Wednesday, 28 August 2013
Saturday, 3 August 2013
సోయి KATHA
FRIENDS, SEE MY STORY IN TODAY'S NAMASTE TELANGANA
http://www.namasthetelangaana.com/Sunday/article.aspx?Category=10&subCategory=15&ContentId=265995
కారు విజయవాడ హైవే మీద ఉరుకుతున్నది. ఆఖరికి తను ఒక్కడె బయపూల్లడం జరంత బాదగ ఉన్నది శేఖర్‌డ్డికి. ఇయాల్టి దాంక పోదమనే అన్న హితేశ్ ఆఖరి నిమిషంల ఆళ్ల దోస్తులు ఏదొ పార్టికి పిలిషివూనని సారీ చెప్పేసిండు. కారు కొనంగనె నలుగురం కలిషి పొయ్ రావాల్నని ప్లాన్ చేసిండు తను. సైకిల్ మీద ఊర్లె తిరిగిన తను కారులో ఒకపాలి తన ఊరికి పొయ్ రావాల్నని పించింది. ఊర్లె ఇప్పుడు అమ్మా నాయ్‌న గుడ లేరు. ఒక్క చెల్లెవాళ్లె ఉన్నరు. ‘సర్లె, చెల్లెవాళ్లను చూసినట్లుంటది.. అట్లనె ఊర్లె ఉన్న దోస్తుల్ని కలిషినట్లుంటది’ అనుకుని బయల్దేరిండు. ముఖ్యంగ యాదగిరిని ఒకపాలి సూడాలన్పించింది శేఖర్‌కు. వాడు అప్పట్ల అతనికి ప్రాణం.. ఒక్క పల్లెంల తిని, ఒక్క పక్కల్నె పండుకున్నోల్ల్లు ఆళ్లిద్దరు!
సుజాత ‘జ్వరంగా ఉంది.. మూడ్ లేదు’ అని గొణిగి, ఆఖరికి రావాల్నని లేదని చెప్పేసింది. జరంత హర్టింగ్‌గా అనిపించింది. కనీ మామూలె. తల్లి రాననే సరికి హారిక గుడా ఎనకా ముందాడింది. సర్లె, తను, హితేషైనా పోతం గద అనుకున్నడు. ఆఖరికి వాడట్లా చెయ్యిచ్చిండు. ‘ఒక్కడే పోవడం అవసరమా?’ అనిపించింది కొద్దిగ. ‘కాని తను పుట్టి పెరిగిన ఊరు పోక షాన్నాళ్లయింది. ఈ ఆదివారం వేరే పని గూడ లేదు, పోవాల్సిందేనని’ బయల్దేరిండు.
చౌటుప్పల్ దాటినంక ఒక హోటల్ కాడ కారు ఆపి ఒక చాయ్ తాగి, సిగట్ ఎలిగించుకుండు. రోడ్డు పక్కన పెద్ద యాప చెట్టు కింద నిలబడ్డడు. ఆ గాలి పీల్చక షాన్నాళ్లయింది. హాయిగ అనిపించింది. హైదరాబాద్ పొయ్‌నంక స్వచ్ఛమైన గాలికి, ఆకుపచ్చదనానికి దూరమైపోయిండనిపించబట్టింది.
మల్ల మొదలయ్యిండు.
