Saturday, 26 February 2011
Thursday, 24 February 2011
Wednesday, 23 February 2011
సీమంధ్ర సోదరులారా.. లగడపాటి & కో. లను వ్యతిరేకించండి.
భారత దేశ చరిత్రలో మొదటిసారిగా ఇంతటి సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతుంటే.. తెలంగాణ లో ఉద్యోగులు, విద్యార్థులు, లాయర్లు.. ప్రజలంతా తెలంగాణ కోసం ఉద్యమిస్తుంటే.. ఇవాళ లగడపాటి & కో. తెలంగాణ ఇస్తే దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలు ఇవ్వాల్సి వస్తుందని కరపత్రాలు పంచడం వారి అహంకారానికి నిదర్శనం.. నేరగాడు ఇతరులకు ఎంత ఇబ్బంది కలిగినా పట్టించుకోడు- అలాంటి స్వభావమే లగడపాటి & కో. లది. తెలంగాణ ఉద్యమం లో భాగంగా ఎలాంటి అవన్ఛనీయమైన సంఘటనలు జరిగినా ఇక లగడపాటి & కో. లదే బాధ్యత అవుతుంది.. సీమంధ్ర సోదరులారా.. లగడపాటి & కో. లను వ్యతిరేకించండి. వారి స్వార్ధ అవకాశ వాద రాజకీయాలను వ్యతిరేకించండి. వారి నేర ప్రవృత్తిని వ్యతిరేకించండి. జై తెలంగాణ! జై జై తెలంగాణ!
Tuesday, 22 February 2011
ఆలోచించండి సీమాంధ్ర సోదరులారా!
ప్రపంచ మేధావుల్ని, ప్రజాస్వామ్య దేశాల్ని సైతం ఆశ్చర్యపరుస్తూ అరబ్ ప్రజలు రోడ్లమీదికి వస్తున్నారు. ఇన్నాళ్లూ అన్ని రకాల నిర్బంధాలు, రాజరికాలు భరించిన వాళ్లు ఇవాళ స్వేచ్ఛకై, ప్రజాస్వామ్యానికై నినదిస్తున్నారు. ఆ దేశాల్లో ప్రజాస్వామ్యం కల్లేనని భావించిన ప్రజాస్వామ్యవాదులందరినీ ఈ పరిణామం ఒకింత ఆనంద డోలికల్లో తేలియాడిస్తున్నది. ఇది శుభపరిణామం!
ఇదే సందర్భంలో ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మనదేశంలో మాత్రం కొన్ని ప్రాంతాలు ఇంకా వివక్షకు, అణచివేతకు గురవుతున్నాయి. ఎంత విచిత్రం! అందులో ఒకటి- తెలంగాణ!
తెలంగాణవారు కేవలం ప్రత్యేక రాష్ట్రం మాత్రమే కోరుతున్నా వారి ఓపికను తెగేదాకా లాగుతున్న వైనం ప్రజాస్వామికవాదులంతా గమనిస్తున్నారు. ఇది ఏమి న్యాయం? తెలంగాణలో యాభై ఏళ్లకు పైగా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష రకరకాల రూపాల్లో వ్యక్తమవుతూనే ఉంది. ఇవాళ ఆ పోరాటం పతాక స్థాయికి చేరుకుంది. కనీ వినీ ఎరుగని పోరాట రూపాలు చూస్తున్నాం. సంవత్సరమంతా కష్టపడి చదివే విద్యార్థులు తమ హాల్‌టికెట్లనే చించేస్తూ 'తెలంగాణ వచ్చేదాకా పరీక్షలు రాయం' అని అనడం చిన్న విషయమేమీ కాదు.. తెలంగాణ ప్రాంతంలోని యూనివర్సిటీలన్నీ యుద్ధ క్షేత్రాలుగా మారడం చిన్న విషయమేమీ కాదు.. న్యాయవాదులంతా నిరసన నినాదాలవడం చిన్న విషయమేమీ కాదు.. ఉద్యోగులంతా నిరాహార దీక్షలు చేయడం చిన్న విషయమేమీ కాదు.. ఇవాళ దేశ చరిత్రలోనే ఎక్కడా జరగని సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తుండడం- ఇవన్నీ మామూలు విషయాలేమీ కావు. ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ జై తెలంగాణ నినాదం వినగానే శరీరాలు ఉద్యమ కెరటాలుగా ఎగిసిపడుతుండడం వారి ఆత్మగౌరవ ఆకాంక్షను బలంగా తెలియజేస్తున్నది.
ఇవాళ తెలంగాణ ప్రజలు తెలంగాణ వ్యతిరేక సంఘటన ఏది దొర్లినా ఎంతో ఉడికిపోతున్నారు. తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. ఆ ఆవేశంలోంచి పిడికిళ్లు బిగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏదేని ఒక ఉద్యమ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తమకు అందుబాటులో ఉన్నవారితో వాదోపవాదాలు చేస్తున్నారు. ఆక్రోశంతో, కడుపు మంటతో, గుండె మంటతో రకరకాలుగా వీళ్లు మసిలిపోతుంటే అవతలివారంతా నింపాదిగా, చులకనగా, వంకర నవ్వులతో గేలి చేస్తుండడం ఎంతవరకు సబబు? అవతలివారు అనేక మొఖాలతో వ్యవహరించడం ఏం న్యాయం? ఏం నీతి? నిరంతరం పోరాడుతూనే ఉన్న తెలంగాణపట్ల సానుభూతిగా ఆలోచించని వాళ్లని ఎలా అర్థం చేసుకోవాలి? ఎన్నాళ్లు తెలంగాణవారు చీదరిస్తున్నా, ఛీత్కరిస్తున్నా, 'ఉమ్మేస్తున్నా' పట్టించుకోనట్లు నటిస్తారు? ఒక్కసారి ఆలోచించండి సీమాంధ్ర సోదరులారా!
ఇవాళ తెలంగాణ వారి మనోభావాలు తీవ్ర ఉద్వేగాలకు గురవుతున్నాయి. ఉద్వేగాలు జ్వాలలై ఎగుస్తున్నాయి. ఇంతటి మానసిక ఉద్వేగాల్ని భరించడం ఎంత కష్టం? ఎన్నాళ్లు వీరి ఉద్వేగాలతో ఆడుకుంటారు? ఎన్నాళ్లు వీరి ఆకాంక్షల్ని తొక్కిపెడతారు? ఇకనైనా ఒకింత సహానుభూతితో ఆలోచించండి సోదరులారా! ఇవాళ శాంతియుతంగా మొదలైన సహాయ నిరాకరణ ఉద్యమం రేపు తీవ్రస్థాయికి చేరుకుని ఊహించరాని పరిణామాలకు దారి తీయక ముందే.. మన మధ్య సోదరభావం మాయమై శత్రుభావం పెంపొందకముందే ఒక్కొక్కరుగా ముందుకు రండి సోదరులారా! ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉండేందుకు ఉన్న అవకాశాన్ని వదులుకోవద్దు! మాట్లాడండి సోదరులారా.. శాంతియుతంగా విడిపోదాం.. సోదరభావంతో కలిసుందాం! ముందుకు రండి సోదరులారా!
Saturday, 19 February 2011
సీమంధ్ర రచయితలు తెలంగాణకు మద్దతు పలకాలి
ఆదిలాబాద్ లో జరుగుతున్న కథా సమ్మేళనం ను - సహాయ నిరాకరణ లో భాగంగా, సమైక్య వాదులతో వేదిక పంచుకోవడం సరైంది కాదనే మిత్రులతో ఏకీభవిస్తూ బహిష్కరించాము. తెలంగాణ కు మద్దతు గా తీర్మానం చేయాలని డిమాండ్ చేశాము. తెలంగాణ వ్యాప్తంగా సహాయ నిరాకరణ పూర్తి స్థాయిలో జరుగుతున్నది. సీమంధ్ర మీడియా వివక్ష చూపుతున్నది. ఇది ప్రజాస్వామ్య విధానం కాదు. ఈ విషయాలన్నీ గ్రహించి ఇప్పటికైనా సమైక్య వాద రచయితలు తెలంగాణ కు మద్దతు పలకాలి. లేదంటే చరిత్ర లో సాహితీ ద్రోహులు గా మిగిలిపోతారు. అరబ్ కంట్రీస్ లో జరుగుతున్న ఉద్యమాలను సపోర్ట్ చేసే రచయితలు తెలంగాణ కు మాత్రం ఎందుకు మద్దతివ్వరు? తన దాక వస్తే గాని- వారి నైజం బయట పడిందన్నమాట ... ఎంత సిగ్గుచేటు..!!
Monday, 14 February 2011
Subscribe to:
Posts (Atom)