నిన్ను తలంచే అలవాటు మానిపోవటం మంచిదయింది
ఆ సమయాన్ని ప్రియ తలంపులతో నింపుకుంటున్నాను
*
వెన్నెముకపై నిలవడం చేతకానివాడే నిన్నాశ్రయిస్తాడు
నమ్మకం- కనుపాపపై మొలిచే పువ్వు
*
ఏ నమ్మకాలూ లేక నిశ్చింతగా వున్నాను
వారి అపనమ్మకాలలో
నన్ను ముంచెత్తాలని చూస్తుంటారు
*
నీ దారిలో నడుస్తున్నవాళ్ళు
ఓ విషయాన్ని మర్చిపోతున్నారు
తమ అస్తిత్వాన్ని వాళ్ళెప్పుడో వదులుకున్నారు
*
ఉన్న దారుల్లోనే వాళ్ళు నడుస్తుంటారు
కొత్త దారులు వేసేవాళ్ళను అనుమానిస్తారు
నా మానాన నన్ను వదలరేమని విదుల్చుకుంటుంటాను
నా స్వేచ్ఛను సహించలేకే వారు నా వెంటపడుతుంటారు
*
వాదులాడి వాదులాడి
వారి సమయంతో పాటు
నా సమయాన్నీ పాడుచేస్తున్నారు
*
నీ కోసం అందమైన గది కడతారు వారు
అందులోనే జీవితాంతం బందీ లవుతారు
*
అనుక్షణం నిన్నే కొలవమంటుంటారు
అవసరమైన మరిదేన్నీ తలవకుండా చేస్తారు
*
వేర్లు వేర్లుగా విస్తరించలేనివారే
కొమ్మల్ని పట్టుకొని వేళ్ళాడుతుంటారు
*
నువ్వు లేవనుకునేవారి మధ్యా ఏ సమస్యా లేదు
నువ్వున్నావనుకునేవారే
రకరకాల పేర్లతో కొట్టుకుంటున్నారు
*
పోరాడే శక్తి లేనివాడే
పొర్లు దండాలు పెడుతుంటాడు
*
రోజూ కాస్త సమయాన్ని నీ కోసం వెచ్చిస్తున్నాను
నీవు లేవని నిరూపించడానికి
ఆ సమయాన్ని ప్రియ తలంపులతో నింపుకుంటున్నాను
*
వెన్నెముకపై నిలవడం చేతకానివాడే నిన్నాశ్రయిస్తాడు
నమ్మకం- కనుపాపపై మొలిచే పువ్వు
*
ఏ నమ్మకాలూ లేక నిశ్చింతగా వున్నాను
వారి అపనమ్మకాలలో
నన్ను ముంచెత్తాలని చూస్తుంటారు
*
నీ దారిలో నడుస్తున్నవాళ్ళు
ఓ విషయాన్ని మర్చిపోతున్నారు
తమ అస్తిత్వాన్ని వాళ్ళెప్పుడో వదులుకున్నారు
*
ఉన్న దారుల్లోనే వాళ్ళు నడుస్తుంటారు
కొత్త దారులు వేసేవాళ్ళను అనుమానిస్తారు
నా మానాన నన్ను వదలరేమని విదుల్చుకుంటుంటాను
నా స్వేచ్ఛను సహించలేకే వారు నా వెంటపడుతుంటారు
*
వాదులాడి వాదులాడి
వారి సమయంతో పాటు
నా సమయాన్నీ పాడుచేస్తున్నారు
*
నీ కోసం అందమైన గది కడతారు వారు
అందులోనే జీవితాంతం బందీ లవుతారు
*
అనుక్షణం నిన్నే కొలవమంటుంటారు
అవసరమైన మరిదేన్నీ తలవకుండా చేస్తారు
*
వేర్లు వేర్లుగా విస్తరించలేనివారే
కొమ్మల్ని పట్టుకొని వేళ్ళాడుతుంటారు
*
నువ్వు లేవనుకునేవారి మధ్యా ఏ సమస్యా లేదు
నువ్వున్నావనుకునేవారే
రకరకాల పేర్లతో కొట్టుకుంటున్నారు
*
పోరాడే శక్తి లేనివాడే
పొర్లు దండాలు పెడుతుంటాడు
*
రోజూ కాస్త సమయాన్ని నీ కోసం వెచ్చిస్తున్నాను
నీవు లేవని నిరూపించడానికి
E-X-C-E-L-L-E-N-T!!!!!
ReplyDeleteఈ కామెంట్ ని, పై కవితలోని ఓ బలమైన వాక్యాన్ని కోట్ చేస్తూ ప్రారంభిద్దామని చూశాను. కానీ, ఇన్ని అద్భుత వాక్యాల ముందు ఏ ఒక్క దాన్నో సెలెక్ట్ చేయడం నా వల్ల కాలేదు. ప్రతి మాటా ఓ తూటా లా ఉంది. మతం విషయంలో లిబరల్ గా ఉండేవారెవరైనా మొదట ప్రతిఘటనని తమ సొంత మతస్థులనుండే ఎదుర్కొంటారు. దీనిని పై కవిత చాలా చక్కగా ప్రతిబింబిస్తుంది.
shukriyaa bhai..!
ReplyDelete