మామూలు స్పీడులో పోనిచ్చుకుంట సోంచాయిస్తున్నడు. ఊరి యాదులన్ని కుదిపేస్తున్నయ్. ఈపాలి తన ఊరు సూడక షానా ఏళ్లయింది. యాదగిరి ఎట్లున్నడో. వాడు ఎంత మంచివాడంటే అంత మంచోన్ని తన జిందగీల మరొకన్ని సూడలె. వాడు, తను ఎట్ల కలియ తిరిగేటోళ్లో... ఊర్లె అందరికి అదొక టాపికయ్యేది. తనెప్పుడూ వాళ్లింట్లనె ఎక్కువ గడిపేది. అసొంటిది, చదువు కోసం తను హైదరాబాద్ వచ్చేయడం, వాడు అక్కడ్నే ఉండిపోవడం తోటి దూరం పెరిగె. వాణ్ని గూడా వచ్చేయమని ఎంత గనమో బతిలాడిండు తను. వాడు వినలె. ‘లేదురా హైదరాబాదొచ్చి సదువుడు మాతోటి యాడైతది.. పైగ మా అమ్మనాయనలకు తోడుగుడ ఎవరు లేరు. నేను రాలేన్రా. ఆళ్లను చూసుకుంట, ఉన్న ఆ రెండెకరాల పొలం చేసుకుంట ఉండిపోతరా. ను పొయ్‌రా..’ అన్నడు బాదతోటె. మొదట్ల షానా ఉత్తరాలు రాసుకునేది. ఐటెంకెటైంక తగ్గిపాయె. ఆని పెండ్లిగ్గూడ సెలవు దొరక్క పోలేక పొయిండు తను. షానా బాద పడ్డడాడు. పెండ్లయ్ నంక ఇంకింత తగ్గిపొయింది మాట్లాడుకోడం. కనీ యాదిల్ల మాత్రం వాడి దోస్తానా సజీవంగ ఉండిపొయింది. తనగ్గూడా ఇద్దరు పిల్లలని చెప్పిండు ఒక పాపూప్పెడో.
కొత్తగ ఏసిన హైవే రోడ్డు నార్కట్‌పల్లి పోకుంట ఊరిబైటి నుంచి పోతుండడం చూసి కారు స్లో చేసుకుండు శేఖర్. ‘అయ్యో! నార్కట్‌పల్లిని అనాధను చేసిన్రా!’ అనిపించింది. చూసుకుంటనె పోదమని నార్కట్‌పల్లి దిక్కే పోనిచ్చిండు కారు. ఊర్లెకు పోతె ఒకప్పటంత సందడి లేనట్లు, చిన్నబోయినట్లు అనిపించింది. ‘‘ప్చ్’’ అనుకుంట కుడిదిక్కు నల్గొండ రోడ్డు మీదికి కారు మళ్లించిండు. ఫ్లోరిన్ నీళ్ల బాధితుల యల్లాడ్డిగూడెం- పక్కన చెర్వుగట్టు జాతర జరిగే యల్లాడ్డిగూడెం దాటుకుంట... కొత్తగ ఏర్పడ్డ మహాత్మాగాంధీ యూనివర్సిటీని చూసుకుంట నల్గొండ దగ్గరికి వచ్చేసిన్ననుకునేసరికి మనసు ఉరకపూయ్యబట్టింది. ‘ఇన్నాళ్లు తను ఈ రకమైన ఖుషీకి దూరమయ్యిండు గదా’ అనిపించింది.
తను, యాదగిరి ఇంటర్ చదువుతున్న రోజుల్ల ఊర్లె ఎన్ని కార్యక్షికమాలు చేసేదో. ఒక యువజన సంఘం పెట్టి దాని ద్వారా షానా పనులు చేసేది. నాటికలు వేయించేది. బడిలో పిల్లలకు ఆటల పోటీలు పెట్టించి బహుమతులు ఇప్పించేది. ప్రభుత్వ ప్రమేయం లేకుంటనే వయోజన విద్య చెప్పేది. భవిష్యత్తులో తమ ఊరిని ఆదర్శ గ్రామం చెయ్యాల్నని ఎన్ని కలలు కనేదో. అవన్నీ ఏమై పొయ్‌నయ్? వాడన్నా ఊర్లెనె ఉండి పొయిండు గని తనైతే ఊరికి దూరమై, ఇగో ఇన్నేండ్ల తర్వాత ఇట్ల పరాయోని లెక్క వస్తున్నడు!
తను పుట్టి పెరిగిన ఊరు. తనను తీర్చిదిద్దిన ఊరు. తనకెన్నో విద్యలు, బుద్ధులు నేర్పిన ఊరు.. తన యాదుల్లో ఎప్పటికీ అదొక అందమైన బంతి తోటే! కాని తను ఊరికి ఏం చేసిండు? తల్లి రుణం తీర్చుకునే ప్రయత్నం ఎన్నడన్నా చేసిండా? కనీసం అటు మళ్లీ చూస్తానికి గూడా టైం లేని బతుకు బతుకుతున్నడు. తను, తన భార్య, తన పిల్లలు, వారి బాగోగులు పట్టించుకోవడంలోనే జీవితం వాలిపోయింది.. ఇక ఊరి గురించి ఏం పట్టించుకుంటం?
