చేస్తున్న ఆంధ్రా వారు కానీ, ఏ ఇతర భారతీయుడైనా కానీ ఈ కేటగిరీ లోకి వస్తారు.
  ఇక 610GO, గురించి : రాష్ట్రం మొత్తం జోన్లుగా, ఏ జోను వారు ఆ జోన్లో లోకల్ అభ్యర్థులుగా, చట్టం చేయబడింది. కానీ రాయలసీమ జోన్లో ఉన్న మా ప్రాంతం నుండి, హిందీ,ఉర్దూ లాంటి టీచర్ పోస్టుల్లో కోస్తాంధ్రా లో ఉద్యోగాలు తెచ్చుకున్న వారు నాకు వ్యక్తిగతంగా తెలుసు.( ఆ ప్రాంతం వారికి ఈ సబ్జెక్ట్లు అంతగా రావు కాబట్టి అక్కడి అభ్యర్థులుగా అప్లయ్ చేసుకుంటారు. లంచం పడేసి లోకల్గా సర్టిఫికేట్లు సంపాదించడం తర్వాత అంత కష్టం కాదు.) ఎలాగోలా ఉద్యోగం సంపాదించుకోవాలనే తాపత్రయం తోనే అలా చేస్తారు గానీ, కోస్తాంధ్రాను దోచేసుకుందామని కాదు. ఐనా సరే, తప్పు తప్పే. చట్టాలు అమలుకు నోచుకోకపోవడానికి కారణం, వ్యవస్థలో లోపమే తప్ప, ఒక ప్రాంతం వారు పనిగట్టుకుని ఇంకో ప్రాంతాన్ని దోచేద్దామని చేసే పకడ్బంధీ ప్రయత్నం కాదు. వ్యవస్థలో మార్పు రానిదే సరిహద్దులు మారినంత మాత్రాన ఉపయోగం ఉండదు. పాపం ఈ మాట చెప్పినందుకే JP ని తెలంగాణా ద్రోహిగా ముద్ర వేసి, ఆయన మీద దాడి చేశారు. మీ వాదనలు కూడా ఇంచుమించు JPగారి లాగానే ఉంటున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీమీద కూడా దాడి చేసేయగలరు.

  ReplyDelete
 23. జలగం రజాకార్ల ఉద్యమం లో పాల్గొనలేదా? ఏ ఊరండి మనది?

  ReplyDelete
 24. తెలంగాణలో జరుగుతున్న ప్రచారం ఒకటి. ఆంధ్రాలో జరుగుతున్నది ఇంకొకటి. ఆంధ్రా పెట్టుబడిదారులే తెలంగాణకు వ్యతిరేకమని తెలంగాణలో చెబుతున్నరు. అదే నిజమైతే ఈ పాటికల్లా తెలంగాణ వచ్చేసేదే. కానీ ఆంధ్రాకు వెళ్ళి చూస్తే అక్కడ కూలీవాడినుంచీ, కోటీశ్వరుడి వరకూ ప్రతివొక్కరూ ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకమే. ఆంధ్రాస్ ఏ విషయమూ పైకి ఎక్కువ మాట్లాడరు. కాబట్టి తెలంగాణకు అడ్డు లేదనే ప్రచారం మొన్న 2009 వరుకు జరిగింది. 2009 లో చిదంబరం ప్రకటన తర్వాత ఆంధ్రాస్ బయటపడ్డారు గదా ! అట్లా 5 కోట్ల మంది వ్యతిరేకిస్తున్నప్పుడు తెలంగాణ రావడం చాలా కష్టం.

  ReplyDelete
 25. @sooraj ... haha..sure ...నా మీద దాడి జరగకుండా జాగ్రత్త పడతానండి.

  ఏదో ప్రత్యేక తెలంగాణా వస్తే, రాత్రికి రాత్రి తెలంగాణా లో అభివృద్ధి జరిగిపోదు, తెల్లారే సరికల్లా ప్రజలందరి దగ్గరా కార్లు రాలేవు.
  ప్రత్యేక తెలంగాణా వస్తే, తెలంగాణా కి వచ్చే కేంద్ర నిధులు తెలంగాణా ప్రాంతం కే పరిమితమవుతాయి, ఇక్కడి ఉద్యోగ అవకాశాలు ఇక్కడి వాళ్ళకే వస్తాయి. ఒకసారి ఇక్కడి ఉద్యోగ అవకాశాలు పెరిగితే, నెమ్మదిగా ఇక్కడ ప్రజల ఆర్ధిక స్తోమత పెరుగుతుంది.

  కాని ఇదంతా జరగడానికి అసలు రాష్ట్రము అంటూ ఏర్పడాలి కదా. ఒక రాష్ట్రము లో ఏదో కమిషన్ వేసేసి ఒక particular area develop అనేది ఈ దేశం లో ఎప్పుడు జరగలేదు, andhra-telangana gentlemen agreement కాని, బెంగాల్ లో గోర్ఖా హిల్ council కాని సరిగ్గా పని చేసిన దాఖలాలు లేవు. కాబట్టి ప్రత్యేక రాష్ట్రమే మార్గమని ప్రజలు నమ్ముతున్నారు.

  ReplyDelete
 26. @దేవనకొండ ..... మీరన్నది పాయింట్ కావొచ్చు కాని, ఆల్రెడి సీమంధ్ర రాజధాని గురించి చర్చలు మొదలుపెట్టేస్సారు, గుంటూరు విజయవాడ సర్కిల్ కి మంచి సపోర్ట్ కనబడుతోంది. చదువరి బ్లాగ్ మీరు చూస్తున్నరనుకున్తున్నాను.

  ReplyDelete
 27. నాకు తెలిసి వాళ్ళు ఆ బ్లాగులో చర్చిస్తున్నది. రెండో రాజధాని గురించి ! రెండో రాష్ట్రం గురించి కాదు. ఆ సంగతి తాడేపల్లిగారి కామెంట్స్‌లో స్పష్టంగా తెలుస్తోంది. హైదరాబాద్ లో ఎప్పుడో ఏదో ఒక డిస్టబెన్సెస్ వస్తున్నాయనీ అందువల్ల ప్రత్యామ్నాయంగా ఇంకో రాజధాని కూడా అవసరమనీ వాళ్ళు అనుకుంటున్నారు. మహారాష్ట్రకి రెండు రాజధానులున్నాయి. J&K కి రెండున్నాయి. అదీ వాళ్ళు చర్చిస్తున్నది. పాపం, మీరు ఆశపడ్డట్లు వాళ్ళు విడిపోవడం గురించి ఆలోచించడం లేదు.

  ReplyDelete
 28. @Sanju:
  ఏదో ప్రత్యేక తెలంగాణా వస్తే, రాత్రికి రాత్రి తెలంగాణా లో అభివృద్ధి జరిగిపోదు, తెల్లారే సరికల్లా ప్రజలందరి దగ్గరా కార్లు రాలేవు.//ఓ పది రోజుల తర్వాత వస్తాయా?//
  ప్రత్యేక తెలంగాణా వస్తే, తెలంగాణా కి వచ్చే కేంద్ర నిధులు తెలంగాణా ప్రాంతం కే పరిమితమవుతాయి, ఇక్కడి ఉద్యోగ అవకాశాలు ఇక్కడి వాళ్ళకే వస్తాయి. ఒకసారి ఇక్కడి ఉద్యోగ అవకాశాలు పెరిగితే, నెమ్మదిగా ఇక్కడ ప్రజల ఆర్ధిక స్తోమత పెరుగుతుంది. //తెలంగాణా రావడానికి అక్కడ ఉద్యోగ అవకాశలు పెరగడానికి ఏంటి సంబంధం..?గత పదేల్లలో ఎన్ని ప్రభుత్వ ఉద్యొగాలు వచ్చాయి? ఈ అడ్డగోలు ఉద్యమం వల్ల ప్రైవేటు రంగంలో పోతున్న ఉద్యోగాలు ఎన్ని?//

