Saturday, 19 February 2011

సీమంధ్ర రచయితలు తెలంగాణకు మద్దతు పలకాలి



ఆదిలాబాద్ లో జరుగుతున్న కథా సమ్మేళనం ను - సహాయ నిరాకరణ లో భాగంగా, సమైక్య వాదులతో వేదిక పంచుకోవడం సరైంది కాదనే మిత్రులతో ఏకీభవిస్తూ బహిష్కరించాము. తెలంగాణ కు మద్దతు గా తీర్మానం చేయాలని డిమాండ్ చేశాము. తెలంగాణ వ్యాప్తంగా సహాయ నిరాకరణ పూర్తి స్థాయిలో జరుగుతున్నది. సీమంధ్ర మీడియా వివక్ష చూపుతున్నది. ఇది ప్రజాస్వామ్య విధానం కాదు. ఈ విషయాలన్నీ గ్రహించి ఇప్పటికైనా సమైక్య వాద రచయితలు తెలంగాణ కు మద్దతు పలకాలి. లేదంటే చరిత్ర లో సాహితీ ద్రోహులు గా మిగిలిపోతారు. అరబ్ కంట్రీస్ లో జరుగుతున్న ఉద్యమాలను సపోర్ట్ చేసే రచయితలు తెలంగాణ కు మాత్రం ఎందుకు మద్దతివ్వరు? తన దాక వస్తే గాని- వారి నైజం బయట పడిందన్నమాట ... ఎంత సిగ్గుచేటు..!!

18 comments:

  1. తెలంగాణాకి మద్దతుగా ఉన్న కత్తి పద్మారావు గారు, రంగనాయకమ్మ గారు కోస్తా ఆంధ్రకి చెందినవారే. పద్మారావు గారిది గుంటూరు జిల్లా, రంగనాయకమ్మ గారిది పశ్చిమ గోదావరి జిల్లా.

    ReplyDelete
  2. /తెలంగాణ కు మద్దతు పలకాలి. లేదంటే చరిత్ర లో సాహితీ ద్రోహులు గా మిగిలిపోతారు. /
    ఆహాహా! తెలంగాణకు మద్దతు తెలపకపోతే సాహిత్యానికి ద్రోహమా!! :)) తెలంగాణనే సాహిత్యమా?!
    అసలైన ప్రజాస్వామ్యమంటే ఇది! దాడి చేసి, కొట్టి, చిత్రహింసలు పెట్టైనా తెలంగాణాకు మద్దతు సంపాదించాలి. మీ ప్రజాస్వామ్య స్పూర్తి వుంది చూశారూ, ఈజిప్ట్ కాదు, ట్యునీషియా కాదు, ఖండాతరాలు వెతికినా నభూతో నభవిష్యతి. :))

    Buffoons.

    ReplyDelete
  3. ఈయన చెప్పేది, ఆయన సంపాదకత్వంలో రాబోతున్న 'అభినవ తెలంగాణా చరిత్ర ' అనే పుస్తకంలో ఉండబోతున్న ద్రోహుల గురించి అనుకుంటా.. దీనిలో ద్రోహుల లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఉదాహరణకి సీమాంధ్రాలో ఉన్న 8 కోట్ల ప్రజలు, అలాగే దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న 'జై తెలంగాణా ' అనని మొత్తం 94 కోట్ల ప్రజలు, అలాగే ప్రపంచంలోని తెలంగాణేతర మొత్తం ప్రజలు(నంబర్ కరెక్ట్ గా తెలీదు) వీరందరూ తెలంగాణా ద్రోహులే. ఇక లేటెస్ట్ తెలంగాణా ద్రోహుల ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి. 3) జస్టిస్ శ్రీక్రిష్ణ( రిపోర్ట్ వీరికి అనుకూలంగా ఇవ్వలేదు కాబట్టి).2) ప్రధాని మన్మోహన్ సింగ్( మొన్న ప్రెస్ మీట్ వల్ల). ఇక టాప్ 1)JP ( అసెంబ్లీ లో జంతువుల్లా ప్రవర్తించ వద్దని చెప్పినందుకు)
    మరో మాట, తెలంగాణా లో, జై తెలంగాణా అన్న అవినీతి అధికారులు,ప్రజ సమస్యలు పట్టించుకోని రాజకీయనాయకులు ఇలాంటి వారు తెలంగాణా ద్రోహులు కాదు సుమీ..