ఏదేమైనా ఇన్నాళ్ల కష్టం తర్వాత తను కాస్త కుదుట పడ్డడు. హితేష్‌కు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం రావడం తోటి ఇక తన కష్టాలన్నీ తీరినట్లే. వాడింకా అమెరికా పోతానికి ట్రై చేస్తున్నడు. రేపో మాపో పోతడు. వాడు అమెరికా పొయిండనుకో మళ్ల తిరుగుండదు..! కని వాడు ఈ మధ్య పార్టీలు, పబ్బులకు బాగ అలవాటు పడుతున్నడు. జర వాన్ని దారిల పెట్టకపోతె కష్టం. ఇగ ఈ ఏడాదితోని హారిక ఎంబిబిఎస్ పూర్తయి పోతుంది. సుజాత ప్రైవేటు కాలేజిలో లెక్చరర్‌గ చేరింది. అదీ కొన్నాళ్లకు పర్మినెంటవుతది. మాదాపూర్‌లో ఒక ఫ్లాట్ కొన్నడు. ఇప్పటికిది సాలు! అనుకుంటె యమ హుషారుగ అన్పించింది శేఖర్‌డ్డికి. అంతల్నె మల్ల మనసులో ఎక్కడ్నో ఏదో వెలితి. ఏదో అసంతృప్తి. అదేందో ఎంతకు సమజ్ కాదు..!
ఏదేమన్న గాని హితేష్‌కు ఉద్యోగం రాంగనె వాడు చేసిన మొదటి పని కారు కొనడం. టూ వీలర్ నడిపీ నడిపీ విసిగిపోయిన తనకు ఈ కారు సుఖం హాయి నిస్తున్నది.
లతీఫ్ సాబు గుట్ట పలకరిస్తుండంగ కారు నల్గొండ టౌన్‌లోకి ప్రవేశించింది. నల్గొండ టౌన్ పెద్దగా ఏమీ మారలే. చుట్టూ కొన్ని కాలనీలు ఏర్పడ్డయ్. అంతె! రెండు పక్కల చూసుకుంట టౌన్ దాటి తమ ఊరి రోడ్డు మీదికి ఎక్కింది కారు. రెండు కిలోమీటర్లు పోంగనె కలెక్టర్ ఆఫీసు.
రోడ్డు పక్క హోటల్ కాడ ఆగి మళ్లొక చాయ్ తాగి సిగట్ ముట్టించుకున్నడు. ఆ రోడ్డెంట వస్తూ పోతున్న తమ ఊరి వాళ్లను చూసుకుంట గుర్తుపడ్తానికి కోషిష్ చేస్తున్నడు. కొన్ని ముఖాలు గుర్తొచ్చీ గుర్తుకు రాక, కొన్ని పేర్లు యాదొచ్చీ యాదికి రాక కిందా మీద పడుతున్నడు.
మల్ల కారు స్టార్ట్ చేసుకొని ఊర్లెకి అడుగుపెట్టిండు. అదే ఊరు. తన కలల్లో తిరిగే రూపం.. తన ప్రేయసితో తిరుగాడిన జ్ఞాపకాల హోరు.. తన మిత్రుడి దోస్తానా జోరు.. తన తల్లిదంవూడుల యాది. కండ్లల్ల నీల్లు నిండినయ్ శేఖర్‌కు.
