Thursday, 20 September 2012

చలో తెలంగాణ మార్చ్


జంగ్

ధన దాహం
కులం మదం
అణగార్చిన ఆకాంక్షల్ని
అణచే ఉంచాలనే వ్యూహాలు
చాలు.. చాలిక!
అవమానాలు మనకు
ఆధిపత్యాలు వాళ్ళకా...??

బలి కావడాలు
బలిదానాలు.. చాలు!
బలి కోరడమే మిగిలిందిక

కణజాలం కదులుతున్నది
అణువణువు అంటుకుంటున్నది
విడి శక్తులన్ని మోపుకొస్తున్నయ్
బిగిస్తున్న పిడికిళ్ళు
పిగులుతున్న నరాలు
మరుగుతున్న నెత్తురు
ఉగ్గబట్టిన ఉక్రోశం
ఉప్పెనలా ఎగుస్తున్నది

వీరులను మర్లేసుకొని...
ఓపిగ్గా అడుగేస్తున్న ఉద్యమం
జంగ్ సైరన్ మోగించింది

కన్నీటి చారికలు
ఉప్పు కత్తులై లేస్తాయ్
ఎండిన పేగుల్ని
మా చేతులు ఉరితాళ్ళలా
విసురుతాయ్
మండే గుండెల్
మందు పాతరలై పేల్తాయ్

కవాతుకు కదం తొక్కుతున్నం
తలకు కఫన్ కట్టుకొని
కదులుతున్నం
విజయమో.. వీరస్వర్గమో...

వీర అంశ ఉన్న దేహం
ఎన్ని ముళ్ళ కంచెలు చుట్టినా
ఎన్ని తుపాకులు ఎక్కుపెట్టినా
విప్లవిస్తూనే ఉంటుంది
లక్ష్యం చేరేదాక!


published in Namaste Telangana Daily 19.09.2012