  కాని ఇదంతా జరగడానికి అసలు రాష్ట్రము అంటూ ఏర్పడాలి కదా. ఒక రాష్ట్రము లో ఏదో కమిషన్ వేసేసి ఒక particular area develop అనేది ఈ దేశం లో ఎప్పుడు జరగలేదు, //ప్రత్యేక రాష్ట్రం అవంగానే డెవెలప్మెంట్ జరగడం కూడా దేశంలో ఎప్పుడూ జరగలేదు. // andhra-telangana gentlemen agreement కాని, బెంగాల్ లో గోర్ఖా హిల్ council కాని సరిగ్గా పని చేసిన దాఖలాలు లేవు. కాబట్టి ప్రత్యేక రాష్ట్రమే మార్గమని ప్రజలు నమ్ముతున్నారు. //KCR లాంటి వారు అరచేతిలో స్వర్గం చూపిస్తూ ఉంటే ప్రజలు నమ్మకేం చేస్తారు. వారికి నిజానిజాలు వివరించి చెప్పే బాధ్యత మీలాంటి విద్యావంతుల మీద ఉంది. కానీ , మీలాంటి వారు, skybaba లాంటి వారు, మేము ప్రజల్ని ప్రభావితం చేయం, వారి నుంచి మేమే ప్రభావితం అయ్యాం అంటున్నారు. ఏంటో ఈ వింత లాజిక్..//

  ReplyDelete
 29. This comment has been removed by the author.

  ReplyDelete
 30. అంతే జమ్మూ కాశ్మీర్ లో లాగా శీతాకాలం కి ఒక రాజధాని, వేసవి కాలానికి ఒక రాజదానా ?

  @sooraj

  //తెలంగాణా రావడానికి అక్కడ ఉద్యోగ అవకాశలు పెరగడానికి ఏంటి సంబంధం..?గత పదేల్లలో ఎన్ని ప్రభుత్వ ఉద్యొగాలు వచ్చాయి? ఈ అడ్డగోలు ఉద్యమం వల్ల ప్రైవేటు రంగంలో పోతున్న ఉద్యోగాలు ఎన్ని?//
  తెలంగాణా వస్తే...తెలంగాణా పబ్లిక్ సర్వీసు కమిషన్ వస్తుంది..అవి కేవలం తెలంగాణా వాళ్ళకే వస్తాయి, ఇక్కడి secretariat లో ఇక నుంచి ఇక్కడి వాళ్ళే ఉంటారు ....ఇక్కడి పోలీసులు ఇక్కడి వాళ్ళే ఉంటారు.

  //ప్రత్యేక రాష్ట్రం అవంగానే డెవెలప్మెంట్ జరగడం కూడా దేశంలో ఎప్పుడూ జరగలేదు. // uttarakhand HDI rank is 12th where as uttarpradesh HDI rank is still 25th. Jharkhand is holing 24th rank , its carved out of bihar, where bihar is rank is 28th. Its only been only 10years both uttarakhand and jharkand took birth.

  @krishna manohari...i second you...తిట్టుకోడాలు ఎక్కువయ్యాయి. "ఇక్కడ కావలసింది ఆవలి పక్షపు ఉలికి పాటు కాదు" well said

  ReplyDelete
 31. @sanju:
  regarding the HDI rankings.
  these new states are formed away from the existing state capitals, which is different from what is happening in TG. huge amount of central funds flowed into these new states for building new capitals and infrastructure which caused that rankings. its not due to any new industry growth or any systematic growth plans. since you only said its just 10 years, no guarrentee that these numbers will sustain in future.

  ReplyDelete
 32. @sooraj ...HDI ranking was not solely based on infrastructure, the ranks i have mentioned are based on old HDI method which considers life expectancy, educational index, adult literature , gross enrollment and GDP ...and infrastructure is part of GDP

  Probably your argument is valid, then the HDI rank of seemandhra will go upwards if hyderabad is left to telangana ..
  In the same way....central funds (lets say which are less compared to what seemandhra got because capital is already here for few years) which are allocated to telangana will be helpful to the development of only telangana area.
  Its good for both then...

  ReplyDelete
 33. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 34. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 35. This comment has been removed by the author.

  ReplyDelete
 36. This comment has been removed by the author.

  ReplyDelete
 37. ఇలా చెప్తున్నందుకు సారీ. మీరు కనీస పరిఙ్ఞానం లేకుండా మాట్లడుతున్నారు. అసలు పబ్లిక్ సర్వీస్ కమీషన్ కల్పించే ఉద్యోగాలెన్ని? ప్రస్తుతం ప్రభుత్వోద్యోగాలకి ఉన్న అవకాశమెంతా? ఇది కేవలం 2-3 శాతం. మీ స్నేహితుల్లో (ఈ తరం వాళ్ళు) ఎంతమంది ప్రభుత్వోద్యోగాల్లో ఉన్నారు? అదీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లొ ఎంత మంది ఉన్నారు?

  తెలాంగాణ వస్తే కొత్తగా పదిలక్షల ఉద్యోగాలొస్తాయని వేర్పాటు వాదులు దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు ఇప్పుడు మొత్తం అంధ్రప్రదేశ్ లో ఉన్నదే సుమారుగా 13 లక్షల ఉద్యోగాలు. అందులో తెలంగాణ లో ఆరున్నర లక్షలు ఉన్నాయి. వీటిల్లో మజారిటి వాటా తెలంగాణ వాల్లదే. దయచేసి మళ్ళీ పాత ఆరోపణలే చెయ్యద్దు. ఇవికాక కొత్తగా పదిలక్షలు అసలు సాధ్యమేనా? ఇందులో యావరేజ్ జీతం 10000 అనుకున్నా కొత్తగా నెలకి 1000 కోట్లు భారం పడుతుంది. ఇదికాక ఉన్న ఆరున్నర లక్ష ఉద్యోగాలకి జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది.

  పైగా కేవలం "తెలంగాణ" వాళ్ళకే అంటే అర్ధం ఏంటి? ఇక్కడ పుట్టిన మిగిలిన ప్రాంతాల వారి పరిస్థితి ఏంటి? అప్పుడు మళ్ళీ వారిని వెళ్ళగొట్టటానికి మరో ఉద్యమం చేస్తారా?

  btw.. shall we compare GDP growth and HDI in telangana and andhra regions?

  ReplyDelete
 38. స్కైబాబా గారిలాంటి వాళ్ళయినా, ఉద్యమనాయకులయినా సంజు గారు చూపుతున్నంత సంయమనం చూపగలిగితే ఉద్యమం తీరు మరోలా ఉండేదోమో! సమైక్యాంధ్రవాదులూ వోర్పుతో వాదన వింటే, చర్చిస్తే, సమస్య పరష్కారమేదయినా సామరస్యంగా సాధ్యపడుతుంది. ముందు తెలంగాణా ఉద్యమకారులంతా సీమాంధ్ర వాళ్ళను "దోపిడీదారులు", కుట్రదారులు" అనడం మానండి. ఆ పదాలకు అర్థం తెలిసే వాడుతున్నారా? "తరిమికొడతాం", "నెత్త్రు పారుతుంది" వంటి ద్వేషపూరితమైన మాటలను నివారించండి.