    ReplyDelete
  4. లేదంటే చరిత్ర లో సాహితీ ద్రోహులు గా మిగిలిపోతారు. అరబ్ కంట్రీస్ లో జరుగుతున్న ఉద్యమాలను సపోర్ట్ చేసే రచయితలు తెలంగాణ కు మాత్రం ఎందుకు మద్దతివ్వరు? తన దాక వస్తే గాని- వారి నైజం బయట పడిందన్నమాట ... ఎంత సిగ్గుచేటు.__________________________

    తెలంగాణాకు సపోర్టు చేయకపోతే మొత్తం సాహిత్యానికే ద్రోహులా? ఇదెలాగ? ఏ కోణంలో ఆలోచించినా అర్థం చేసుకోలేకపోతున్నా ఈ మాటని.

    మద్దతు స్వచ్ఛందంగా ప్రకటిస్తారా డిమాండ్ చేసి సాధిస్తారా?

    మీ మాటలు అర్థం కావాలంటే రమణమూర్తి సహకారం తీసుకోవాల్సి వచ్చేట్లుంది

    ReplyDelete
  5. స్కై గారు, అరబ్ జాతీయ విముక్తికి మద్దతు ఇచ్చేవాళ్లు తెలంగాణా రాష్ట్రానికి మద్దతు ఇవ్వకపోవడానికి కారణం ఉంది. అమెరికా అరబ్ దేశాలని ఆక్రమించుకుంటే ఆయిల్ ధరలు పెరుగుతాయి. పెట్రోల్ ఇక్కడ ఖరీదైన సరుకు కదా. తెలంగాణా విషయానికి వచ్చేసరికి అదేదో సినిమాలోలా నాకేమిటి అని లెక్కలు వేస్తారు.

    ReplyDelete
  6. కెసిఆర్ భాషలో చెప్పాలంటే, జై తెలంగాణ అని మీలా చచ్చు, సన్నాసి, దద్దమ్మలవడం కన్నా, ద్రోహులు అనే పదమే బెటర్ అనిపిస్తోంది. ఓ మీరా స్కైలాబ అంటే! ఐ సీ! :))
    మీకు తగిన జోడీ దొరికాడుగా! కంగ్రాట్స్! :D

    ReplyDelete
  7. జోడీ ఏమిటి? ఆయన దళిత ముస్లింవాద రచయిత, నేను కార్మిక విప్లవాన్ని అడ్వొకేట్ చేసేవాడ్ని. తెలంగాణా అనేది వివిధ వర్గాల ఉమ్మడి అజెండా. దాని కోసం వాదాలని పక్కన పెట్టి ఉమ్మడిగా పని చెయ్యడంలో తప్పు లేదు. దీనికేదో బరాబర్ జోడీ అని పేరు పెట్టాల్సిన పని లేదు.

    ReplyDelete
  8. నేను కార్మిక విప్లవాన్ని అడ్వొకేట్ చేసేవాడ్ని
    -----------
    అబ్బా ఛ ... నిజమా ... ఏ ఉర్లో ప్రవీణు

    ReplyDelete
  9. నేను ప్రత్యేక తెలంగాణా వాదినే కానీ, తెలంగాణా ఉద్యమాన్ని సమర్థించని వారు సాహిత్య ద్రోహులు అనడం ఎం బాలేదు.

    ReplyDelete
  10. స్కైబాబ గారు. వీళ్లని అడిగితే అరబ్ జాతీయ విముక్తి, తెలంగాణా వేరువేరు అంశాలని వాదిస్తారు. తెలకపల్లి రవి గారనే ఒక మేధావి ఉన్నారు. జాతులకి స్వయంపరిపాలన అవసరమే కానీ ప్రాంతాలకి స్వయంపరిపాలన అవసరం లేదని నమ్ముతారు. తెలకపల్లి రవి గారు ప్రజాశక్తి బుక్ హౌస్ ఎడిటర్. జాతులలాగే ప్రాంతాలు కూడా ప్రజల ఐడెంటిటీని నిర్దేశిస్తాయని జోసెఫ్ స్టాలిన్ వ్రాసిన థీసిస్ అతను చదివారు కానీ అతనికి ఏమీ అర్థం కాలేదు. 1765 వరకు సర్కార్ జిల్లాలు (శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, కొండపల్లి) నిజాం పాలనలో ఉండేవి. తరువాత బ్రిటిష్‌వాళ్లు వీటిని స్వాధీనం చేసుకున్నారు. బ్రిటిష్‌వాళ్లు ఇక్కడ ఓడరేవులని అభివృద్ధి చేసి, ఇరిగేషన్ ప్రోజెక్ట్‌లు, రైల్వే లైన్లు నిర్మించి ఈ ప్రాంతం ఆర్థికంగా ముందు ఉండేలా చేశారు. ఇది వాళ్ల వ్యాపారం కోసమే అయినా దీని వల్ల సర్కార్ ప్రాంతం నైజాం ప్రాంతం కంటే ఆర్థికంగా ముందుకి వెళ్లింది. అలాగే నెల్లూరు జిల్లాని ఆర్కాట్ నవాబుల నుంచి స్వాధీనం చేసుకుని అక్కడా తమ వ్యాపార కేంద్రాలు పెట్టుకున్నారు. 1765 నుంచి సర్కార్, నైజాం ప్రాంతాలు వేరువేరు చారిత్రక ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రాంతాలే. ఇప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచినంత మాత్రాన రెండు ప్రాంతాల ప్రజలు కలిసిపోతారని నేను అనుకోను. విశాఖపట్నంలో గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కేవాళ్లలో ఎక్కువ మంది హైదరాబాద్‌లోనే దిగుతారు. ఖమ్మం, వరంగల్, కాజీపేటలలో దిగేవాళ్లు తక్కువ. 1983 నుంచి 1987 వరకు వరంగల్‌లో, 1991 నుంచి 1995 వరకు కరీంనగర్‌లో ఉండేవాళ్లం. ట్రాన్స్ఫర్ అయ్యి తిరిగి ఇక్కడికే వచ్చేశాం. హైదరాబాద్‌లో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కనుక హైదరాబాద్ ఎక్కువ మంది వెళ్తారు. ఖమ్మం, వరంగల్ ప్రాంతాలలో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయని అక్కడి ఎంత మంది వెళ్తారు? వరంగల్ జిల్లా మంగపేట రేయాన్స్ ఫాక్టరీ తప్ప వేరే ఏ ప్రాంతంలోనూ కోస్తా ఆంధ్రవాళ్లు ఎక్కువగా కనిపించరు. రెండు ప్రాంతాల మధ్య ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సామాజిక చలనం (social mobility) ఎక్కువ లేనప్పుడు రెండు ప్రాంతాలవళ్లు సులభంగా కలిసి ఉంటారనుకోను.

    ReplyDelete
  11. అవును అస్థిత్వవాదం పేరుతో సాహితీ వ్యభిచారం నెరిపే ఈ స్త్రీవాద-దళిత-ముస్లిం-కార్మిక-గే "కవులతో" గళం కలపలేదో, ఖబడ్దార్! చరిత్రలో మానసికవ్యభిచారుల వరుసలో శాశ్వతంగా చోటు పోగొట్టుకుంటారు.

    ReplyDelete
  12. /రెండు ప్రాంతాల మధ్య ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సామాజిక చలనం (social mobility) ఎక్కువ లేనప్పుడు రెండు ప్రాంతాలవళ్లు సులభంగా కలిసి ఉంటారనుకోను. /

    క్యా బాత్ హై! హీహీహీ
    మీరెప్పుడైనా మిదనాపూర్ వెళ్ళారా? మైలౌడీ(బూతు కాదు, మావో మీద ఒట్టు ఆ పేరుతో ఓ వూరుంది), కోటరక్కర, కుళ్జిమథికడ్ ఎక్కడున్నాయో అటుంచి, ఎలా పలకాలో ప్రాక్టీస్ చేశారా? తమరనుకోలేదని ఆ ప్రాంతాలతో తెగతెంపుల్జేసుకున్నామా?!
    చైనా ఎక్కడుందో మ్యాపులో చూడటం, తప్ప ఎప్పుడైనా రైల్లో అక్కడ దిగారా? మరి మావోతో మమేకం ఎలా అయ్యారో ఎప్పుడైనా ఆలోచించారా?

    ReplyDelete
  13. Who are prostitutes in reality Mr RK? During 2004 elections, both YSR and Lagadapati supported Telangana state. They twisted their toungues later. అవసరమైతే తెలంగాణా, లేకపోతే సమైక్యాంధ్ర. కాంగ్రెస్‌వాళ్లైనా, తెలుగు దేశంవాళ్లైనా ఇంతే.