అన్నేండ్లకు వచ్చేసరికి కొద్దిగ మార్పుపూయ్యో వొచ్చి ఏ గల్లీ ఏదో సమజ్ కాకుంటయ్యింది. ఊరి మధ్యలో రోడ్డు పక్కగా కారాపి తన చెల్లెలు ఉండే గల్లీ గురించి అడిగిండు. కారు ఆ గల్లీలోకి పోనిచ్చి చెల్లెలు ఇంటి ముందు ఆపిండు. పరేషాన్‌గ చూస్తున్నరు గల్లీవాళ్లు. తన బావ బైటనె నిలబడి సిగట్ తాగుతుండు గని ఎవరో అనుకుంటున్నట్లుండు. శేఖర్ కారు దిగంగనే గుర్తుపట్టి దబదబ వొచ్చి అల్లుకుపొయిండు. ‘వస్తున్నట్లు ఫోనన్నా చెయ్య లేదేంద’న్నడు. ఇంట్లోకి తోడ్కోని పొయ్యిండు. అంట్లు తోముతున్న శేఖర్ చెల్లె లేషి ఉర్కొచ్చినంత పనిచేసింది. చెల్లెను దగ్గరికి తీస్కొని తల నిమిరిండు శేఖర్. కండ్లల్ల నీల్లు తిరిగినయ్. తన తోబుట్టువు. ఎన్నాళ్లాయె సూడక.. ఎందుకిట్ల కఠినంగ తయారైనం? కనీసం తోబుట్టువుల్ని ఏడాదికొక్క సారన్నా చూసుకోలేని బతుకుపూందుకు? ఛత్!
తను తేరుకునే లోపల్నే చెల్లె గోడుగోడున ఏడ్వ బట్టింది. పరేశానయ్యిండు శేఖర్.
‘‘ఏందిరా.. ఏమైందిరా.. ఎందుకేడుస్తున్నవ్?’’ అనుకుంట ఓదార్చబొయిండు.
‘‘ఇక్కడ ఒక చెల్లె ఉన్నదని మర్చేపొయ్‌న వేందన్నా. మరీ ఇంత కానకుంటయినమా? ఎంత పట్నపోల్లయి పోతె మాత్రం మా దిక్కు మల్లి సూడకుంటయితవా?...’’ చెల్లె దు:ఖం ఎక్కుపెట్టిన ప్రశ్నలు బరిసెల్లా గుచ్చుకున్నై శేఖర్ గుండెల్ల. జవాబేం చెప్పాల్నో సమజ్ కాలె. షానా సేపు సప్పుడు చెయ్యలేకపొయిండు.
ఊర్లె బతకడం ఎంత కష్టమైతున్నదొ కష్టాలన్ని ఏకరువు పెట్టుకుంటనె ఆమ్లెట్‌లు ఏసి అన్నం పెట్టింది చెల్లె. కమ్మని చింతకాయ పచ్చడి అడిగి మరీ ఏయించు కొని ఇష్టంగ తిని చెల్లె కొడుకును ఎంట పెట్టుకుని యాదగిరి ఇంటికి బయల్దేరిండు శేఖర్.
అదే ఇల్లు! అట్లనె ఉంది. ఏం మారలె. పరేశానయిండు. కూలగొట్టి మల్ల కట్టి ఉంటరనుకున్నడు. కని అదేం లేదు. ఇల్లు సూపెట్టి చెల్లె కొడుకు ఎల్లిపొయిండు. తడికె జరుపుకొని ఇంట్లకు పొయిండు శేఖర్.
‘‘ఎవరయ్యా!’’ అని సూపుకు చెయ్యి ఆసరా ఇచ్చి అడుగుకుంట ఎదురుంగ నిలబడ్డది లచ్చమ్మ యాదగిరి అమ్మ.
‘‘నేను పెద్దమ్మా.. శేఖర్‌ను’’ అన్నడు.
కొద్దిసేపు గలిబిలైంది లచ్చమ్మ.
‘‘ఓ.. నువ్వా.. పిలగా! శాన్నాళ్ల కొత్తివీ?’’ అని ‘‘దా.. ఇంట్లకు’’ అని లోపట్కి తీస్కపొయింది.
సాయమాన్ల గోడ వారకు నిలబెట్టి ఉన్న నులక మంచం ఏసి ‘కూసో’ అనుకుంట ‘‘పిల్ల జెల్ల బాగున్నరా బిడ్డ?’’ అన్నది.
‘‘ఆఁ.. బాగనె ఉన్నరమ్మా! నువ్వెట్లున్నవ్?’’ అన్నడు శేఖర్.
‘‘ఆ.. నాదేవుందయ్య.. కండ్లు సరిగ కనబడ్తపూవ్. మోకాళ్ల నొప్పులు.. ఇంటికాణ్నె వుంటున్న.’’
‘‘ఎవ్వరు లేరేంది?’’
‘‘ఆఁ.. యాదిగాని పెండ్లాం ఆళ్ల అమ్మగారింటికి పొయింది. ఆని బిడ్డ గుడ దానెమ్మటె పొయింది. ఆని కొడుకు పొద్దున్లేషి పొయిండు. యాడికి పొయిండొ జాడ పత్త లేడు. ఆడు రోజంతె. యాళకు తిండి తినడు. యాళకు నిద్రపోడు. ఆని కతేందో ఆనయ్యకె తెలియాలె’’ అన్నది లచ్చమ్మ నారాజుగ.
‘అంటె, వాడు చదువు మద్యల వొదిలేషిండా ఏంది’ అన్న డౌటొచ్చింది శేఖర్‌కు. ఆ విషయం యాదగిరి నడగొచ్చుపూమ్మని ‘‘యాదగిరి యాడికి పొయిండు పెద్దమ్మా?’’ అనడిగిండు.
ఊర్లెకు రాంగనె తన భాష గుడ తన వేర్లు వెతుక్కుంటుండడం సమజైతనె ఉంది శేఖర్‌కు.
‘‘ఆడా.. ఆడొస్తున్నాలె. పొలం కాడికి పొయిండు’’ అన్నది లచ్చమ్మ. మల్ల తనె,
‘‘కల్లు తాగుతావ్ బిడ్డా.. జెరంతుంది’’ అనడిగింది.
కల్లు మాట ఇనంగనె పానం జిమన్నది. ‘ఎన్నాళ్లాయె కల్లు తాగక’ అనిపించింది. గని తమాయించుకొని.
‘‘ఇప్పుడొద్దమ్మ. తర్వాత సూద్దాం’’ అన్నడు.
అదొ ఇదొ మాట్లాడుకుంట కొద్దిసేపు కూసున్నంక బైట తడికె సప్పుడైంది.
బైటికి సూషిండు శేఖర్. తడికె జరుపుకుంట లోపట్కొస్తుండు యాదగిరి. ఒంటిమీద ఫుల్లు బనీను, లుంగీ మీదున్నడు. గడ్డం తెల్లబడ్డది. మొఖం మీద ముడత లొచ్చినయ్.
లేషి నిలబడ్డడు శేఖర్. యాదగిరి మల్ల తడికె ఏసి ఎనక్కు మల్లి శేఖర్‌ను సూస్కుంట
‘‘ఓ నువ్వారా? షాన్నాళ్ల కొస్తివీ!?’’ అనుకుంట దబదబ శేఖర్ దిక్కు అడుగులేషిండు.
‘‘ఎట్లున్నవ్‌రా..?’’ అనుకుంట చేతులు సాపి ముందుకు నడిషిండు శేఖర్.
ఇద్దరు ఆత్మీయంగ అలయ్‌బలయ్ తీసుకున్నరు. గుండెలు బరు శేఖర్‌కు. తన దోస్తు. తన పాణం. వీన్ని ఒక్క రోజు కలవకుంట ఉండకపొయ్యేది. హైదరాబాద్ పొయ్యి ఏమైపొయిండు తను.
‘‘కూసోరా!’’ అనుకుంట ఆ మంచం పైన్నే తనొక పక్క కూసున్నడు యాదగిరి. యాదగిరి కండ్లల్ల నీల్లు నిండడం సూషి తట్టుకోలేకపొయిండు శేఖర్.
‘‘ఏంద్రా ఇట్ల కలవకుంటయి పొయ్‌నమేంద్రా మనం. ఇట్ల ఐతదని అస్సలు ఊహించినమా? ఎన్నెన్ని అనుకొనేది. అయన్నీ ఏమైపొయ్‌నయ్‌రా..!’’ అన్నడు శేఖర్ గొంతు పూడుకుపోతుండంగ.
‘‘ఏం చేస్తం రా. నువ్వట్ల పట్నం పోతివి. నేనేమో ఇక్కడ్నే ఉండిపోతి. బతకాలె గదా. ఏ జీవికి దగ్గట్టు ఆ జీవి తనకు తగ్గ సోటు ఎతుక్కుంటది!’’ అన్నడు యాదగిరి.
ఆ మాట యాణ్నో తగిలినట్లనిపించింది శేఖర్‌కు. జరసేపు మనసంత మొద్దుబారినట్లయ్యింది..
యాదగిరి అదొ ఇదొ మాట్లాడిస్తుంటె పైన పైన జవాబ్ లిచ్చి, జర సుతరాయించుకొని అడిగిండు.
‘‘ఊట్లుందిరా..?’’ అని
‘‘ఊరా.. ఊరంత ఖరాబైందిరా..! పొద్దు గూకితె యాడికాడ తాగుడు. ఎవనింట్ల వాడు టీవీల కతుక్కుపోవుడు. చీకటి పడ్డదంటె ఆ దండుబాట మీదికి పోబుద్దే ఐతలేదుర. ఎవ్వడు కల్వడు. జర ఈ మజ్జెల ఊర్లె మందు అమ్ముడు బంద్ జేయించిన్రు. లేకపోతె ఎవన్ని సూశినా మందు కంపు గొట్టేది.’’
‘‘జనం మందుకు గిట్ల అలవాటు పడ్డరేందిర. మనప్పుడు ఇంతగనం లేదు గద!’’
‘‘ఓ.. నీకు తెల్వనియి షానా జరిగినయ్‌రా. ఈ గల్లి గల్లంతా మొగోల్లంత సచ్చిపాయిరి. దాదాపు అందరు తాగి సచ్చినోళ్లేరా. ఆన్నించి ఈడిదాంక ఆడోళ్లంత ముండ మోసిరి. అట్ల ఊర్లె ఎంతమందో..!’’
‘‘మరె దీన్ని ఊర్లె ఎవరు పట్టించుకుంటలేరా? సర్పంచ్ గిట్ల ఏం జేస్తున్రు?’’
‘‘సర్పంచే పొద్దుగూకితె తాగుతుండె. ఇగ ఏరేటోళ్లను ఎట్ల బంద్ జేయిస్తడు.’’
‘‘అవునా! మరెట్ల బందయింది?!’’
‘‘అదొ పెద్ద కత లేరా! ముందు ఇది జెప్పు. పిల్లలు ఎట్లున్నరు? వదిన ఎట్లుంది?’’ అడిగిండు యాదగిరి.
‘‘పిల్లలు బాగున్నరు. మీ వదిన గుడ బాగుంది. ప్రైవేటు కాలేజిలో పాఠాలు చెప్తున్నదిరా!’’ అన్నడు శేఖర్.
‘‘అట్లనా! నిమ్మలంగ ఉన్నరు గదా.. అదే సంతోషం.’’
‘‘మీ వాడు ఏం చేస్తున్నడ్రా?’’ ఇంట్రస్టుగ అడిగిండు శేఖర్.
‘‘ఆడా! ఆడు మంచి పనులె చేస్తున్నడ్రా! కాకపోతె పైస ఆమ్దని లేదు గడియ పుర్సత్ లేదు. పొద్దున్లేవంగనె పోతడు. మల్ల ఏ అద్దరేతిరొ వొస్తడు. ఒక్కోపాలి రానె రాడు. ఊర్లె ఆడు, ఆని దోస్తు యూసుఫ్ కలిసి మందు బంద్జేయించిన్రు. ఈ ఒక్క ఊర్లెనె గాకుండ సుట్టుపక్కల ఊర్లన్నిట్ల బంద్ జేయించిన్రు. ఊర్లన్ని ఆదర్శ గ్రామాలయ్యేటట్లు చేస్తున్నరు. ఊర్లల్లకు పోతె అందరు మావోన్ని దేవుడంటున్నరు. హహ్హహ్హ! ఇంట్లనేమొ తిండి కెల్లక పరేశానైతున్నం. గదేమో అంటరు గదా ‘పైన షేర్వాని లోపల పరేశాని’ అంటె గిదేనేమొరా!’’
‘‘సదువు ఎందుకు వొదిలేషిండ్రా మీ వోడు?’’
‘‘డిగ్రీ పాసైనంక హైదరాబాద్ పొమ్మన్నరా. ఆడు పోలే. సదువు సాలు నాయ్‌నా! నేను ఊరు వొదిలి పోవాలనుకుంటలేను. మన ఊరికి, మన ఊర్లసొంటి ఊర్లకు ఏదొ ఒకటి చెయ్యాల్నని ఉంది నాయ్‌నా’’ అన్నడు. ఏం చేస్తడొ నాకేం అర్ధం కాకున్నా, వాడి తెలివిమీద నమ్మకం నాకు. ఎక్కడ్లేని పుస్తకాలు సదువుతడాడు. ఎవ్వనికి తొయ్యని తీర్పులిస్తడు. ‘సరేలేరా! నీ యిష్టం’ అన్న. ఏడాది తిరిగేసరికి మన ఊరి తీరే మార్చేసిండాడు! అదేదొ లోకల్ మేడ్ వస్తువుల బిజినెస్ చేస్కుంట వాని మందం పైసలు ఎల్లదీస్కుంటడు. ఇగ మిగిలిన టైమంత మనూరి పనులు, సుట్టుపక్కల ఊర్లు తిరుగుడు చేస్తుంటడు. ఆనికి ఆ యూసుఫ్ తోడు.’’
‘‘యూసుఫ్ ఎవర్రా?!’’ అడిగిండు శేఖర్.
‘‘యూసుఫా? ఆడు మన లతీఫ్ గాని కొడుకు. ఆడు, మావోడు మన లెక్కనె జిగ్రి దోస్తులు. ఈల్లిద్దరు ఊకోరు. ఆళ్ల దోస్తుల్ని ఊకొనియ్యరు. ఊర్లె ఏ సమస్యొచ్చినా మా పెర్కోల్లను, ముస్లింలను, గొల్లోల్లను, గౌండ్లోల్లను, సాకలోల్లను, మాల మాదిగోల్లనంత ఏకం జేస్తున్నర్రా! ‘అట్లెందుకురా’ అంటె బహుజన వాదం అంటరు. ఆఖరికి ఊర్లె ఏ కొట్లాటొచ్చినా మీ రెడ్డోళ్లంత ఒక దిక్కు, ఈళ్లంత ఒక జట్టయితున్నర్రా! ఆళ్ల ఆలోచన జూస్తే నాకె పర్శాననిపిస్తది! షానా పని జేస్తున్నరులె..!’’
‘‘మంచిదె కదరా! మనం చిన్నప్పుడు అనుకున్న మనం చెయ్యలేకపొయ్‌నా మీవోడు చేస్తున్నడు. అందుకు సంతోషమే కదరా!’’ అన్నడు శేఖర్ కొద్దిగ ఇబ్బందిగ.
ఇంట్ల నించి ఈల్ల దిక్కు ఒచ్చిన లచ్చమ్మ ఈల్ల మాటలు ఇని ‘‘ఆఁ.. ఏం సంతోషం కొడ్కా! ఆడు సెదువు వొదిలేషినప్పట్సంది నేన్ చెప్తనె ఉన్న, జెర ఆన్ని దారిల పెట్టుర అని. ఇన్నడా? ఈని పెంపకమె ఆన్ని అట్ల జేసింది. గా పైసవూలాని పనులు జేస్తుంటడు. ఇప్పుడేవుంది, తిండికెల్లక సెస్తున్నం. ఇంక ఉన్న ఆ ఒక్క పిల్ల పెండ్లి జేస్తాల్కె ఎల్తది గోసిత్తుల గాషారం!’’ నిష్టూరంగ అనుకుంట మల్ల లోపట్కి పొయింది.
‘‘అట్లెందుకురా. మరి ఇంత పని జేస్కుంట ఏదన్న రాజకీయ పార్టీల జేరొచ్చు గదరా!’’ అడిగిండు శేఖర్.
‘‘ఆఁ... ఈనికి ఈ రాజకీయాలంటె ఇష్టం లేదుర. నేను పనిజేయదగ్గ పార్టీలు గావంటడు. మల్ల రాజకీయ నాయకుల కన్న ఎక్కువ ఈడె అందరి పనులకోసం తిరుగుతుంటడు! పైస తినడు. ఉంటె ఈని జేబుల్నుంచె పెడతడు. ఈడంటె ఇక్కడి ఎమ్మెల్యేకు గుడ మంచి గురి. ఆల్ల పార్టీల చేరమన్నడంట. ఈడు నవ్వి ఊకున్న డంట. ఈడు తెలంగాణ కోసం పని జేస్తుంటె తెలంగాణ పార్టీ వాళ్లు గుడా అడిగివూనట. అందుల గుడ జేరలె’’ అన్నడు యాదగిరి.
‘‘ఐతె మీవోడు తెలంగాణ కోసం గుడా పని చేస్తున్నడా! మంచిదె గద!’’
‘‘ఇటు పక్క తెలంగాణ ఉద్యమం అంతగ లేకుండె రా. ఈడు ఆ నినాదం ఎత్తుకొని ప్రతి ఒక్కడు జై తెలంగాణ అనేటట్లు చేసిండు. ఈ మండలం మండల మంత ఈడన్న మాటె అందరి మాటైపొయింది. కింది వర్గాలల్ల మంచి చైతన్యమె తెస్తుండురా!’’ అన్నడు మురిపెంగ యాదగిరి. అంతకు ముందు లేని హుషారొచ్చింది యాదగిరి మొఖంల.
‘‘ఏం పేర్రా!!??’’ కొంచెం ఆశ్చర్యంగ అడిగిండు శేఖర్.
‘‘సాయిచంద్ర!’’ చెప్పిండు యాదగిరి తృప్తిగ. పేరు చెబుతుంటె ఒకింత గర్వం తొంగిచూసింది ఆ గొంతుల.
‘‘అరె.. పాయిలి సాయిచంద్ర! విన్న పేరే!’’ టక్కున అనేసిండు శేఖర్.
‘‘వినడమేందిరా వారాని కొక్కసారన్న పేపర్ల ఆని గురించి వార్తలొస్తనె ఉంటయ్’’ అన్నడు యాదగిరి.
‘‘ఔనౌను..’’ తడబడ్డడు శేఖర్. తను తెలుగు పేపర్లు సూడడం మానేసి షాన్నాళ్లే అయింది. పిల్లల కోసమని ఇంగ్లీష్ పేపరేయించుకుంట అదే సూసుడు అలవాటయింది. గని, సాయిచంద్ర పేరు మాత్రం షానాసార్లే దోస్తులు చెప్పుకుంటుంటె విన్నట్లు గుర్తు. ఏదేమైన యాదగిరి కొడుకు ఈ ఏరియా కంత చంద్రుడే! ఎంత తేడా! తాము ఊర్లు వొదిలి పోయి తమ బాగు తాము సూసుకుంటుంటె, యాదగిరి లాంటి వాడు తాను ఇక్కడ ఉండడమే కాకుండా తన కొడుకు తన ఒక్క ఊరికె కాకుంట ఈ ఏరియ కంత మేలు చేసేటట్లు చేసిండు. ఎంత గొప్ప విషయం అనుకుంట ఆలోచనల్ల పడిపొయిండు శేఖర్. అంతల...
‘‘నీ కొడుకేం జేస్తున్నడ్రా!’’ ఉత్సాహంగ అడిగిండు యాదగిరి.
భూమిలోకి తల వొంగిపోయి సోంచాయిస్తున్న శేఖర్ ఆ ప్రశ్నతోటి ఉలిక్కిపడ్డడు. కడుపుల తిప్పినట్లయింది. మనసు తడబడింది. అన్నాళ్లు తన కొడుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీరైండని షానా గొప్పగా చెప్పుకుంట వొస్తున్న శేఖర్‌కు ఇప్పుడేం చెప్పాల్నో షానాసేపటి దాంక సమజ్ కాలె!

Subscribe to:
Posts (Atom)