  వొప్పందాలు అమలు జరగని మాటా, తెలంగాణకు కొన్ని అంశాల్లోనయినా అన్యాయం జరిగిన మాటా ఎవరయినా వొప్పుకోవలసిందే. ప్రత్యేక తెలంగాణా మెజారిటీ ప్రజల అభిమతమయితే దాన్ని అందరూ శిరసావహించవలసిందే. హైద్రాబాదు రూపంలో నష్టం కలుగుతుంది కనక సీమాంధ్రప్రాంతానికి న్యాయం ఎట్లా జరుగుతుందో ఆలోచించడమే మార్గం.

  అయితే ముందుగా ప్ర్జాభిమతాన్ని కనుక్కోవాలి. 2001 నుంచీ ఉన్న తెరాసకు 119 సీట్లలో దక్కిన సీట్లెన్ని? వచ్చిన వోట్లెంత శాతం? 11 ఉప ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ చూసి నిర్ధారించలేం. విడిపోతే, లేదా కలిసుంటే కలిగే లాభనష్టాలను వివరించి ప్లెబిసైట్ నిర్వహిస్తారని ఆశించడం అత్యాశేనా?

  ReplyDelete
 39. This comment has been removed by the author.

  ReplyDelete
 40. @Srinivas,
  "ప్రత్యేక తెలంగాణా మెజారిటీ ప్రజల అభిమతమయితే దాన్ని అందరూ శిరసావహించవలసిందే."
  --------
  అలాగే (గ్రేటర్)హైదరాబాద్ ప్రజల అభిప్రాయం మాటేమిటి? తెలంగాణా లో కలసిఉండాలో, ప్రత్యేక రాష్ట్రం కావాలో, కేంద్రపాలిత ప్రాంతంగా ఉండాలో హైదరాబాద్ ప్రజల ఇష్టమా, తెలబాన్ దొర గారి ఇష్టమా?

  అలాగే ఖమ్మం లాంటివి ఎవరితో కలసి ఉండాలో ఎవరి ఇష్టం? కరీమ్నగర్ దొరగారి ఇష్టమా?

  ఏ రిపోర్ట్ పరంగా చూసినా అత్యంత వెనకబడిన ప్రాంతం అయిన రాళ్లసీమ ఎవరితో కలసిఉండాలో, విడిపోయి రాష్ట్రం అవాలో ఎవరి ఇష్టం?

  ReplyDelete
 41. We need not learn any lessons from Andhra brothers regarding struggle and the logic that should be the base for a struggle. We have great history and tradition of struggle.Telangana movement is not driven by the leaders as alleged, it is other way round students and people are compelling the leaders to take up telangana cause. Division is the only solution for the problems that Telangana is facing.

  Sree Krishna committee’s report which is very unprofessional and made funny arguments made an observation that most of the leaders of telangana are from first generation where as leaders of seemaandhra are of either second or third generation. Tremendous change has taken place in telangana as far as social and economic relationships are concerned because of various progressive movements including naxal movement. Whereas in seemaandhra still feudalism prevails with some families yielding excessive power and controlling vast territories. In the given objective conditions leaders of telangana are unfavorably placed in the power structure of united Andhra Pradesh. In this situation it is not possible for telangana leaders to deliver much. Since we cant advocate telangana to go feudal, division is the only way ahead.

  We need not compare Egypt with the present telangana agitation. what has happened in Egypt now has happened in telangana 60 years before . What has happened now in Egypt is more an outburst and an agitation. where as telangana movement is a well thought out and an organized peaceful movement for furthering the cause of democracy. The ideals and the changes in society which telangana movement aims at is something for which it may take 50 more years for Egypt to think about. Even then the militancy and the dedication shown by Egypt agitators is always an inspiration.

  It is very difficult to be balanced and composed in a situation where you are genuinely fighting for a righteous cause and the opposite group is not willing to listen to you more over they are passing sarcastic comments. Even then we should maintain restraint.

  We are very clear about development, various indices, injustice done to telangana . We have been discussing and debating these issues for the past few years through various fora and various media including folk. New entrants to this debate may do their home work so that time is not wasted in futile debates. We unanimously hold the opinion that development can not be an alternative to self rule

  ReplyDelete
 42. @విజయ్...మీరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలని చాలా తక్కువ అంచానా వేస్తున్నారు. సర్వీసు కమిషన్ అనగానే కేవలం group 1 and 2 అని మాత్రమె అనిపిస్తుంది. అటెండర్ ఉద్యోగాల దగ్గరనుంచి, పోలీసు కానిస్టేబుల్, టీచర్స్, డాక్టర్స్ , జూనియర్ లేక్టురేర్స్ , చివరికి కాంట్రాక్టు ఉద్యోగాల వరకు, ప్రభుత్వ ఉద్యోగాల పరిధి చాలా పెద్దదండి. నేను , నా స్నేహితులు దేన్లో పని చేస్తుంటే అందరు అదే ఫీల్డ్ లో పని చేస్తున్నారు అనుకోలేం కదా... 'తెలంగాణా వాళ్ళకి' అనగా ....తెలంగాణా లో రెసిడెంట్ గా ఉన్న వాళ్లకు అని అర్థం. భారతరాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి యొక్క జన్మస్థలం బట్టి అతన్ని discriminate చేయలేము. ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి ఇక్కడి వాడే అవుతాడు, ఒక వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినవాడో ఆ వ్యక్తి ఆ ప్రాంతం లో ఎంతకాలం ఉన్నాడు అన్నదాని మీద ఉంటుంది కాని, వారి తల్లి దండ్రులు వలస వచ్చారా లేక ఇక్కడి వాళ్ళేనా అన్న దాని మీద కాదు.

  @srinivas ....ప్లెబిసైట్ అత్యాశే కవోచ్చండి.

  @blog administrator .... by mistake i have typed 'literature' instead of 'literacy', somebody pointed out it and i have replied with a sorry for my typo error. i could not understand why you have to remove that post.

  ReplyDelete
 43. @krishna

  మీ ప్రశ్న బానేవుంది కానీ, హైదరాబాదుతో సహా తక్కిన తెలంగాణా జిల్లాలన్నీ విశాలాంధ్రలో ఒక యూనిట్ గానే కలిశాయి కనక తెలంగాణాకంతటికీ ఒకటే రిఫరెండం ఉండడమే న్యాయం.
  ===
  ప్రత్యేక రాష్ట్రం కోరడాన్ని తప్పు పట్టలేము. ఉద్యమం మాత్రం తప్పుదోవన నడుస్తుంది. విద్వేషాలను రగుల్చుతున్న అసత్య ప్రచారాలు వాతావరణాన్ని విషపూరితం చేస్తున్నాయి. విడిపోవడమే తప్ప మార్గం లేదని యావత్ తెలంగాణా నిర్ణయించుకుందన్న నమ్మకం ఉన్నప్పుడు తెరాస 119 సీట్లలో 100 సీట్లయినా గెల్చుకుంటే, 15 మందినయినా పార్లమెంటుకు పంపగలిగితే సమస్య ఇంకా సులువుగా తీరుతుంది కదా!

  ReplyDelete
 44. /విడిపోతే, లేదా కలిసుంటే కలిగే లాభనష్టాలను వివరించి ప్లెబిసైట్ నిర్వహిస్తారని ఆశించడం అత్యాశేనా? /
  ప్లెబిసైట్ తెలంగాణకు మాత్రమేనా, దేశంలోని 'అన్ని ప్రాంతాలకు' వర్తిస్తుందా? మనోభావాలు, ఉద్రేకం ఈరోజుంటుంది రేపు పోతుంది. ఎన్నికల ద్వారా నాయకులను ఎన్నుకుంటున్నారు. అంత విజ్ఞత కల ప్రజలే వుంటే గడ్డి లల్లూ, గూండా పప్పూ యాదవ్, అవినీతి జయలలిత, కరుణానిధులు, విగ్రహాలపిచ్చి మాయావతులు .. ఇలా ౩0%నేరచరితులు మరీ మరీ ఎన్నిక అయ్యేవారా?