    ReplyDelete
  14. @Snkr. I studied sociology in university and I am also aware about geography. గ్రామీణ ప్రాంతాలలో కరువుకాటకాలు వచ్చినప్పుడే ప్రజలు వలసలు పోవడం జరుగుతుంది. పారిశ్రామిక ప్రాంతాలకైతే ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాల వాళ్లు రావడం తరచు జరుగుతుంది. మహారాష్ట్రలో గడ్చిరోలీ ఎక్కడ ఉందో నాకు తెలుసు. ఆ జిల్లాలో తెలుగు మాట్లాడేవాళ్లు ఉన్నారు కాబట్టి ఆ జిల్లా పేరు నాకు బాగానే గుర్తుంటుంది. కాకపోతే ఆ జిల్లాలో ఒకటి రెండు తప్ప వేరే భారీ పరిశ్రమలు లేవు కాబట్టి దూర ప్రాంతాలవాళ్లు ఆ జిల్లాకి దాదాపుగా వెళ్లరు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు స్టేషన్‌లో కర్నాటకలోని బళ్లారి వెళ్లడానికి బ్రేక్ జర్నీ టికెట్ తీస్తున్న వ్యక్తిని చూశాను. శ్రీకాకుళం రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌లో ఇక్కడి నుంచి హుబ్లి వెళ్లడానికి డైరెక్ట్ ట్రెయిన్ ఉందా అని అడుగుతున్న వ్యక్తిని చూశాను. ఇక్కడి నుంచి గడ్చిరోలీకి డైరెక్ట్ ట్రెయిన్ ఉందా అని ఎవరూ అడగరు. కేవలం ఒకటిరెండు పరిశ్రమలు ఉన్న వెనుకబడిన ప్రాంతానికి ఇంత దూరం నుంచి ఎవరు వెళ్తారు? వలస వెళ్లినవాళ్లు కొత్త ప్రాంతంవారితో స్నేహసంబంధాలు ఎంత వరకు కలుపుకుంటున్నారు? భువనేశ్వర్, ఖుర్దా పట్టణాలలో తెలుగువాళ్ల ఇళ్లు, ఒడియావాళ్ల ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. హైదరాబాద్‌లో కోస్తా ఆంధ్ర నుంచి వలస వచ్చినవాళ్ల ఇళ్లు కూకట్‌పల్లి, చందానగర్ లాంటి ప్రాంతాలలోనే ఎక్కువగా ఎందుకు ఉంటాయి? కోస్తా ఆంధ్ర, తెలంగాణాల మధ్య ఉన్న social mobility తక్కువ. ఇక్కడి నుంచి తెలంగాణాకి వలస వెళ్లేవాళ్లు ఎక్కువగా హైదరాబాద్‌లోనే స్థిరపడతారు. తెలంగాణాలో స్థిరపడేవాళ్ల దృష్టి ప్రధానంగా హైదరాబాద్ మీదే ఉన్నప్పుడు ఆ ప్రాంతంవాళ్లతో అంత సులభంగా స్నేహసంబంధాలు కలుపుకోవాలని ఎందుకు అనుకుంటారు?

    ReplyDelete
  15. /I studied sociology in university and I am also aware about geography./
    మంచిది, ప్రవీణ్ గారు.
    కోస్తాంధ్రులు మలక్పేట, దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం, నల్లకుంట, విద్యానగర్, సంతోష్ నగర్, లక్ష్మి నగర్, నాదర్గుల్, బండ్లగూడ ప్రాంతాల్లో కూడా ఇళ్ళు కట్టుకుని వుండటం చూశాను. లాల్ దర్వాజా, నయాపూల్, చార్మినార్, మదీనా హోటల్, చత్రినాకలో అంత ఎక్కువగా లేవు. మరీ మెహదీపట్నం రాజేంద్రనగర్ లలో వున్నారు. సోషియాలజీ, జాగ్రఫీ చదవక పోవడం వల్ల సరిగ్గా అనలైజ్ చేయలేక పోయాను. ఈ సబ్జక్ట్ మీద ఓ సైద్ధాంతిక వ్యాసం రాసి ఉస్మానియాకు సమర్పించాలనే ఆలోచన వుంది. మీరేమైనా అనలైజ్ చేసి పెట్టగలరా?

    ReplyDelete
  16. I didn't see any coastal Andhrite in Jamesstreet and Hissamgunj that are close to Secunderabad railway station. Why do the busses that originate from Kakinada, Rajamundry and Vijayawada are destined to run upto Kukatpally and BHEL? Why aren't they destined to run upto Jubilee Bus station or Ranigunj?

    ReplyDelete
  17. దౌర్జన్యంతో ఉద్యమాలకు మద్దతు కూడగట్టుకోలేరు. ఇదీ ప్రజాస్వామ్య విధానం కాదు. తెలంగాణకు మద్దతు తెలపకపోవడానికీ, ఆ మాటకొస్తే వ్యతిరేకించడానికీ వారికి హక్కు ఉంది. ప్రజాస్వామ్య పరిధుల్లో తెలంగాణాని సాధించుకోవడానికి మీకెంత హక్కుందో అంతే హక్కు.

    దురద్ర్ష్టవశాత్తూ ఉద్యమానికి ప్రాతిపదికే విద్వేషంగా మారుతూంది. దారి తప్పిన నాయకులకు ఈ మేధావులూ, కళాకారులూ వంతపాడుతుంటే తెలంగానం వరస మారుతుంది.

    అన్నట్టు ఇది కూడా సాహితీద్రోహమే! :-)

    ReplyDelete
  18. అభ్యుదయ రచయితలమని చెప్పుకుంటూ తెలంగాణా ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోవడం సాహిత్య దోహం మాత్రమే కాదు, చరిత్ర ద్రోహమూ అవుతుంది.

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి