అందరూ బాహ్య సౌకుమార్యాన్ని కోరుతున్నారు
నేను అంతర్ కోమలాన్ని వెతుకుతున్నాను
*
అందరూ మల్లెల గురించి మాట్లాడుతున్నారు
నేను నీ గురించి ఆలోచిస్తున్నాను
*
నా ఊహలపై తారాడే సీతాకోకవు
నిన్ను అందుకునే సున్నితత్వ సాధనలో ఉన్నాను
ఒక్కోసారి వెతుక్కుంటూ ఉంటాను
నన్ను పంచుకుంటానికి ఊహ ఉండదు దేహముండదు
*
నా మనసు పడ్డ ఇష్టాలను
లోక విరుద్ధమంటూ దూరం చేసి సంబరపడుతుంటారు
*
లోకం చుట్టిన ఒక్కో పొరా విడిచి నగ్నమయ్యాను
చేపలూ సీతాకోకలూ నాతో స్నేహించాయి
*
నీ నిరీక్షణలో కళ్ళ కింద ముడుతలు పడుతున్నాయి
నాకు నచ్చిన నువ్వు ఇంకా ఎదురుపడనే లేదు
*
అక్కడే నిలబడి ఎదురుచూస్తున్నాను
లోకమంతా తిరిగి నేనే నయమని వస్తావని...
బాబా. ఏంటిది. కొత్త బంగారు లోకంలో తిరుగుతున్నారు.
ReplyDeleteBhayya,
ReplyDeleteVery nice..
First two lines are very impressive..
Thanq..
yours,
Ramnarsimha,
(Pustakam)..
చాలా బావుంది
ReplyDeleteకొన్ని చరణాలు చాల బాగున్నాయి. ముఖ్యంగా.. ఊహలపై తారాడే సీతాకోకవు
ReplyDeleteనిన్ను అందుకునే సున్నితత్వ సాధనలో ఉన్నాను
ఒక్కోసారి వెతుక్కుంటూ ఉంటాను
ReplyDeleteనన్ను పంచుకుంటానికి ఊహ ఉండదు దేహముండదు
nice lines...deep...
చాల బాగుంది.....
ReplyDeleteచదువుకోడాన్కి చాల్రోజుల తర్వాత మంచి కవిత్వం దొరికింది.....
అర్థం చేసుకోవదానికి మంచి హృదయమున్న తత్వం దొరికింది....
నా ఊహలపై తారాడే సీతాకోక చిలుకవు
ReplyDeleteనిన్ను అందుకునే సున్నితత్వ సాధనలో వున్నాను ...
అక్కడే నిలబడి చూస్తున్నాను
లోకమంతా తిరిగి నేనే నయమని వస్తావని ...
అందుకే బాబాజీ మీ కవిత అంటే నేను అంత కలవరించేది!
అందుకోండి నా నిండిన మనసు అభినందనలు!