  సంజు, మీరు చెప్పేది చూస్తుంటే ప్రభుత్వోద్యోగాల్లో తెలంగాణ ప్రాంతీయులు లేరేమో అనిపిస్తోంది. రావాల్సిన దాని కన్నా ఎంత శాతం తక్కువ జాబ్స్ వస్తున్నాయి? అది సరిదిద్దుకోలేని పొరపాటా, లేదా విభజనే తప్ప వేరే గత్యంతరం లేదని భావిస్తున్నారా? ఎన్ని వుద్యోగాలు రాజకీయ నిరుద్యోగులకు వస్తాయి? 100% దాకా అవునా? గిరి గీచినట్టు ఈప్రాంత కోటా ఇంత అని తెలంగాణా జిల్లాల్లో అమలు చేయగలరా? అక్కడ చేయగలమంటే ఇక్కడా చేయగలం.

  పాలనా సౌలభ్యం కోసం తప్ప, సెంటిమెంట్లు, మనోభావాలు, ఆత్మగౌరవాలకోసం ఇప్పటి భద్రతాకారణాల దృష్ట్యా విభజించే అవసరం లేదు. విభజించాల్సివస్తే, ప్రాతీయ దురహంకారాలకు ముందు ముందు ఆస్కారంలేకుండా జిల్లాలను కలుపుతూ విభజించాలి. నన్నడిగితే, రాష్ట్రంలో ప్రతిచోట ప్రాంతేతరులకు ప్రభుత వుద్యోగాల్లో కోటా వుండాలి, తప్పనిసరి ప్రాంతేతర అనుభవం వుండేలా బదిలీలు చేయాలి. అప్పుడైనా ప్రాతీయమూర్ఖత్వం, అర్థలేని అపోహలు, తగ్గుతాయి.

  ReplyDelete
 45. కనీసం 10వ తరగతి ఫెయిల్ అయిన వారికి మాత్రమే ఓటు వేసే హక్కు వుండాలి.

  ReplyDelete
 46. @Sanju,

  It seems you didn't read the report properly. I am talking about all type of govt jobs, though you mentioned only service commission. They are only 3 or 4% of total employment in the state. In that also the % violations are well below the permitted 20%. And these violations are across all zones. So, what is the 20% of 4% of jobs? do we need a separate state to correct that?

  Btw.. Let me appreciate you for your sensible way of debating. Most of them I came across speak with emotions and foul language

  ReplyDelete
 47. Bandhs and violence.....is badly affecting the development of Hyderabad. The government should slowly make a future plan to shift the capital to some other place in seemandhra. Though its not an easy task.....but this could be one of the good alternatives. It will be helpful for the common people from all the four regions(Andhra,Seema, Telangana,Hyderabad) to live safe and peacefully in seemandhra region. Also once the capital is changed, no one cares about these pro-T dogs barking in Hyderabad streets.

  ReplyDelete
 48. @Snkr
  తెలంగాణా మిగతా ప్రాంతంతో కలిసిన పరిస్థుతులనూ, ప్రస్తుత సమస్యనూ దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే ప్లెబిసైట్ న్యాయమే అనిపిస్తుంది. మిగతా ప్రాంతాలకు ఇది వర్తిస్తుందా లేదా అన్నది ఆ ప్రాంత చరిత్రా, సమస్యా నిర్ధారిస్తాయి. ప్రజాస్వామ్యంలో నిర్ణయాధికారం ప్రజల విజ్ఞతబట్టి ఉండదు. చదువుకూ, స్వార్థానికీ, తెలివితక్కువతనానికీ సంబంధం లేదు.

  ReplyDelete
 49. శ్రీనివాస్ గారు,
  ప్లెబిసైట్ చేయడానికి అర్హమైన విషయం కాదు. ఆందోళన తీవ్రతరం/హింసాత్మకమైతే ప్రజాస్వామ్య బద్ధమైన పరిష్కారాలు చాలా వున్నాయి- సాయుధ పోలీస్, తాయిలాలు/బిస్కెట్లు, పొరుగు రాష్ట్రాల పోలీస్, జనాకర్షక పథకాలు, సిఆర్పిఎఫ్, ఓదార్పు యాత్రలు, బిఎస్ఫ్, ఆర్మీ ఇలా.
  /ప్రజాస్వామ్యంలో నిర్ణయాధికారం ప్రజల విజ్ఞతబట్టి ఉండదు. చదువుకూ, స్వార్థానికీ, తెలివితక్కువతనానికీ సంబంధం లేదు. /
  కొంతవరకు నిజమే.
  ఆ పైన ఫోటో చూడండి, ఏమనిపిస్తోంది?నిరక్షరాస్యులకన్నా కాస్త చదువుకున్న వారికి కాస్త విజ్ఞత వుండే అవకాశాలున్నాయ్ అనిపించట్లేదూ?

  ReplyDelete
 50. Join in this group..

  http://www.facebook.com/home.php?sk=group_182918855082608&ap=1

  or

  Newcapital4Telangana@groups.facebook.com

  Capital City of 'Telangana' State -Debates and Discussions

  Description
  ;
  This Group is for Fun and discussions on Imaginary Telangana state after Hyderabad is declared as UT .. if at all bifurcation happens . The Bifurcation is a Hallucination by some stupid Pro-Telanganites. Lets make some fun of such Hallucination.

  I nominated few cities in So called Telangana state . Lets make fun by nominating the cities which can be future capital city for "Heheheh" Telangana state.

  1. Warangal + Hanumakonda
  2. Karimnagar
  3 Adilabad
  4. Nizamabad

  And i suggest ProTs to rename the new capital city to TeLangabad ...in memory of lost Hyderabad.

  we Permit the members to post any shit in the group ... Just make those "ProT idiots who insult UAP" look like stupids .

  ReplyDelete
 51. మాకు చదువు సంధ్య . పనీ పాట , ఉద్యోగం సద్యోగం ఉంటె అదే పని చేసుకునేటోళ్ళం . అవేమీ లేవు కాబట్టి తెలంగాణా బూచి చూయించి రోడ్ల మీద పడి అల్లర్లు చేస్తున్నాం . పనిలేని మంగలోడు పిల్లి తల అన్నా గోరగాలి కదా !
  ఇట్లు
  OUJAC

  ReplyDelete
 52. పని లేని మంగళోడు పిల్లి బొచ్చు గొరిగాడు అనే సామెత సమైక్యాంధ్ర జె‌ఎ‌సికి వర్తిస్తుంది. సామాజిక ప్రయోజనాలు పట్టనివాళ్ళు వేరే పని లేక హైదరాబాద్ కోసం వీధి పోరాటాలు చేస్తున్నారు.

  ReplyDelete
 53. I won't object if some one nominates Warangal or Hanmakonda as capital of Telangana. But samaikyandhra JAC will object even if united Andhra's capital is shifted to Warangal or Hanamkonda without bifurcation of the state. Because, the only thing they want is Hyderabad.

  ReplyDelete
 54. వరంగల్ దాక ఎందుకు? ఎవరైనా కాకినాడనో, రాజమండ్రినో రాజధానిగా నామినేట్ చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తే సమైక్యవాదులు అలా నామినేట్ చేసినోడిని అడ్డమైన తిట్లు తిడతారు. కెసి‌ఆర్‌ని ఎంత టిట్టారో, కాకినాడ & రాజమండ్రిలని రాజధానిగా నామినేట్ చేసినవాణ్ణి అంతే తిడతారు. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ కోసమే సమైక్యాంధ్ర ఉద్యమం నడుపుతున్నారని వాళ్ళకి తెలుసు.

  ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి